• ఇటలీ: 89 మంది బిలియనీర్లతో ఇటలీ 6వ స్థానంలో ఉంది. వీరి మొత్తం సంపద $483 బిలియన్ డాలర్లు. $89.3 బిలియన్ డాలర్ల సంపదతో జియాన్కార్లో దేవసిని ఇటలీలో అత్యధిక ధనవంతులుగా టాప్ లో ఉన్నారు.
• కెనడా: కెనడా 82 మంది బిలియనీర్లతో 7వ స్థానంలో నిలిచింది. వీరి మొత్తం సంపద $457 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇక్కడ 76 మంది బిలియనీర్లు, $349 బిలియన్ డాలర్ల సంపద ఉండేది. $110 బిలియన్ డాలర్లతో చాంగ్పెంగ్ జావో కెనడాలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నారు.
• హాంగ్కాంగ్: 71 మంది బిలియనీర్లతో హాంగ్కాంగ్ 8వ స్థానంలో ఉంది. వీరి మొత్తం ఉమ్మడి సంపద $420 బిలియన్ డాలర్లు.
• బ్రెజిల్: 70 మంది బిలియనీర్లతో బ్రెజిల్ 9వ స్థానాన్ని దక్కించుకుంది. వీరి మొత్తం సంపద $265 బిలియన్ డాలర్లుగా నమోదైంది. $35.9 బిలియన్ డాలర్లతో ఎడ్వర్డో సేవరిన్ బ్రెజిల్ టాప్ రిచెస్ట్ పర్సన్గా నిలిచారు.
• తైవాన్: 66 మంది బిలియనీర్లతో తైవాన్ 10వ స్థానంలో నిలిచింది. వీరి ఉమ్మడి సంపద విలువ $245 బిలియన్ డాలర్లుగా ఉంది.