ఈ పర్వతం స్పెషాలిటీ...
ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ నడిబొడ్డున ఉన్న ఈ పర్వతం పేరు ఉలూరు. ఈ దేశంలోని అత్యంత సహజసిద్ధంగా ఏర్పడిన ప్రదేశాల్లో ఇది ఒకటి. ఈ పర్వతాన్ని ఏయర్స్ రాక్ అని కూడా పిలుస్తారు. ఇది ఏకశిల. రోజంతా సూర్యకాంతి ఈ పర్వతంపై పడటం వల్ల మనకు రోజంతా రంగులు మారుతున్నట్లుగా కనిపిస్తుంది. సూర్యకాంతి ఎక్కువగా ఉన్నప్పుడు గులాబీ రంగులో.. కాంతి తగ్గుతున్న సమయంలో నారింజ రంగులో కనిపిస్తుంది.
ఉలూరు పర్వతం ఎందుకు రంగులు మారుతుంది..?
సూర్యోదయం సమయంలో ఈ ఉలూరు పర్వతం.. లేత గులాబీ రంగులో , మధ్యాహ్నం ఎండలో నారింజ, కాషాయ రంగులో, మధ్యాహ్నం ఎరుపు రంగులో.. సూర్యాస్తమయం సమయంలో ఊదా రంగులో కనపడుతుంది. ఈ పర్వతంలో ని ఇనుప ఖనిజాలు సూర్యరశ్మి తగిలి.. కాలక్రమేణా ఆక్సీకరణం చెందడం వల్ల.. ఈ పర్వతం రంగులు మారుతూ కనిపిస్తుంది. సూర్యరశ్మి మారుతున్నప్పుడల్లా.. పర్వతం రంగు మారుతూ కనపడుతుంది.