Money Tree : ఈ అడవుల్లో డబ్బుల చెట్లు నిజంగానే కనిపిస్తాయి... ఎక్కడో తెలుసా?

Published : Jul 14, 2026, 12:00 PM IST

డబ్బులు కాసే చెట్టు కథల్లోనే ఉంటాయనుకుంటాం. కానీ నిజంగానే వేలకొద్దీ నాణేలతో నిండిన వింత చెట్లు ఓ అడవిలో కనిపిస్తుంటాయి. వీటి వెనుక ఉన్న కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

PREV
13
డబ్బులు చెట్లకు కాస్తాయా?

ఏదైనా కాస్ట్లీ వస్తువును ఎవరైనా కొన్నా, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చే చేసినా  ‘వాళ్ల ఇంట్లో చెట్టుకు డబ్బులు కాస్తున్నాయేమో’ అంటుంటారు. తక్కువ ధర వస్తువు ఎక్కువకు అమ్మడానికి చూసినా ‘డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయా’ అనడం వింటుంటాం. అంతేకాదు కొన్ని పురాాతన కథలు, స్టోరీ బుక్స్ లో కూడా డబ్బులు కాసే చెట్ల ప్రస్తావన ఉంటుంది… ఇలాంటి కథలను నేటితరం రీడర్స్ కూడా ఆసక్తికరంగా చదువుతారు. ఇలాా వివిధ సందర్భాల్లో 'డబ్బులు కాసే చెట్ల' ప్రస్తావన వస్తుంటుంది… మరి నిజంగానే చెట్లకు డబ్బులు కాస్తాయా? డబ్బుల చెట్లు ఎక్కడైనా ఉన్నాయా? అనేది తెలుసుకుందాం. 

స్కాట్లాండ్‌లోని దట్టమైన అడవుల్లో ముఖ్యంగా చాలా ఏళ్లనాటి చెట్ల కాండాలపై వందలాది నాణేలు కనిపిస్తాయి. కాండం కాస్త తొలిచిచూస్తే వేలకొద్ది నాణేలు బైటపడుతుంటాయి. స్థానికులు ఈ చెట్లను "కాయిన్ ట్రీస్" (Coin Trees) లేదా "విషింగ్ ట్రీస్" (Wishing Trees) అని పిలుస్తారు. ఇవి కేవలం చెట్లు మాత్రమే కాదు శతాబ్దాలుగా ప్రజల నమ్మకాలకు, మొక్కులకు నిలువుటద్దం పడుతున్న చారిత్రక చిహ్నాలు.

ఈ కాయిన్ ట్రీస్ వెనుక ఆసక్తికర స్టోరీ

స్కాట్లాండ్ అడవుల్లోని ఈ కాయిన్ ట్రీస్ వెనుక ఒక ఆసక్తికరమైన జానపద కథ ఉంది. పూర్వకాలంలో చెట్లకు దైవశక్తులు ఉన్నాయని ప్రజలు నమ్మేవారట. అందుకే ఆ చెట్లను తమ పూర్వీకులు పూజించేవారని ఈ తరంవారు చెబుతుంటారు. 

జబ్బులు నయమవుతాయని నమ్మకం : ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఒక నాణేన్ని ఈ విష్ ట్రీ చెట్టు బెరడులోకి గట్టిగా గుచ్చేవారు. దీంతో ఆ జబ్బును చెట్టు తీసుకుని వాళ్లను బాగు చేస్తుందని నమ్మేవారు.

కోరికలు నెరవేరడానికి : తమ కోరికలు నెరవేరాలని ఒక నాణేన్ని చెట్టు బెరడుపై రాళ్లతో కొట్టి లోపలికి దింపుతారు. ఆ నాణెం చెట్టులోకి ఎంత లోతుగా వెళ్తే, కోరిక అంత త్వరగా నెరవేరుతుందని ప్రజలు విశ్వసించేవారు.

అయితే ఈ చెట్టులో ఉన్న నాణేన్ని ఎవరైనా దురాశతో దొంగిలిస్తే, వాళ్లకు కీడు జరుగుతుందని లేదా జబ్బులు వస్తాయని కూడా ఓ నమ్మకం ఉంది.

Courtesy : ads_facts Instagram Page 

23
కాయిన్ ట్రీస్ చారిత్రక నేపథ్యం

చెట్టు కాండంకు కాయిన్స్ గుచ్చే సంప్రదాయం స్కాట్లాండ్‌లో 1700ల నుంచే వస్తోంది. ముఖ్యంగా స్కాట్లాండ్‌లోని హైలాండ్స్ (Highlands) ప్రాంతంలో ఉన్న 'ఐల్ మేరీ' (Isle Maree) దీవిలోని ఒక ఓక్ చెట్టు చాలా ఫేమస్. 1877లో ఇంగ్లాండ్ రాణి క్వీన్ విక్టోరియా ఈ చెట్టును చూసినప్పుడు, దాని బెరడు మొత్తం నాణేలతో నిండి ఉండటం చూసి ఆశ్చర్యపోయి తన డైరీలో రాసుకున్నారు. 

అర్గిల్ (Argyll) ప్రాంతంలోని 'ఆర్డ్‌మ్యాడీ హౌస్' (Ardmaddy House) దగ్గర కూడా ఇలాంటి పురాతన 'హాథార్న్' (Hawthorn) రకం చెట్టు ఉంది. దీన్ని సంతాన సాఫల్యానికి చిహ్నంగా చూస్తారు.

Courtesy : sabiha0521 Instagram Page

 

33
ఈ రోజుల్లో మనీ ట్రీకి ఎందుకంత ప్రాధాన్యం?

ప్రస్తుతం ఇలాంటి చెట్లు స్కాట్లాండ్ పర్యాటక ప్రదేశాల్లో ఒక మిస్టరీగా నిలుస్తున్నాయి. ప్రకృతికి, మనిషి నమ్మకాలకు మధ్య ఇవి ఒక వారధిలా కనిపిస్తాయి. కాలక్రమేణా చెట్లు పెరిగేకొద్దీ, నాణేల చుట్టూ బెరడు పెరిగి వాటిని తనలో కలిపేసుకుంటుంది. ఇది ఒక వింతైన "సజీవ చారిత్రక రికార్డు"లా మారుతుంది.

ఒక కళారూపం

ఈ రోజుల్లో చాలామంది తమ పర్యటనకు గుర్తుగా ఇలా చేస్తున్నారు. స్కాట్లాండ్‌లోని చాలా అటవీ ప్రాంతాల్లో ఇప్పటికీ పర్యాటకులు చిన్న రాళ్లతో నాణేలను చెట్లకు గుచ్చి తమ ప్రేమను, కోరికలను వ్యక్తపరచడం చూడొచ్చు. ఇది కేవలం మూఢనమ్మకం అనడం కంటే, ప్రజల సంస్కృతిని చాటిచెప్పే ఒక కళారూపంగా మారిపోయింది.

చెట్టుపై నాణేలను కొట్టే ఈ చర్య, ప్రకృతికి హాని కలగకుండా చాలా తక్కువ స్థాయిలో, కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే సంప్రదాయంగా కొనసాగుతోంది. మీరు ఎప్పుడైనా స్కాట్లాండ్ వెళ్తే, ఈ "డబ్బులు కాసే" వింత చెట్లను సందర్శించండి. ఒక చిన్న నాణేన్ని అక్కడ పెట్టి మీ కోరికను చెప్పుకోవడం, ఆ ప్రాంత సంప్రదాయంతో మిమ్మల్ని కనెక్ట్ చేసే ఒక ప్రత్యేకమైన అనుభవంగా మిగిలిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories