Haunted Beach: బీచ్ పేరు చెబితేనే ఎంతోమంది మనసు ఉల్లాసంతో ఎగిరి గంతేస్తుంది. కానీ మన దేశంలో ఉన్న ఒక బీచ్ మాత్రం చాలా భయంకరమైనది. ఆ బీచ్ కి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారని అక్కడ ఉన్న స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు.
మనసు ప్రశాంతంగా ఉండాలంటే మొదట అందరూ వెళ్లేది బీచ్‌కే. దాదాపు సముద్ర ప్రాంతానికి దగ్గరలో ఉన్న వారంతా ప్రతిరోజు బీచ్‌కు వెళ్లి ఎందుకు ఇష్టపడతారు. స్పటికం లాంటి స్వచ్ఛమైన నీళ్లు, కొట్టుకొస్తున్న అలలూ, సూర్యరశ్మి, ఇసుక తిన్నెలు అన్నీ కలిసి అద్భుతమైన వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తాయి. భారతీయ బీచులు ఎన్నో చాలా అందంగా ఉంటాయి. కానీ మనదేశంలోనే ఒక భయానకమైన బీచ్ ఉంది. చీకటి పడితే చాలు ఆ బీచ్ దరిదాపులకు కూడా ఎవరూ వెళ్లరు. అక్కడ రాత్రంతా గడిపిన వారు తిరిగి రారని కూడా చెప్పుకుంటారు. ఆ బీచ్ పేరు డుమాస్ బీచ్. గుజరాత్ రాష్ట్రంలో ఇది ఉంది.
23
నల్లని ఇసుక
స్థానికంగా దెయ్యాలు తిరిగే ప్రాంతాలుగా కొన్ని ప్రాంతాలు గుర్తింపు పొందుతాయి. అలాగే అరేబియా సముద్ర తీరంలో ఉన్న డుమాస్ బీచ్ కూడా దెయ్యాలు తిరిగే ప్రదేశంగా చుట్టుపక్కల వారు చెప్పుకుంటారు. ఈ బీచ్ రెండు కారణాలు కారణాలవల్ల ప్రసిద్ధి చెందింది. ఇక్కడ బీచ్ లోని ఇసుక నల్లగా ఉంటుంది. అలాగే భారతదేశంలో భయం గొలిపే బీచులలో ఇది ఒకటి. ఈ బీచ్ ఒకప్పుడు స్మశాన వాటికని, అందుకే అక్కడ దెయ్యాలు తిరుగుతాయని చుట్టుపక్కల ప్రజలు వివరిస్తున్నారు.
33
స్మశాన వాటిక వల్లే సమస్యలు
డుమాస్ బీచ్ లోని ఇసుక నల్లగా మారడానికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. బీచ్ సమీపంలో నివసించే ప్రజలు చెప్పిన వివరాల ప్రకారం వందల ఏళ్ల క్రితం అక్కడ స్మశాన వాటిక ఉండేది. మరణించిన వారి బూడిద తెల్ల ఇసుకతో కలిసిపోయి అలా ఇసుక నల్లగా మారిందని చెప్పుకుంటారు. అయితే ఇది సరైనదని చెప్పే ఎలాంటి సాక్ష్యాలు అక్కడ లేవు. అదేంటో ఈ బీచ్ లోకి వెళ్లగానే ఒక వింత అనుభూతి కలుగుతుంది. సాధారణంగా బీచ్ లోకి వెళ్లగానే ఉల్లాసంగా అనిపించాలి కానీ ఈ బీచ్ లో నిల్చోగానే ఏదో ప్రతికూల శక్తి లాగుతున్నట్టు అనిపిస్తుంది. సాయంత్రం వేళల్లో ప్రజలు ఈ బీచ్ దరిదాపులకు కూడా వెళ్లరు. అలాగే రాత్రిపూట ఈ బీచ్ నుండి వింత శబ్దాలు వస్తాయని ప్రజలు చెబుతూ ఉంటారు. కొంతమంది నవ్వులు, ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయని ఆ బీచ్ లో ఆత్మలు తిరుగుతాయి అన్నది స్థానికుల నమ్మకం.