చేసే పనిలో పర్ఫెక్షన్ ఉంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించారు ఈ స్నేక్ క్యాచర్స్. పాములు పట్టే స్థాయినుండి ఏకంగా దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మశ్రీ పొందే స్ధాయికి చేరుకున్నాారు. ఎవరీ వడివేేల్ గోపాల్, మాసి సదైయన్..?
Success Story : పని ఏదైనా సరే... అందులో పట్టు సాధిస్తే సక్సెస్ దానంతట అదే వెతుక్కుంటూ వస్తుంది. చిన్నది, పెద్దది అని కాదు... చేసే పనిలో నిబద్దత చాలా అవసరం. దేశాన్ని పాలించే ప్రధాని అయినా... రోడ్లు ఊడ్చే పారిశుద్ద్య కార్మికులైనా తమ పని పర్పెక్ట్ గా చేయాలి... చీపురు పట్టి రోడ్డు ఊడిస్తే అంతకంటే బాగా ఎవ్వరూ చేయకూడదు అన్నట్లుగా ఉండాలి.. ఈ పనిలోనూ ఇంత పర్పెక్షన్ ఉండాలి. ఇలా ఇద్దరు పాములుపట్టే వ్యక్తులు తమ పనితీరుతో ఏకంగా దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీ సాధించారు. వీరి సక్సెస్ స్టోరీ గురించి ఇక్కడ తెలుసుకుందాం.
24
ఎవరీ వడివేల్ గోపాల్, మాసి సదైయన్..?
తమిళనాడుకు చెందిన గిరిజన తెగ ఇరుల... వీళ్లు కేరళ, కర్ణాటకలో కూడా విస్తరించి ఉన్నారు. వీరికి ప్రమాదకరమైన పాములను పట్టుకోవడంలో మంచి పట్టు ఉంటుంది… పూర్వీకుల నుండి ఇదే పని చేస్తున్నారు. అలాగే ఎలుకలు పట్టడం, తెనెను సేకరించడం వంటి పనులే జీవనాధారం. ఈ ఇరుల తెగకు చెందినవారే వడివేల్ గోపాల్, మాసి సదైవన్.
పాములు పట్టడమే ప్రధాన వృత్తిగా మార్చుకున్నారు గోపాల్, సదైయన్. ఆదునిక స్నేక్ క్యాచర్స్ మాదిరిగా కాకుండా వీళ్లు పాములు పట్టేందుకు తమ పూర్వికుల టెక్నిక్ ను వాడతారు. ఇలా ఇప్పటివరకు వేలాది పాములు పట్టారు... ఇందులో ప్రమాదకమైన పాములు ఎన్నో ఉన్నాయి. అత్యంత చాకచక్యంగా కేవలం ఓ కర్ర సాయంతోనే కింగ్ కోబ్రా లాంటి డేంజరస్ పాములను కూడా పడతారు. పాములు పట్టడంలో వీళ్లు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.
34
పాములు పట్టేవారికి పద్మశ్రీ...
తమిళనాడుకు చెందిన వడివేల్ గోపాలన్, మాసి సదైయన్ కేవలం పాములు పట్టడమే కాదు.. వాటి విషాన్ని సేకరించి యాంటి వేనమ్ తయారీలో సహాయపడుతున్నారు. భారతదేశంలో పాము విషాన్ని అత్యధికంగా ఉత్పత్తిచేసే ఇరుల స్నేక్ క్యాచర్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్ సొసైటీలో వీళ్లు సభ్యులు. ఆధునిక పరికరాలు లేకుండా సాంప్రదాయ పద్దతిలో వీళ్లు పాములను పట్టి యాంటి వీనమ్ తయారీ ప్రయోగశాలలకు సరఫరా చేస్తుంటారు. పాముకాటు సమయాల్లో ఈ యాంటీ వీనమ్ నే ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగిస్తారు… కాబట్టి పాముల నుండి విషం సేకరించడం అనేది వైద్యారోగ్య రంగంలో చాలా కీలకమైన ప్రక్రియ.
తమ ప్రాణాలకు తెగించి పాములు పట్టి విషాన్ని సేకరిస్తూ వైద్యారోగ్య రంగంలో సేవలందిస్తున్న వడివేల్ గోపాల్, మాసి సదైయన్ లను ప్రభుత్వం గుర్తించారు. వీరి నిస్వార్థ సేవకు గాను దేశ అత్యున్నత పురస్కారం పద్మశ్రీకి ఎంపిక చేసింది. 2023 లో ఈ ఇద్దరూ రాష్ట్రపతి చేతులమీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. చేసే పనిలో పర్పెక్షన్ ఉంటే సామాన్యులు సైతం అత్యున్నత విజయాలు సాధించవచ్చని ఈ ఇద్దరు పాములుపట్టేవారు నిరూపించారు.
సాధారణంగా బాగా చదువుకుని ఉద్యోగం కోసమో... లేదంటే బాగా డబ్బులుండి వ్యాపారం కోసమో విదేశాలకు వెళ్లేవారిని చూస్తుంటాం. కానీ తమ వడివేల్ గోపాల్, మాసి సదైయన్ కేవలం పాములు పట్టేందుకు అమెరికా వెళ్లారు... ప్లోరిడా వన్యప్రాణి అధికారులే వారిని స్వయంగా ఆహ్వానించారు.
2017 లో ప్లోరిడా అధికారులు అత్యంత ప్రమాదకరమైన బర్మీస్ కొండచిలువలను పట్టుకునే పనిని గోపాల్, సదైయన్ కు అప్పగించారు. వీళ్లు కేవలం రెండు వారాల్లోనే ఏకంగా 14 కొండచిలువలు పట్టుకున్నారు. అంతేకాదు ఈ పాములను పట్టడంతో అక్కడి వన్యప్రాణి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. పాములు పట్టేందుకు అగ్రరాజ్యం అమెరికా వీరిని తీసుకెళ్లిందంటేనే తమ వృత్తిలో వీళ్లు ఎంతటి నైపుణ్యం కలిగివున్నారో అర్థమవుతుంది.