School Uniforms : ఒక్కో స్కూల్ యూనిఫామ్స్ ఒక్కోలా ఉంటాయి.. ఎందుకో తెలుసా?

Published : Sep 02, 2026, 06:07 PM IST

భారతదేశంలోని ఒక్కో స్కూల్ యూనిఫామ్ ఒక్కోరకంగా ఉంటుంది… ఇలా రకరకాలుగా రంగుల్లో యూనిఫామ్స్ ఉండటానికి కారణాలేంటో తెలుసా? అన్ని స్కూళ్లకు ఒకే రకమైన డ్రెస్ కోడ్ ఎందుకుండదు?

PREV
16
ఇండియాలోని అన్ని స్కూల్ యూనిఫామ్స్ ఒకేలా ఎందుకుండవు

మీరు ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఇంట్లోంచి బయటకు వెళితే చాలు స్కూల్‌ పిల్లలు కనిపిస్తారు. ఈ సమయంలో వాళ్ల యూనిఫామ్స్ గమనిస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి స్కూల్‌కు సొంత యూనిఫామ్ ఉంటుంది… ఆ డిజైన్లు చాలా విభిన్నంగా ఉంటాయి. ఒక స్కూల్‌లో షర్ట్-ప్యాంట్ ఉంటే, మరో స్కూల్‌లో కుర్తా లేదా బ్లేజర్ ఉండొచ్చు. మరి దేశమంతటికీ ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు? దీనికి ఒకటి కాదు చాలా కారణాలున్నాయి.

26
స్కూల్ గుర్తింపు కోసం యూనిఫామ్
యూనిఫామ్ వల్ల విద్యార్థులు ఏ స్కూల్‌కు చెందినవారో సులభంగా గుర్తించవచ్చు. రంగులు, బ్యాడ్జ్‌లు, ప్యాటర్న్‌ల వంటివి ఆ విద్యాసంస్థను గుర్తించడానికి, విద్యార్థుల్లో ఒక సమూహమనే భావనను పెంచడానికి ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ (NCF) 2023 కూడా నొక్కి చెప్పింది.
36
వాతావరణానికి తగిన దుస్తులు

యూనిఫామ్ డిజైన్‌ను వాతావరణం బాగా ప్రభావితం చేస్తుంది. ఉదాహరణకు వేడి ప్రాంతాల్లోని స్కూళ్లు తేలికైన, గాలి ఆడే దుస్తులను ఎంచుకుంటాయి. అదే చల్లని ప్రాంతాల్లోని స్కూళ్లలో స్వెటర్లు, బ్లేజర్లు ధరిస్తారు. యూనిఫామ్ ఎంపికలో వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని NCF కూడా చెబుతోంది.

46
రంగులతో ప్రత్యేక గుర్తింపు
స్కూళ్లు తమ యూనిఫామ్స్‌లో, స్పోర్ట్స్‌వేర్‌లో ప్రత్యేకమైన రంగులను వాడతాయి. ఈ రంగుల ద్వారా విద్యార్థులను వేరుగా గుర్తించవచ్చు. ఇది తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును, బ్రాండ్‌ను సృష్టించుకోవడానికి స్కూళ్లకు సహాయపడుతుంది.
56
విద్యార్థుల్లో వ్యత్యాసాలు తొలగించడానికే యూనిఫామ్

స్కూళ్లలో యూనిఫామ్స్ పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పరిశోధనల ప్రకారం, యూనిఫామ్ ధరించడం వల్ల విద్యార్థుల మధ్య బట్టల విషయంలో కనిపించే వ్యత్యాసాలు తగ్గుతాయి. పేద, ధనిక అనే తేడా కనిపించకుండా అందరూ సమానమనే భావన కలుగుతుంది.

ప్రతి స్కూల్‌కు దాని సొంత చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. ఇవి యూనిఫామ్ డిజైన్‌పై ప్రభావం చూపుతాయి. కొన్ని స్కూళ్లు ఏళ్ల తరబడి తమ పాత యూనిఫామ్ డిజైన్‌నే కొనసాగిస్తాయి. మరికొన్ని స్కూళ్లు కాలానుగుణంగా డిజైన్లను మారుస్తూ సంప్రదాయానికి, ఆధునికతకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తాయి.

యూనిఫామ్ ఫ్యాబ్రిక్, డిజైన్ ఎంపికలో ప్రాక్టికాలిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆ యూనిఫామ్‌ను కొనుగోలు చేయగలగాలి. అలాగే విద్యార్థులు రోజంతా దాన్ని సౌకర్యవంతంగా ధరించగలగాలి.

66
దేశమంతటా ఒకే యూనిఫామ్ ఎందుకు లేదు?
భారతదేశంలో భౌగోళిక, సాంస్కృతిక వైవిధ్యం చాలా ఎక్కువ. అందుకే దేశవ్యాప్తంగా ఒకే యూనిఫామ్‌ను అమలు చేయడం అసాధ్యం. ప్రతి స్కూల్‌కు దాని సొంత వాతావరణం, చరిత్ర, గుర్తింపు, ఇతర ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. అందుకే ఒక స్కూల్‌కు మరో స్కూల్‌కు యూనిఫామ్ డిజైన్లలో చాలా తేడాలు ఉంటాయి.
Read more Photos on
click me!

Recommended Stories