Psychology: సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ 5 లక్షణాలు ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులే!

Published : Sep 02, 2026, 03:52 PM IST

Psychology: భార్యాభర్తల బంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, కష్టాల్లో తోడుగా నిలవడం కూడా అంతే ముఖ్యం. భర్త మనసులో భార్య స్థానం ఏంటో అతని ప్రవర్తనలో తెలిసిపోతుంది. సైకాలజీ ప్రకారం బంగారంలాంటి భర్తలో ఉండే 5 లక్షణాలేంటో ఇక్కడ చూద్దాం.

PREV
16
మంచి భర్తలో ఉండే 5 లక్షణాలు

భార్యాభర్తల బంధం అంటే కలిసి జీవించడం మాత్రమే కాదు.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం, గౌరవించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలవడం కూడా. పెళ్లి తర్వాత జీవితంలో ఎన్నో బాధ్యతలు, ఒత్తిళ్లు, అభిప్రాయ భేదాలు ఎదురవుతుంటాయి. ఇలాంటి సమయంలో భాగస్వామి ఎలా స్పందిస్తున్నారన్నదే ఆ బంధం ఎంత హెల్తీగా ఉందో చెప్పగలదు. సైకాలజీ ప్రకారం మీ భర్తలో ఈ ఐదు లక్షణాలు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులనే చెప్పొచ్చు.

26
బాధ్యతలను పంచుకోవడం

కుటుంబ బాధ్యతలు కేవలం భార్యే చూసుకోవాలనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. కానీ ఇంటి పనులు, పిల్లల బాధ్యతలు, ఆర్థిక విషయాలు లేదా కుటుంబానికి సంబంధించిన ఇతర నిర్ణయాల్లో భర్త కూడా తన వంతు బాధ్యత తీసుకుంటే ఆ బంధం హెల్తీగా ఉంటుంది. భార్య అలసిపోయినప్పుడు పనిలో సహాయం చేయడం, అవసరమైన సమయంలో బాధ్యత తీసుకోవడం వంటి పనులు ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమను పెంచుతాయి.

36
తప్పు చేస్తే సారీ చెప్పడం

ప్రతి మనిషి తప్పులు చేయడం సహజం. అయితే తప్పు చేసిన తర్వాత దాన్ని అంగీకరించడం, అవసరమైతే క్షమాపణ చెప్పడం చాలా ముఖ్యమైన లక్షణం. కొందరు తప్పును ఒప్పుకోవడం తమ గౌరవానికి భంగం అనుకుంటారు. కానీ హెల్తీ రిలేషన్ షిప్ లో తప్పు ఒప్పుకోవడం, సారీ చెప్పడం, బలహీనత కాదు.. మెచ్యూరిటీ. గొడవ జరిగినప్పుడు ఎవరు గెలిచారనే దానికంటే, సమస్య ఎలా పరిష్కరించారనేదే ముఖ్యం.

46
చిన్న విషయాల్లోనూ కేర్ చూపించడం

ప్రేమ అంటే ఎప్పుడూ ఖరీదైన బహుమతులు ఇవ్వడం లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ప్రేమను చూపించడం కాదు. రోజువారీ జీవితంలోని చిన్న చిన్న విషయాల్లో కనిపించే శ్రద్ధ కూడా ప్రేమకు సంకేతమే. మీరు అలసిపోయారని గమనించడం, భోజనం చేశారా అని అడగడం, మీకు ఇష్టమైన విషయం గుర్తుపెట్టుకోవడం, మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు మాట్లాడేందుకు సమయం కేటాయించడం వంటి చిన్న పనులు మీపై అతనికి ఉన్న శ్రద్ధను చూపిస్తాయి.

56
కోపంలోనూ హద్దు దాటకపోవడం

భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావడం సహజం. ఏ బంధంలోనైనా కోపం, నిరాశ, వాదనలు ఉండొచ్చు. అయితే కోపం వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారన్నదే అసలు విషయం. మీ భర్తకు కోపం వచ్చినా మిమ్మల్ని అవమానించడం, తిట్టడం, బెదిరించడం, భయపెట్టడం లేదా శారీరకంగా హింసించడం వంటి హద్దులు దాటకుండా తన భావోద్వేగాలను నియంత్రించగలిగితే అది చాలా మంచి లక్షణం. కోపాన్ని పూర్తిగా అణచివేయడం కంటే, దాన్ని గౌరవప్రదంగా వ్యక్తపరచడం ముఖ్యం.

66
మీ కన్నీళ్లను తేలికగా తీసుకోకపోవడం

మీరు బాధపడుతున్నప్పుడు “ఇంత చిన్న విషయానికే ఎందుకు ఏడుస్తావు?” అంటూ మీ భావాలను కొట్టిపారేయకుండా, ఎందుకు బాధపడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేసే భర్త మీ ఎమోషన్స్ ని గౌరవిస్తున్నాడని చెప్పొచ్చు. ప్రతి సమస్యకు వెంటనే పరిష్కారం చెప్పడం కంటే, కొన్ని సందర్భాల్లో పక్కన కూర్చుని వినడం, ఓదార్పు ఇవ్వడం కూడా అవసరమే.

Read more Photos on
click me!

Recommended Stories