Protein Condom: ప్ర‌పంచంలోనే తొలి ప్రోటీన్ కండోమ్‌.. అస‌లేంటీది.? నిజంగానే ప‌ని చేస్తుందా.?

Published : Mar 31, 2026, 03:15 PM IST

Protein Condom: ఫిట్‌నెస్ ప్రపంచంలో “ప్రోటీన్” అనే పదం చాలా సాధారణం. మజిల్స్ పెంచుకోవడం, బాడీ రికవరీ కోసం ప్రోటీన్ ముఖ్యమని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రోటీన్ పేరు మరో విచిత్రమైన ఉత్పత్తితో వైరల్ అవుతోంది. అది “ప్రోటీన్ కండోమ్”. 

PREV
15
వైరల్ అవుతోన్న‌ ప్రోటీన్ కండోమ్

ఇటీవల సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రోడక్ట్ గురించి విపరీతంగా చర్చ జరుగుతోంది. అది ప్రపంచంలోనే మొదటి “ప్రోటీన్ కండోమ్” అని ప్రచారం చేస్తున్నారు. ఇది సాధారణంగా రక్షణ ఇవ్వడమే కాదు, పనితీరును కూడా మెరుగుపరుస్తుందని అంటున్నారు. వినడానికి కొంచెం విచిత్రంగా అనిపించినా ఈ వార్త వేగంగా వైరల్

25
ఫ్లైయింగ్ బీస్ట్ బ్రాండ్‌తో

ఈ ప్రోడక్ట్‌ను ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్, యూట్యూబర్ గౌరవ్ తనేజా (Flying Beast) తో అనుసంధానం చేస్తున్నారు. ఆయనకు చెందిన BeastLife అనే ఫిట్‌నెస్ బ్రాండ్ దీన్ని పరిచయం చేయబోతుందని ప్రచారం జరిగింది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన‌ ఒక పోస్ట్‌లో “ప్రోటీన్ గుడ్‌నెస్ క‌మింగ్ సూన్‌” అని రాసి టీజర్ విడుదల చేశారు. తర్వాత “వ‌ర‌ల్డ్ ఫ‌స్ట్ ప్రోటీన్ కండోమ్‌” అని మరో టీజర్ రావడంతో ఆసక్తి మరింత పెరిగింది.

35
ఇందులో ప్ర‌త్యేక‌త ఏంటి.?

రిపోర్టుల ప్రకారం ఈ కండోమ్‌లో L-Arginine అనే అమినో యాసిడ్ ఉపయోగించారట. ఈ పదార్థం శరీరంలో రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుందని చెబుతారు. అందువల్ల మెరుగైన బ్లడ్ ఫ్లో వల్ల పనితీరు కూడా మెరుగుపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు బలమైన శాస్త్రీయ ఆధారాలు బయటకు రాలేదు.

45
వేరువేరు ఫ్లేవర్లలో

ఈ ప్రోడక్ట్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఫ్లేవర్లతో రావచ్చని చెబుతున్నారు. చాక్లెట్, స్ట్రాబెరీ, వెనిల్లా వంటి ఫ్లేవర్లలో మార్కెట్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఇది నిజంగా మార్కెట్‌లోకి వస్తుందా లేదా కేవలం ప్రచార వ్యూహమా అన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

55
సోషల్ మీడియాలో ఫ‌న్నీ రియాక్ష‌న్స్

ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత ఇంటర్నెట్‌లో చాలామంది ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. కొందరు దీన్ని సరదాగా తీసుకుంటున్నారు. మరికొందరు ఇది ఏప్రిల్ ఫూల్ జోక్ కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొందరు యూజర్లు “ఇది ప్రీ-వర్కౌట్ లేదా పోస్ట్-వర్కౌట్ ప్రోడక్టా?” అని సరదాగా కామెంట్లు కూడా చేస్తున్నారు. ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. నిజంగా ఇలాంటి ఉత్పత్తులు పనితీరును పెంచగలవా లేక ఇది కేవలం మార్కెటింగ్ ఐడియా మాత్రమేనా అన్న ప్రశ్నకు స‌మాధానం తెలియాల్సి ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories