Time: గంట‌కు 60 నిమిషాలే ఎందుకు ఉంటాయి.? ఇంత‌కీ దీనిని ఎవ‌రు నిర్ణ‌యించారు.

Published : Mar 31, 2026, 11:50 AM IST

Time: మన రోజువారీ జీవితం మొత్తం సమయం చుట్టూ తిరుగుతుంది. ఉదయం లేవడం నుంచి ప‌డుకునే వ‌ర‌కు ప్రతీ పని గ‌డియారాన్ని చూస్తూనే చేస్తుంటాం. అయితే గంట‌కు 60 నిమిషాలు మాత్ర‌మే ఎందుకు ఉన్నాయ‌ని ఎప్పుడైనా ఆలోచించారా.? 

PREV
14
సమయం లెక్కల ఆరంభం అక్క‌డి నుంచే

సుమారు 4000 సంవత్సరాల క్రితం మెసపొటేమియా (ఇప్పటి ఇరాక్ ప్రాంతం)లో ఉన్న సుమేరియన్, బిలోనియన్ నాగరికతలు గణితంతో పాటు ఖగోళ శాస్త్రంలో పెద్ద ముందడుగు వేశాయి. వారు ఉపయోగించిన లెక్కల విధానాన్ని సెక్సేజిమల్ విధానం (Sexagesimal System) అంటారు. ఇది 60 ఆధారంగా ఉండే లెక్కల విధానం. ఇప్పుడు మనం ఉపయోగించే డెసిమ‌ల్ సిస్ట‌మ్‌ (10 ఆధారంగా లెక్కలు) కంటే భిన్నంగా, అప్పటి ప్రజలు 12, 60 సంఖ్యలను ఆధారంగా తీసుకుని లెక్కలు వేసేవారు. ఇదే విధానం తర్వాత కాలంలో సమయాన్ని కొలిచే పద్ధతికి బలమైన పునాది అయింది.

24
60 సంఖ్యను ఎందుకు ఎంచుకున్నారు?

పురాతన కాలంలో ప్రజలు చేతి వేళ్లతో లెక్కలు వేసేవారు. కుడి చేతి బొటనవేలు ద్వారా ఎడమ చేతి నాలుగు వేళ్లలోని మూడు భాగాలను లెక్కిస్తే మొత్తం 12 వరకు లెక్కించవచ్చు. అలా 12ను ఐదు సార్లు లెక్కిస్తే 60 సంఖ్య వస్తుంది. మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే, 60 సంఖ్యను అనేక సంఖ్యలతో సులభంగా భాగించవచ్చు. ఉదాహరణకు 2, 3, 4, 5, 6, 10, 12, 15, 20, 30. ఇలా చాలా సంఖ్యలతో సులభంగా విభజించవచ్చు. అందుకే ఖగోళ శాస్త్రం, వ్యాపారం, లెక్కలలో ఉపయోగించడానికి 60 చాలా సౌకర్యంగా ఉండేది. ఈ కారణంగా ఒక గంటలో 60 నిమిషాలు అనే విధానం ఏర్పడింది.

34
ఈజిప్ట్‌లో 24 గంటల రోజు ఎలా వచ్చింది?

రోజును 24 గంటలుగా విభజించే ఆలోచన మొదటగా పురాతన ఈజిప్ట్ నాగరికతలో వచ్చింది. ఈజిప్ట్ ప్రజలు సన్‌డయల్ (సూర్య ఘడియారం) అనే పరికరాన్ని ఉపయోగించి సమయాన్ని కొలిచేవారు. సూర్యుడి కాంతి, నీడల ఆధారంగా వారు రోజును 12 భాగాలుగా విభజించారు. తర్వాత రాత్రిని కూడా 12 భాగాలుగా విభజించారు. ఇలా కలిపి మొత్తం 24 గంటల రోజు అనే వ్యవస్థ ఏర్పడింది.

44
సమయం కొలిచే విధానం ఎలా అభివృద్ధి చెందింది?

ప్రారంభంలో ఈ పద్ధతి ప్రపంచమంతా వెంటనే వ్యాప్తి చెందలేదు. ప్రతి ప్రాంతం తమకు నచ్చిన విధంగా సమయాన్ని లెక్కించేది. తర్వాత యూరప్‌లో మెకానికల్ క్లాక్స్ (యంత్ర గడియారాలు) తయారవ్వడం ప్రారంభమైంది. దీంతో సమయాన్ని మరింత కచ్చితంగా కొలవడం సాధ్యమైంది. 17వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు సెకండ్లను కూడా కచ్చితంగా కొలవడం ప్రారంభించారు. గెలిలియో, క్రిస్టియన్ హైగెన్స్ వంటి శాస్త్రవేత్తలు పెండులం గడియారాన్ని తయారు చేయడంతో సమయం కొలిచే విధానం మరింత కచ్చితంగా మారింది. అప్పటి నుంచి ఒక గంట = 60 నిమిషాలు, ఒక నిమిషం = 60 సెకండ్లు అనే విధానం ప్రపంచవ్యాప్తంగా స్థిరపడింది.

Read more Photos on
click me!

Recommended Stories