Fact: కొత్త వాటర్ బాటిల్‌లో ఈ ప్యాకెట్స్ ఎందుకు ఇస్తారు.? ఇంతకీ వీటితో ఏం చేయాలి.?

Published : Mar 31, 2026, 08:20 AM IST

Fact: కొత్త చెప్పులు, బ్యాగులు, వాటర్ బాటిల్స్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినప్పుడు బాక్స్ తెరిచిన వెంటనే అందులో చిన్న ప్యాకెట్లు కనిపిస్తాయి. చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఈ చిన్న ప్యాకెట్లు చాలా ఉపయోగకరమైనవి మీకు తెలుసా.?

PREV
15
సిలికా జెల్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

సిలికా జెల్ ప్యాకెట్‌లో చిన్న చిన్న తెల్లటి లేదా పారదర్శక గింజలు ఉంటాయి. ఇవి సిలికాన్ డయాక్సైడ్ అనే పదార్థంతో తయారు చేస్తారు. ఈ గింజలపై చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి. గాలిలో ఉండే తేమలోని నీటి బిందువులు ఈ రంధ్రాల్లోకి చేరుతాయి.

అందువల్ల ఇవి తేమను బాగా పీల్చుకుంటాయి. సాధారణంగా ఒక సిలికా జెల్ తన బరువులో సుమారు 40 శాతం వరకు తేమను పీల్చుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. అందుకే వస్తువులు తేమ వల్ల పాడవకుండా ఉండేందుకు కంపెనీలు ఈ ప్యాకెట్లు బాక్స్‌లో ఉంచుతాయి. తేమ ఉన్న ప్రదేశాల్లో బ్యాక్టీరియా, ఫంగస్ (మోల్డ్) త్వరగా పెరుగుతాయి. సిలికా జెల్ తేమను తగ్గించడం వల్ల వస్తువులు సురక్షితంగా ఉంటాయి.

25

35
బాక్సుల్లో సిలికా జెల్ ప్యాకెట్లు ఎందుకు ఉంచుతారు?

చెప్పులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, వాటర్ బాటిల్స్, టిఫిన్ బాక్సులు వంటి వస్తువులు తేమకు గురైతే అవి చెడిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పుల్లో తేమ ఉంటే ఫంగస్ లేదా దుర్వాసన రావచ్చు.ఎలక్ట్రానిక్ వస్తువులు తేమ వల్ల పాడవచ్చు. ప్యాకేజింగ్‌లో తేమ ఉంటే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే తయారీ సంస్థలు ప్యాకింగ్ సమయంలో సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచుతాయి. దీంతో ప్యాకేజింగ్‌లో తేమ తగ్గి వస్తువులు మంచి స్థితిలో వినియోగదారుడికి చేరుతాయి.

45
ఇంట్లో సిలికా జెల్ ప్యాకెట్ల ఉపయోగాలు

సిలికా జెల్ ప్యాకెట్లు ఇంట్లో కూడా చాలా ఉపయోగపడతాయి.

అల్మారాలో దుర్వాసన తగ్గించేందుకు

బట్టల అల్మారాలో లేదా డ్రాయర్‌లో కొన్ని ప్యాకెట్లు ఉంచితే తేమ తగ్గి దుర్వాసన రాకుండా ఉంటుంది.

మేకప్ వస్తువులు తాజాగా ఉండేందుకు

పౌడర్, ఫౌండేషన్ వంటి మేకప్ వస్తువులు తేమ వల్ల త్వరగా చెడిపోతాయి. మేకప్ బాక్స్‌లో సిలికా జెల్ ఉంచితే అవి ఎక్కువ రోజులు బాగుంటాయి.

ఇనుము వస్తువులు తుప్పు ప‌ట్ట‌కుండా

బాత్రూమ్ డ్రాయర్‌లో లేదా టూల్ బాక్స్‌లో ఉంచితే నెయిల్ కట్టర్, రేజర్, స్పానర్ వంటి వస్తువులకు తుప్పు పడే అవకాశం తగ్గుతుంది.

జిమ్ బ్యాగ్‌లో దుర్వాసన తగ్గించేందుకు

చెమట పట్టిన బట్టలు, షూస్ వల్ల బ్యాగ్‌లో వాసన వస్తుంది. సిలికా జెల్ ప్యాకెట్లు తేమను పీల్చి వాసన తగ్గించడంలో సహాయపడతాయి.

నీళ్లలో పడిన ఫోన్‌ను రక్షించడంలో కూడా

ఫోన్ నీళ్లలో పడితే చాలా మంది భయపడిపోతారు. అలాంటి సమయంలో సిలికా జెల్ ప్యాకెట్లు ఉపయోగపడవచ్చు. ముందుగా ఫోన్‌ను ఆఫ్ చేసి, బ్యాటరీ ఉంటే తీసేయాలి. తర్వాత బయట తేమను తుడవాలి. ఆ తర్వాత ఫోన్, బ్యాటరీని కొన్ని సిలికా జెల్ ప్యాకెట్లతో కలిసి జిప్ లాక్ కవర్‌లో ఉంచి ఒక రాత్రంతా అలాగే ఉంచాలి. సిలికా జెల్ తేమను పీల్చుకోవడం వల్ల ఫోన్‌లోని నీరు కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన డాక్యుమెంట్లు, ఫోటోలు రక్షించేందుకు

పుట్టిన సర్టిఫికేట్, పాస్‌పోర్ట్ కాపీలు, పాత ఫోటోలు వంటి ముఖ్యమైన పత్రాలు తేమ వల్ల చెడిపోవచ్చు. ఫైల్ క్యాబినెట్ లేదా డాక్యుమెంట్ బాక్స్‌లో ఒకటి లేదా రెండు సిలికా జెల్ ప్యాకెట్లు ఉంచితే తేమ తగ్గి పత్రాలు సురక్షితంగా ఉంటాయి. అలాగే పాత ఫోటోలు ఒకదానికొకటి అతుక్కుపోవడం కూడా తగ్గుతుంది.

55
సిలికా జెల్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు

సిలికా జెల్ విషపూరితం కాదు. కానీ ఈ గింజలు చిన్నగా ఉండడం వల్ల పిల్లలు లేదా పెంపుడు జంతువులు మింగే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్యాకెట్లను ఎప్పుడూ తెరవకూడదు, పిల్లలు, పెంపుడు జంతువులకు అందకుండా ఉంచాలి, అల్మారా లేదా డ్రాయర్‌లో ఉంచితే టేప్‌తో అతికించడం మంచిది. అలాగే కొంతకాలం తర్వాత సిలికా జెల్ తేమను పూర్తిగా పీల్చుకుని పనికిరాకపోవచ్చు. అప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories