Motivational Story: గూడు నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని త‌ల్లి ప‌క్షి ఎందుకు చెప్పిందో తెలుసా? అమ్మాయిలు క‌చ్చితంగా చ‌ద‌వాల్సిన క‌థ.

Published : Oct 03, 2025, 10:29 AM IST

Motivational Story: జీవితంలో కొన్ని మ‌న‌లో చేతిలో ఉండ‌వు. మ‌నం ఏ త‌ప్పు చేయ‌కున్నా కొన్ని శిక్ష‌లు అనుభ‌వించాల్సి వ‌స్తుంది. అందుకే వేసే ప్ర‌తీ అడుగు జాగ్ర‌త్త‌గా వేయాలని పెద్ద‌లు చెబుతుంటారు.  

PREV
15
గూడు నుంచి బ‌య‌ట‌కు రావొద్ద‌ని

ఒక తల్లి పక్షి తన చిన్న పిల్లలతో కలిసి గూడు లో ఉంటుంది. ప్రతీ రోజూ ఆహారం కోసం బయలుదేరే ముందు తల్లి పిల్లలకు ఒకే మాట చెబుతుంది.. “గూడు నుంచి బయటకు రావొద్దు, బయట చాలా ప్రమాదం ఉంది.” ఆ అమాయ‌క ప‌క్షులు తల్లి మాటను వింటారు, కానీ గూడు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతూనే ఉంటుంది.

25
అందమైన లోకం ఆకర్షణ

ఒక రోజు పిల్ల పక్షి గూడు అంచు నుంచి తొంగి చూసింది. పచ్చని చెట్లు, నీలాకాశం, వెన్నెల కాంతి.. అది చూసి దాని మనసు మైమరచిపోయింది. “లోకం ఇంత అందంగా ఉంది. అమ్మ ఎందుకు భయపెడుతోంది?” అని అనుకుంది. తల్లి మాటలకంటే, తన కళ్లకు కనబడిన అందాన్ని నమ్మింది.

35
ప్రమాదకర నిర్ణయం

తల్లి ఆహారం కోసం బయలుదేరిన వెంటనే ఆ పిల్ల పక్షి రెక్కలు విప్పుకుంది. గాలిలోకి ఎగరడం మొదలుపెట్టింది. స్వేచ్ఛ అనుభవిస్తున్నానని ఆనందపడుతుండగా… ఒక్కసారిగా ఆకాశంలో ఒక రాబందు దూసుకొచ్చింది. అల‌ర్ట్ అయ్యేకంటే ముందే ఆ రాబందు దాన్ని తన పంజాలలో పట్టుకుని ఎత్తుకుపోయింది. ఆ అమాయకపు పిల్ల పక్షి తల్లి మాటను వినకపోవడం వల్ల తన ప్రాణాన్ని కోల్పోయింది.

45
నీతి ఏంటంటే.?

ఈ చిన్న కథలో ఒక గొప్ప సందేశం దాగి ఉంది. ముఖ్యంగా టీనేజీ వయసులో ఉన్న అమ్మాయిలకు ఇది అద్దం పట్టేలా ఉంటుంది. లోకం అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ అందం వెనుక ప్రమాదాలు, రాబందులు కూడా దాగి ఉంటాయి. పెద్దలు చెప్పే మాటలు కేవలం ఆంక్షలు కావు, రక్షణ గోడలు.

55
స్వేచ్ఛ అంటే బాధ్యత

స్వేచ్ఛ మన హక్కు. కానీ ఆ స్వేచ్ఛను సరిగ్గా ఉపయోగించకపోతే అదే ప్రమాదానికి దారి తీస్తుంది. తల్లిదండ్రులు, పెద్దలు ఇచ్చే హెచ్చరికలు అనుభవం నుంచి వచ్చినవి. ఆ మాటలను తక్కువ చేసి చూడకుండా, మన భద్రత కోసం తీసుకోవాలి.

అమ్మాయిలకు సందేశం

ఈ కథ ఒక అద్దం. జీవితంలో ఏ నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించాలి. కేవలం కనబడిన అందాన్ని నమ్మి అడుగులు వేస్తే, మనకు తెలియని రాబందులు మనపై దాడి చేయవచ్చు. ఆచితూచి అడుగులు వేస్తేనే భవిష్యత్తు సురక్షితం అవుతుంది. “లోకం అందమైనదే… కానీ జాగ్రత్తలు పాటించినప్పుడే అది నిజమైన అందం అవుతుంది.” అందుకే పెద్దల మాట వినడం, ప్రతి అడుగు వేసే ముందు ఆలోచించడం ప్రతి అమ్మాయి జీవితంలో అత్యవసరం.

Read more Photos on
click me!

Recommended Stories