Vodka: 90 శాతం మందికి వోడ్కా ఎలా తాగాలో తెలియ‌దు.. స‌రైన విధానం ఏంటో తెలుసా?

Published : Sep 29, 2025, 12:47 PM IST

Vodka: ప్ర‌పంచ‌వ్యాప్తంగా వోడ్కా ల‌వ‌ర్స్ ఎక్కువ‌గా ఉంటారు. చాలా మంది వోడ్కాను ఇష్ట‌ప‌డుతుంటారు. అయితే వోడ్కాను ఎలా తీసుకోవాలో 90 శాతం మందికి తెలియ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. ఆ వివ‌రాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
వోడ్కా ఎలా తాగాలో తెలియ‌దు.

ప్రపంచవ్యాప్తంగా వోడ్కాకు మంచి డిమాండ్ ఉంది. రష్యా, పోలాండ్ మాత్రమే కాదు, భారత్‌లో కూడా యువత దీనిని ఇష్టపడుతున్నారు. కానీ నిపుణుల ప్రకారం చాలా మంది వోడ్కాను సరైన విధంగా తాగడం లేదు. వోడ్కా రుచి, అనుభవం, ఆరోగ్యాన్ని ఆస్వాదించాలంటే కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

25
ప్ర‌ధాన త‌ప్పులు

* చల్లబరచకుండా – చాలా మంది వోడ్కాను గది ఉష్ణోగ్రతలో తాగుతారు. కానీ వోడ్కా ఎల్లప్పుడూ చల్లగా తీసుకోవాలి.

* తప్పు గ్లాస్ వాడకం – పెద్ద మగ్గులు లేదా గ్లాసుల్లో కాకుండా షాట్ గ్లాసులు వాడాలి.

* ఇత‌ర డ్రింక్స్ క‌ల‌ప‌డం – ఎనర్జీ డ్రింక్స్, ఫ్లేవర్డ్ సోడాతో కలపడం వోడ్కా రుచి పోగొడుతుంది.

* ఆహారం లేకుండా తాగడం – కొంద‌రు ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా వోడ్కా సేవిస్తారు. అయితే దీనివ‌ల్ల క‌డుపు సంబంధిత స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

35
వోడ్కా తాగే సరైన పద్ధతి

* వోడ్కాను -7°C నుంచి 0°C మధ్య కూల్ ఉండేలా తీసుకోవాలి.

* చిన్న షాట్ గ్లాసుల్లో తాగితే అనుభవం బాగుంటుంది.

* వోడ్కాను పెద్ద మొత్తంలో మింగేయ‌కుండా. చిన్న చిన్న సిప్‌లు చేయాలి. దీని ద్వారా రుచి తెలుస్తుంది.

* వోడ్కా తీసుకునే స‌మ‌యంలో.. ఊరగాయలు, జున్ను, బ్రెడ్, మాంసం లేదా పొగబెట్టిన చేపలతో జత చేస్తే రుచి మరింత పెరుగుతుంది.

45
వోడ్కాలో ఎలాంటివి యాడ్ చేసుకోవ‌చ్చు.?

వోడ్కా రుచిని కాపాడుకునేలా యాడ్ చేసుకోవాల‌నుకుంటే అందులో.. నిమ్మరసం, టమోటా రసం (బ్లడీ మేరీ), క్రాన్బెర్రీ జ్యూస్, సోడా నీరు వంటివి వోడ్కాకు మంచి కాంబినేషన్ అవుతాయి.

55
ఆస‌క్తిక‌ర విష‌యాలు

* రష్యాలో వోడ్కాను సంప్రదాయంగా ఆహారంతోనే వడ్డిస్తారు.

* చల్లని వోడ్కా తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి.

* ఖాళీ కడుపుతో తాగితే బ్లడ్ షుగర్ పడిపోవడం వల్ల హ్యాంగోవర్ ఎక్కువ అవుతుంది.

* సరైన రీతిలో తాగితే వోడ్కా రుచి నిజంగా ఆస్వాదించవచ్చు.

గ‌మ‌నిక‌: ఆల్క‌హాల్ సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌నే విష‌యం తెలిసిందే. కాబ‌ట్టి ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని నిపుణులు చెబుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories