జీవితంలో సర్వస్వం కోల్పోయినా... ఒక్కటి మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఈ క‌థ చ‌దివితే జీవితమే మారుతుంది

Published : Nov 02, 2025, 05:58 PM IST

Motivational story: జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు. కొన్నిసార్లు అత్యంత క‌ష్ట‌మైన ప‌రిస్థితులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. అయితే చాలా మంది క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు నా జీవితం ఇంతే అనుకుంటారు. అయితే ఈ క‌థ చ‌దివితే మీ ఆలోచ‌న మార‌డం ఖాయం. 

PREV
15
అన్నీ కోల్పోయిన మనిషి

రాజు అనే వ్యక్తి ఒకప్పుడు విజయవంతమైన హోట‌ల్‌ వ్యాపారి. మంచి ఇల్లు, పెద్ద వ్యాపారం, ప్రేమించే కుటుంబం — అన్నీ అతని దగ్గరే ఉండేవి. కానీ ఒక తప్పు పెట్టుబడి, ఒక పెద్ద మోసం, ఒక ప్రమాదం, తెలియ‌క చేసిన కొన్ని త‌ప్పులు.. ఇవన్నీ కలిసి అతని జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేశాయి. తన వ్యాపారం దివాళా తీసింది, ఇల్లు కోల్పోయాడు, భార్యా పిల్లలు కూడా దూర‌మ‌య్యారు. దీంతో అతను ఒంటరిగా మిగిలిపోయాడు. ఇక త‌న జీవితం వృధా అనుకున్నాడు. చివ‌రికి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నాడు.

25
చీకటిలో వెలుగు

ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న రాజు ఒక రోజు రాత్రి రోడ్డుపక్కన ఒంట‌రిగా కూర్చుంటాడు. అదే స‌మ‌యంలో అత‌ని ద‌గ్గ‌రికి ఒక చిన్న బాలుడు వ‌చ్చి.. “అన్నా, నీ దగ్గర పెన్ ఉందా? నాకు రేపు పరీక్ష ఉంది.” అని అడుగుతాడు. రాజు జేబులో చూసి ఒక పాత పెన్ ఇచ్చాడు. ఆ బాలుడు ఆనందంగా “ధన్యవాదాలు అన్నా, నువ్వు మంచి మనిషివి” అని నవ్వాడు. ఆ నవ్వు రాజు ఆలోచ‌న‌ను ఒక్క‌సారిగా మార్చేసింది. అప్పుడు అత‌నికి అర్థ‌మైంది తాను స‌ర్వం కోల్పోయినా త‌న వ‌ద్ద ఒక‌టి మిగిలే ఉంద‌ని, అదే ఆశ‌.

35
“రేపు” అనే ఆశ

ఆ రాత్రి రాజు ఆలోచించాడు. “నేను కోల్పోయిందంతా వస్తువులు, కానీ రేపు అనే అవకాశం ఇంకా నాకుంది.” ఆ ఆలోచనే అతనికి కొత్త శక్తినిచ్చింది. తన పాత అనుభవంతో చిన్న కాఫీ స్టాల్ ప్రారంభించాడు. పెద్ద హోట‌ల్ నిర్వ‌హించిన వ్య‌క్తి మ‌ళ్లీ ఒక చిన్న కొట్టును ప్రారంభించాడు. అయినా అత‌నేం బాధ‌ప‌డలేదు. మ‌ళ్లీ మొద‌టి నుంచి ప్రారంభిస్తా అని అనుకున్నాడు. క్ర‌మంగా క‌స్ట‌మ‌ర్లు పెరుగుతూ వ‌చ్చారు.

45
చిన్న అడుగులు పెద్ద మార్పులు తెచ్చాయి

కొన్ని నెలల్లో రాజు ఆ స్టాల్‌ను చిన్న హోటల్‌గా మార్చాడు. నెమ్మ‌దిగా గిరాకీ పెర‌గ‌డం మొద‌లైంది. డ‌బ్బులు ఉన్న‌ప్పుడు చేసిన త‌ప్పుల‌ను అర్థం చేసుకున్నాడు. నిజాయితీ జీవించ‌డం మొద‌లు పెట్టాడు. త‌న‌కు ఉన్నదాంట్లో కొంత మొత్తాన్ని న‌లుగురికి పంచుతూ వ‌చ్చాడు. దీంతో జీవితంపై మ‌ళ్లీ ఆశ మొద‌లైంది. నెమ్మ‌దిగా త‌న కుటుంబం కూడా తిరిగి అతని దగ్గరకు వచ్చింది. జీవితం ఇచ్చిన ఈ రెండో అవ‌కాశాన్ని రాజు స‌ద్వినియోగం చేసుకున్నాడు.

55
కథ మనకు చెప్పే సత్యం

జీవితంలో ఆస్తి, బంధం, గౌరవం — అన్నీ ఒకేసారి కోల్పోయినా, మన దగ్గర “రేపు” అనే ఒక ఆశ ఎప్పటికీ ఉంటుంది. ఆ ఆశనే మనల్ని మళ్లీ నిలబెడుతుంది. “జీవితంలో ఓటమి అంటే అంతం కాదు, అది కొత్త ఆరంభానికి ఆహ్వానం.” జీవితాన్ని మార్చడానికి మనం చేయాల్సిందల్లా “రేపు” అనే అవకాశాన్ని నమ్మడం. ఈ రోజు ఎంత చీకటిగా ఉన్నా, రేపటి సూర్యుడు తప్పక ఉదయిస్తాడనే న‌మ్మ‌కం ఉండాలి అప్పుడే జీవితంలో ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా నిల‌బ‌డ‌తాం.

Read more Photos on
click me!

Recommended Stories