మిష్మి తీతా మొక్కలు ఎక్కడ పడితే అక్కడ బతకలేవు. కొన్ని వాతావరణాల్లోనే జీవించడగలవు. ఈ మొక్కల పెరుగుదలకు అనుకూలమైన వాతావరణ కలిగిన అరుణాచల్ ప్రదేశ్‌లోని 'మిష్మి కొండల్లో' (Mishmi Hills) ఇది ఎక్కువగా పెరుగుతుంది. చైనాలోని టిబెట్ సరిహద్దు, మిజోరాం, నాగాలాండ్, మయన్మార్ సరిహద్దు అడవుల్లో కూడా ఈ మొక్కలు అరుదుగా దొరుకుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి 2,000 నుంచి 3,000 మీటర్ల ఎత్తులో, తేమ, చల్లగా ఉండే సతత హరిత అడవుల్లో మాత్రమే ఈ మొక్కలు పెరగగలవు. అయితే ఈ మొక్కలను విపరీతంగా వాడేయడం… ఇతర దేశాలకు అక్రమ రవాణా చేయడం వల్ల ఇప్పుడు ఈ మొక్కలు అంతరించిపోతున్న జాతుల జాబితాలోకి చేరిపోయాయి.
భారత మార్కెట్లో మిష్మి తీతా ధర దాని నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్వాలిటీని బట్టి కిలోకు రూ.3,000 నుంచి రూ.9,000 వరకు ఉంటుంది. మంచి నాణ్యత ఉన్న ఎండిన వేర్ల హోల్‌సేల్ మార్కెట్ ధర సాధారణంగా కిలోకు రూ.4,000 నుంచి రూ.5,000 వరకు ఉంటుంది. అత్యంత అరుదైన, ప్రాసెస్ చేసిన ఆర్గానిక్ మెడిసిన్ గ్రేడ్ వేర్ల ధర కిలోకు రూ.8,000 - రూ.9,000 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. ఇక పొడి (Powder) రూపంలో చిల్లరగా కొంటే 100 గ్రాములకు రూ.300 నుంచి రూ.500 వరకు ఉంటుంది.