భారతదేశంలో గంగా, యమునా, గోదావరి, కృష్ణా, కావేరి, నర్మదా, తపతి.. ఇలా ఎన్నో నదులు ఉన్నాయి. నదుల పేర్లన్నీ స్త్రీల పేర్లుగానే ఉంటాయి. అయితే భారతదేశంలో ఒక నది మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అదే బ్రహ్మపుత్ర నది. పేరు చూస్తేనే ఇది ప్రత్యేకంగా అనిపిస్తుంది. ‘బ్రహ్మపుత్ర’ అంటే ‘బ్రహ్మ దేవుడి కుమారుడు’ అని అర్థం. అందుకే బ్రహ్మపుత్రను భారతదేశంలోని ఒకే ఒక్క ‘మగ నది’గా చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది కేవలం పేరు విషయంలోనే కాదు.. తన ప్రవాహం, స్వభావం విషయంలోనూ ప్రత్యేకత ఉంటుంది. టిబెట్‌లో పుట్టిన ఈ నది భారత్‌లోకి అరుణాచల్‌ప్రదేశ్ మీదుగా ప్రవేశిస్తుంది. అక్కడ దీనిని ‘సియాంగ్’ అని పిలుస్తారు. ఆ తర్వాత అసోంలోకి చేరినప్పుడు బ్రహ్మపుత్రగా మారుతుంది. చివరికి బంగ్లాదేశ్‌లోకి వెళ్లి గంగానదితో కలిసి సముద్రంలో కలుస్తుంది.