Silver Foil: స్వీట్సు తినడానికే కాదు...చూడ్డానికి కూడా టెంప్టింగ్ గా కనిపిస్తాయి. అవి అలా కనిపించడానికి రీజన్..వాటి మీద వేసే సిల్వర్ ఫాయిల్. చూడగానే మెరిసిపోతుంటుంది. కానీ మీకెప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా..ఈ సిల్వర్ ఫాయిల్ వెజిటేరియనా? నాన్ వెజిటేరియనా?
పండుగైనా, ఫంక్షన్ అయినా, ఇంటికి స్వీట్లు వచ్చినా.. సిల్వర్ ఫాయిల్ తో మెరిసిపోయే స్వీట్స్ కనిపిస్తే లాగించేస్తాం. కానీ ఆ స్వీట్‌పై కనిపించే మెరిసే వెండి రేకు విషయంలో చాలాకాలంగా ఒక సందేహం ఉంది. అసలు ఈ సిల్వర్ వర్క్ వెజిటేరియనా? లేక ఇందులో జంతు పదార్థాలు కూడా ఉంటాయా?
25
సిల్వర్ ఫాయిల్ ను 'చాందీ కా వర్క్' అని పిలుస్తారు
సిల్వర్ ఫాయిల్‍ను మన దేశంలో ‘చాందీ కా వర్క్’ అని పిలుస్తారు. స్వీట్లపై వేసే ఈ రేకు చాలా పలుచగా ఉంటుంది. రుచి, వాసన ఉండవు. స్వీట్‌కు కేవలం అందమైన మెరుపును మాత్రమే ఇస్తుంది. అయితే ఈ వెండి రేకు తయారయ్యే విధానం కారణంగానే ఇంతకాలం శాకాహారుల్లో అనుమానాలు ఉన్నాయి.
గతంలో సిల్వర్ ఫాయిల్ తయారు చేయడం అంత ఈజీ కాదు. స్వచ్ఛమైన వెండిని తీసుకుని.. దాన్ని పలుచటి రేకుగా మార్చేందుకు పలు పొరల మధ్య ఉంచి గంటల తరబడి బలంగా కొట్టేవారు. ఈ ప్రక్రియలో వెండి రేకులు అంటుకోకుండా ఉండేందుకు కొన్ని సంప్రదాయ పద్ధతుల్లో జంతు కణజాలాన్ని ఉపయోగించేవారట.
35
జంతు పదార్థాలు ఉపయోగించేవారంట..
అంటే.. మనం స్వీట్‌పై చూస్తున్నది వెండే అయినా.. దాన్ని తయారు చేసే ప్రక్రియలో జంతు పదార్థాలు ఉపయోగించేవారన్నమాట. ఈ విషయం బయటకు రావడంతోనే శాకాహారులు సిల్వర్ వర్క్ ఉన్న స్వీట్ల విషయంలో జాగ్రత్త పడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పండుగల సమయంలో పూర్తిగా వెజ్ తినే కుటుంబాల్లో ఇది పెద్ద సందేహంగా మారింది.
అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. 2016లో FSSAI తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం సిల్వర్ లీఫ్ తయారీలో జంతు మూలాల నుంచి వచ్చే పదార్థాలను ఉపయోగించకూడదని, తయారీ ప్రక్రియలోనూ జంతు కణజాలం ఉండకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
55
మార్కెట్లో అడిగి తెలుసుకోండి
సిల్వర్ ఫాయిల్ పేరుతో నాణ్యత లేని ఇతర పదార్థాలు ఉపయోగించకుండా ఉండేందుకు కూడా రూల్స్ ఉన్నాయి. టెక్నాలజీ మారడం వల్ల సిల్వర్ ఫాయిల్ తయారీ విధానం కూడా మారిపోయింది. ఇప్పుడు యంత్రాల సాయంతో వెండిని అత్యంత పలుచటి రేకులుగా తయారు చేస్తున్నారు. జంతు పదార్థాలకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
అయితే ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోవాలి. FSSAI నిబంధనలు ఉన్నాయనే కారణంతో మార్కెట్‌లో దొరికే ప్రతి సిల్వర్ ఫాయిల్ మంచిదని కాదు. ప్యాకేజ్డ్ స్వీట్లు కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌పై ఉన్న వివరాలను పరిశీలించడం మంచిది. స్వీట్ షాపుల్లో కొనుగోలు చేస్తే సిల్వర్ ఫాయిల్ గురించి అడిగి తెలుసుకోవచ్చు.