ఆ కుటుంబం మరణానికి ప్రధాన కారణం ఆహారాల కలయిక కాదు, ఆ ఆహారం కలుషితం కావడమేనని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
1. బాక్టీరియా పెరుగుదల: బిర్యానీ వంటి మాంసాహార పదార్థాలను వండిన తర్వాత ఎక్కువ సేపు బయట గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే అందులో బాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది.
2. నిల్వ పండ్లు: బయట రోడ్ల మీద ముందుగానే కట్ చేసి ఉంచిన పుచ్చకాయ ముక్కలపై దుమ్ము, ధూళితో పాటు ప్రమాదకరమైన బాక్టీరియా చేరుతుంది.
3. కృత్రిమ రసాయనాలు: పుచ్చకాయలు ఎర్రగా, తీపిగా ఉండటానికి కొన్ని చోట్ల ప్రమాదకరమైన ఇంజెక్షన్లు, రంగులు వాడుతుంటారు. ఇవి శరీరంలోకి వెళ్ళినప్పుడు తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తాయి.