Mobile Tower: సెల్ టవర్‌కు దగ్గరలో నివసిస్తే ప్రమాదమా? ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

Published : Jul 20, 2026, 05:46 PM IST

Mobile Tower: చాలా మంది ఇంటిపైనే సెల్ టవర్ పెట్టుకుని కింద గదుల్లో నివసిస్తారు. మరికొందరు సెల్ టవర్ కు చాలా దగ్గరలో నివసిస్తారు. ఇంటి దగ్గర సెల్ టవర్ ఉంటే ప్రమాదమా?  సెల్ టవర్ వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి?

PREV
13
సెల్ టవర్ వల్ల ప్రమాదమా?

ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు సెల్ ఫోన్ కనిపిస్తుంది. కాబట్టి సెల్ టవర్ ఎక్కువగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  కానీ సెల్ టవర్లను చూస్తే కొంతమంది భయపడుతూ ఉంటారు. టవర్ల దగ్గర నివసిస్తే ఎన్నో ఆరోగ్యసమస్యలు వస్తాయని అంటారు.తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయని భయపడుతూ ఉంటారు. అలాగే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటారు. ఇది ఎంతవరకు నిజం?

23
ఆ రేడియేషన్ ప్రమాదమా

రేడియేషన్‌ను రెండు రకాలుగా విభజించి చెప్పుకోవచ్చు. అవి అయనైజింగ్ రేడియేషన్, నాన్-అయనైజింగ్ రేడియేషన్. అయనైజింగ్ రేడియేషన్ ను ఎక్స్-రే  వంటి వైద్య పరీక్షల్లో వాడతారు. ఇది అధిక మోతాదులో మనపై పడితే శరీర కణాలకు హాని చేస్తుంది. ఇక నాన్ అయనైజింగ్ రేడియేషన్… సెల్‌ఫోన్ టవర్ల నుంచి వచ్చేది ఈ రకమే. ఇది రేడియో తరంగాల లాంటిది. దీనికి మన కణాల్లోని డీఎన్‌ఏ (DNA)ను దెబ్బతీసేంత శక్తి ఉండదు.

అయితే సెల్ టవర్ల వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఎంతో మంది భయపడుతూ ఉంటారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇతర అంతర్జాతీయ సైన్స్ సంస్థలు ఏళ్లుగా దీనిపై పరిశోధనలు చేశాయి. సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఈ రేడియేషన్, మన ఇంట్లో ఉండే మైక్రోవేవ్ ఒవెన్ (Microwave oven) లేదా ఎఫ్ఎం (FM) రేడియో తరంగాల కన్నా చాలా బలహీనమైనది. కాబట్టి దీనితో ఎలాంటి సమస్య ఉండదు.

33
దగ్గరలో నివసించడం ప్రమాదకరమా?

సెల్ టవర్లకు దగ్గరలో నివసించడం ఏమాత్రం ప్రమాదకరం కాదు. సెల్ టవర్లను కొంత ఎత్తులో ఏర్పాటు చేస్తారు. వాటి నుంచి వెలువడే రేడియేషన్ భూమిని చేరేసరికి చాలా బలహీనపడుతుంది. మీ ఇంటి దగ్గర టవర్ ఉన్నంత మాత్రాన ఆరోగ్యానికి వచ్చే నష్టమేమీ లేదు. టవర్ల నుంచి వచ్చే తరంగాలు గోడలు, తలుపులు దాటి లోపలికి వచ్చేసరికి ఇంకా బలహీనపడతాయి.  టవర్ ఉన్న భవనంలో నివసించే వారి కన్నా, రోజంతా చెవి దగ్గర ఫోన్ పెట్టుకుని మాట్లాడే వారికే రేడియేషన్ ప్రభావం ఎక్కువ ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories