School: ఫారెన్ స్కూల్స్ లో పిల్లలను కొడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో తెలుసా? తల్లిదండ్రులకు కూడా తప్పదా?

Published : Jul 20, 2026, 11:06 AM IST

School: మన ఇంట్లో.. పిల్లుల అల్లరి చేస్తే నాలుగు తగిస్తుంటారు. తిడతారు..కొడతారు.. కాస్త గట్టిగానే మందలిస్తుంటారు. కానీ అమెరికా, లాంటి ఫారెన్  కంట్రీస్ లో స్కుల్లో పిల్లలను కొడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. తల్లితండ్రులకు కూడా తప్పదు మరి.

PREV
16
పిల్లల అల్లరి వారి హక్కు..

పిల్లలు అల్లరి చేస్తారు. అది వారి వయసుబట్టి మారుతుంటుంది. పిల్లల అల్లరి వారికి ఒక హక్కులాంటిది. కానీ తల్లి తండ్రులు మాత్రం పిల్లల అల్లరి భరించలేక తిట్టడం, కొట్టడం, మరికొంత మంది కఠినమైన మనసు కలిగిన వారు అయితే వాతలు పెట్టిన సందర్భాలు కూడా చాలా చూశాం. పిల్లలు ను మందలించడం, చిన్నగా ఒక దెబ్బ తగిలీ తగలనట్టుగా వేయడం సహజం.. కానీ చావు దెబ్బలు కొట్టడం మాత్రం క్షమించరాని తప్పు. అది ఇతర దేశాలలోనే కాదు.. మన దేశంలో కూడా చాలా తప్పు.. తీవ్రంగా పరగణించాల్సిన విషయం. అయితే అమెరికా లాంటి ఫారెన్ కంట్రీస్ లో అసలు పిల్లలను మందలించడం, కొట్టడం ఎంత పెద్ద నేరమో తెలుసా? వాటికి శిక్షలు ఎలా ఉంటాయంటే?

26
అమెరికా స్కూల్లో పిల్లలను ఇబ్బందిపెడితే అంతే సంగతులు..

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) లో పిల్లల హక్కులు, వారి భద్రతకు అత్యంత ఇంపార్టెన్స్  ఇస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే, అమెరికాలో పిల్లలను పెంచే విధానంలోనూ, పాఠశాలల్లో వారిని నియంత్రించే పద్ధతుల్లోనూ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఇంట్లో తల్లిదండ్రులు కానీ, స్కూళ్లలో ఉపాధ్యాయులు కానీ పిల్లలను కొడితే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

36
స్కూల్లో టీచర్స్ పై చర్యలు (Corporal Punishment)

అమెరికాలోని మెజారిటీ రాష్ట్రాల్లో దాదాపు 35 కంటే ఎక్కువ రాష్ట్రాల పాఠశాలల్లో శారీరక దండనను (Corporal Punishment) చట్టబద్ధంగా పూర్తిగా నిషేధించారు. ఒకవేళ నిషేధం ఉన్న రాష్ట్రాల్లో టీచర్స్ విద్యార్థిని కొడితే, దానిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. తక్షణమే సదరు ఉపాధ్యాయుడిని ఉద్యోగం నుండి తొలగించడమే కాకుండా, వారి టీచింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. బాధితుల తల్లిదండ్రులు క్రిమినల్ కేసులు నమోదు చేస్తే, సదరు టీచర్‌కు జైలు శిక్ష తో పాటు భారీ జరిమానాలు పడే అవకాశం ఉంటుంది.

46
తల్లిదండ్రులను కూడా వదిలిపెట్టరు.. (Child Abuse & CPS)

అమెరికా చట్టాల ప్రకారం పిల్లలను క్రమశిక్షణలో పెట్టేందుకు తల్లిదండ్రులకు కొంత మేర హక్కులు ఉన్నప్పటికీ, అది శారీరక హింస (Child Abuse) గా మారకూడదు. పిల్లల శరీరంపై వాతలు పడటం, రక్తం రావడం, లేదా నీలి గుర్తులు పడేలా కొడితే అది తీవ్రమైన చట్ట ఉల్లంఘన అవుతుంది. ఇటువంటి సందర్భాల్లో చైల్డ్ ప్రొటెక్టివ్ సర్వీసెస్ (CPS) రంగంలోకి దిగుతుంది. ఎవరైనా పొరుగువారు లేదా స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేస్తే, CPS అధికారులు తక్షణమే విచారణ చేపడతారు. నేరం రుజువైతే తల్లిదండ్రుల నుండి పిల్లల సంరక్షణ బాధ్యతలను చట్టం లాగేసుకుంటుంది. పిల్లలను ఫోస్టర్ కేర్ (Fostered Homes) లేదా ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలకు తరలిస్తారు.

56
పిల్లలను ఇబ్బందిపెడితే శిక్షలు ఎలా ఉంటాయంటే?

పిల్లలపై జరిగే దాడి తీవ్రతను బట్టి తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు చట్టం శిక్షలను ఖరారు చేస్తుంది. సాధారణ కేసులలో కౌన్సిలింగ్, పేరెంటింగ్ క్లాసులకు హాజరు కావాలని కోర్టు ఆదేశిస్తుంది. అయితే, తీవ్రమైన గాయాలైన సందర్భాల్లో చైల్డ్ అబ్యూస్ తో పాటు డొమెస్టిక్ వయలెన్స్ కింద క్రిమినల్ కేసులు నమోదవుతాయి. దీనివల్ల కొన్ని నెలల నుండి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.

66
విదేశీయులైతే ఏం చేస్తారంటే?

అంతేకాకుండా, గ్రీన్ కార్డ్ లేదా వీసాపై ఉన్న విదేశీయులైతే, వారిని అమెరికా నుండి డిపోర్ట్ (దేశ బహిష్కరణ) చేసే అవకాశం కూడా ఉంది. అమెరికా సమాజంలో పిల్లలను కొట్టడం అనేది క్రమశిక్షణగా భావించరు, అదొక నేరంగా చూస్తారు. కాబట్టి అక్కడ నివసించే వారు పిల్లల పెంపకంలో అత్యంత సహనంతో, చట్టాల పట్ల అవగాహనతో వ్యవహరించడం ఎంతో అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories