
ఐఆర్‌సీటీసీ (IRCTC) పర్యాటకుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్యాకేజీలను అందిస్తోంది. ఇందులో భాగంగా 'అల్టిమేట్ ఊటీ ఎక్స్-హైదరాబాద్' (Ultimate Ooty Ex-Hyderabad) పేరుతో ఒక సూపర్ టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ ద్వారా ఊటీతో పాటు కూనూర్ అందాలను కూడా కవర్ చేయవచ్చు. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 రోజుల సమయం ఉంటుంది. ప్రతీ వారం మంగళవారం నాడు ఈ టూర్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమవుతుంది.
మొదటి రోజు (మంగళవారం): మధ్యాహ్నం 14:25 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలు నెంబర్ 20629 'శబరి ఎక్స్‌ప్రెస్' ద్వారా ప్రయాణం మొదలవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండవ రోజు (బుధవారం): ఉదయం 09:10 గంటల ప్రాంతంలో కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊటీకి వాహనంలో తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అయిన తర్వాత, మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ సందర్శన ఉంటుంది. ఆ రాత్రి ఊటీలోనే బస చేస్తారు.
మూడవ రోజు (గురువారం): హోటల్‌లో టిఫిన్ చేసిన తర్వాత దొడ్డబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా జలపాతం చూడటానికి తీసుకెళ్తారు. రాత్రి బస ఊటీలోనే ఉంటుంది.
నాల్గవ రోజు (శుక్రవారం): ఉదయం అల్పాహారం ముగించుకుని కూనూర్ సైట్‌సీయింగ్‌కు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీ చేరుకుని రాత్రి అక్కడ బస చేస్తారు.
ఐదవ రోజు (శనివారం): ఉదయం టిఫిన్ చేశాక, మధ్యాహ్నం 12:00 గంటలకు హోటల్ చెక్-ఔట్ ఉంటుంది. అక్కడి నుండి కోయంబత్తూర్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 15:40 గంటలకు కోయంబత్తూర్ రైల్వే స్టేషన్‌లో రైలు నెంబర్ 20630 'శబరి ఎక్స్‌ప్రెస్' ఎక్కాలి.
ఆరవ రోజు (ఆదివారం): ఉదయం 11:00 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఈ టూర్ ప్యాకేజీ కోసం ప్రతీ వారం స్లీపర్ క్లాస్‌లో 12 సీట్లు, 3ACలో 6 సీట్లు కేటాయించారు. ఊటీలో 'సిల్వర్ ఓక్' లేదా దానికి సమానమైన హోటల్‌లో నాన్-ఏసీ గదుల్లో వసతి కల్పిస్తారు.
ఈ టూర్ ప్యాకేజీ ధరలు ప్రయాణించే తేదీలను బట్టి మూడు కేటగిరీలుగా ఉంటాయి.
1. జూలై 30 నుండి సెప్టెంబర్ 22, 2026 వరకు:
• 3AC (కంఫర్ట్): సింగిల్ షేరింగ్ రూ. 28,730, ట్విన్ షేరింగ్ రూ. 16,460, ట్రిపుల్ షేరింగ్ రూ. 15,550. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 8,840, బెడ్ లేకుండా రూ. 6,490.
• స్లీపర్ (స్టాండర్డ్): సింగిల్ షేరింగ్ రూ. 26,190, ట్విన్ షేరింగ్ రూ. 13,920, ట్రిపుల్ షేరింగ్ రూ. 13,010. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 6,300, బెడ్ లేకుండా రూ. 3,950.
2. సెప్టెంబర్ 29 నుండి డిసెంబర్ 15, 2026 వరకు:
• 3AC (కంఫర్ట్): సింగిల్ షేరింగ్ రూ. 33,590, ట్విన్ షేరింగ్ రూ. 18,890, ట్రిపుల్ షేరింగ్ రూ. 17,170. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 8,840, బెడ్ లేకుండా రూ. 6,490.
• స్లీపర్ (స్టాండర్డ్): సింగిల్ షేరింగ్ రూ. 31,050, ట్విన్ షేరింగ్ రూ. 16,360, ట్రిపుల్ షేరింగ్ రూ. 14,630. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 6,300, బెడ్ లేకుండా రూ. 3,950.
3. డిసెంబర్ 22, డిసెంబర్ 29, 2026:
• 3AC (కంఫర్ట్): సింగిల్ షేరింగ్ రూ. 35,510, ట్విన్ షేరింగ్ రూ. 20,810, ట్రిపుల్ షేరింగ్ రూ. 19,090. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 10,760, బెడ్ లేకుండా రూ. 8,400.
• స్లీపర్ (స్టాండర్డ్): సింగిల్ షేరింగ్ రూ. 32,970, ట్విన్ షేరింగ్ రూ. 18,280, ట్రిపుల్ షేరింగ్ రూ. 16,550. 5-11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ. 8,220, బెడ్ లేకుండా రూ. 5,870.
ప్యాకేజీలో వుండేవి:
• రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3AC).
• AC వాహనంలో ప్రయాణం.
• ఊటీలో 3 రాత్రుల నాన్-AC హోటల్ వసతితో పాటు అల్పాహారం.
• టోల్, పార్కింగ్, వర్తించే జీఎస్‌టీ.
ప్యాకేజీలో లేనివి:
• మధ్యాహ్న, రాత్రి భోజనాలు, ప్రయాణంలో ఆహారం.
• దర్శనీయ ప్రాంతాల ప్రవేశ టికెట్లు, టూర్ గైడ్ ఛార్జీలు.
• బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి ఇతర వినోద కార్యక్రమాల ఖర్చులు.
టికెట్ రద్దు చేసుకోవాలనుకుంటే కేవలం www.irctctourism.com వెబ్‌సైట్ ద్వారా మాత్రమే చేయాలి. PRS కౌంటర్లలో క్యాన్సిల్ చేయలేరు.
• ప్రయాణ తేదీకి 15 రోజుల కంటే ముందు క్యాన్సిల్ చేస్తే ఒక ప్రయాణికుడికి రూ. 250 మినహాయిస్తారు.
• 8 నుండి 14 రోజుల మధ్య క్యాన్సిల్ చేస్తే ప్యాకేజీ మొత్తంలో 25% కోత విధిస్తారు.
• 4 నుండి 7 రోజుల మధ్య క్యాన్సిల్ చేస్తే 50% కోత పడుతుంది.
• 4 రోజుల కంటే తక్కువ సమయంలో క్యాన్సిల్ చేస్తే రూపాయి కూడా తిరిగి రాదు.
మరిన్ని వివరాలకు లేదా బుకింగ్ కోసం ఐఆర్‌సీటీసీ సౌత్ సెంట్రల్ జోన్, సికింద్రాబాద్ కార్యాలయాన్ని లేదా 8287932229, 9701360701 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.