Train Ticket : ఒకే పీఎన్‌ఆర్ నంబర్‌పై కొందరికి టికెట్ కన్ఫర్మ్ అయి, మరికొందరికి వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే రైలు ప్రయాణం చేయొచ్చా? ఆన్‌లైన్ టికెట్ రూల్స్, వెయిటింగ్ లిస్ట్ నిబంధనలు, ప్రయాణికులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.
ఒకే టికెట్‌లో కన్ఫర్మ్, వెయిటింగ్ లిస్ట్ ఉంటే ఏం జరుగుతుంది?
ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో రైల్లో వెళ్లేటప్పుడు అందరికీ ఒకేసారి టికెట్లు కన్ఫర్మ్ కాకపోవచ్చు. ఒకే పీఎన్‌ఆర్ నంబర్‌పై ఇద్దరికి సీటు కన్ఫర్మ్ అయి, మరో ఇద్దరికి వెయిటింగ్ లిస్ట్ వస్తే ఏం చేయాలి? అందరూ కలిసే వెళ్లొచ్చా? లేక వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు వేరే టికెట్ తీసుకోవాలా? దీనికి ఆన్సర్ తెలియాలంటే.. టికెట్ ఆన్‌లైన్‌లో బుక్ చేశారా, చార్ట్ ప్రిపేర్ అయ్యాక స్టేటస్ ఏంటి అనేది చూడాలి.
25
అందరికీ వెయిటింగ్ లిస్ట్ వస్తే రూల్ ఏంటి?
ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేశాక, చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా అందరి పేర్లు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే.. ఆ ఈ-టికెట్ ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. ఆ టికెట్ పట్టుకుని రిజర్వేషన్ బోగీలో ఎక్కడానికి వీల్లేదు. రూల్స్ ప్రకారం మీ డబ్బులు మీకు వెనక్కి వచ్చేస్తాయి. కాబట్టి బుక్ చేసినప్పటి స్టేటస్ చూసుకుని ఆగిపోకుండా, చార్ట్ ప్రిపేర్ అయ్యాక పీఎన్‌ఆర్ స్టేటస్ మళ్లీ చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.
ఒకే పీఎన్‌ఆర్ నంబర్‌పై నలుగురు టికెట్ తీసుకున్నారనుకుందాం. చార్ట్ ప్రిపేర్ అయ్యాక ఇద్దరికి సీటు కన్ఫర్మ్ అయి, మరో ఇద్దరికి వెయిటింగ్ లిస్ట్ వస్తే దాన్ని 'పార్షియల్లీ కన్ఫర్మ్డ్ టికెట్' అంటారు. ఇలాంటప్పుడు సీటు కన్ఫర్మ్ అయినవాళ్లు హ్యాపీగా జర్నీ చేయొచ్చు. కానీ, అదే పీఎన్‌ఆర్‌పై పేరు ఉంది కదా అని వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు కూడా రిజర్వేషన్ బోగీలో ఎక్కేయొచ్చు అని గుడ్డిగా నమ్మకూడదు.
దీనిపై రకరకాల వార్తలు వస్తున్నాయి. కాబట్టి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నవాళ్లు రైలు ఎక్కేముందు టీటీఈ (TTE)తో మాట్లాడి పర్మిషన్ ఉందో లేదో కనుక్కోవాలి. కన్ఫర్మ్ అయిన ప్రయాణికుడితో పాటు ఒకే పీఎన్‌ఆర్‌లో పేరు ఉన్నంత మాత్రాన జర్నీకి గ్యారెంటీ లేదు.
వైరల్ వీడియో ఏం చెబుతోంది? రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో.. ఒకే పీఎన్‌ఆర్‌పై కనీసం ఒక్కరికైనా టికెట్ కన్ఫర్మ్ అయితే, మిగతావాళ్లు కూడా వాళ్లతో కలిసి ప్రయాణించొచ్చని ఒక టీటీఈ చెబుతున్నాడు. కానీ దీనికి భిన్నంగా ఒకరేమో.. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవాళ్లకు మాత్రమే రిజర్వేషన్ బోగీలో ప్రయాణించే అధికారిక అనుమతి ఉంటుందని అందులో చెప్పారు. మరొకరు.. ఒకే పీఎన్‌ఆర్‌పై పార్షియల్లీ కన్ఫర్మ్డ్ టికెట్ ఉంటే ప్రయాణికులు కలిసే వెళ్లొచ్చని చెప్పారు. ఇలా రకరకాల సమాచారం బయటకు వస్తోంది కాబట్టి, కేవలం వైరల్ వీడియోను చూసి మాత్రమే నిర్ణయం తీసుకోకూడదు.
55
రైలు ఎక్కేముందు ఏం చేయాలి?
ముందుగా, చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత మీ పీఎన్‌ఆర్ స్టేటస్ చెక్ చేసుకోండి. అందరికీ సీటు కన్ఫర్మ్ అయిందా లేదా కొందరు వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నారా అనేది స్పష్టంగా తెలుసుకోండి. పార్షియల్లీ కన్ఫర్మ్డ్ టికెట్ అయితే, జర్నీకి ముందు రైల్వే అధికారిక హెల్ప్‌లైన్ 139కి కాల్ చేసి గానీ, లేదా టీటీఈని అడిగి గానీ మీ టికెట్ స్టేటస్‌పై ప్రయాణించే పర్మిషన్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. పూర్తిగా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఈ-టికెట్‌తో రిజర్వేషన్ బోగీలో ఎక్కకూడదు. ఒకవేళ జనరల్ బోగీలో వెళ్లాలనుకుంటే, దానికి తగ్గట్టుగా వేరే జనరల్ టికెట్ తీసుకోవాలి.