అన్నిరంగాల్లో రాణిస్తున్నారు..
కానీ ఎక్కువ శాతం మన ఇండియాన్స్ పై అమెరికాలో జనాలు చాలా ప్రేమగా ఉంటారట. సాధారణంగా విదేశాల్లో భారతీయుల పట్ల గౌరవం గతంతో పోలిస్తే ఇప్పుడు ఎంతో మెరుగుపడింది. అక్కడి ప్రముఖ కంపెనీల్లో, ముఖ్యంగా టెక్నాలజీ, వైద్యం, పరిశోధన ,మేనేజ్మెంట్ రంగాల్లో ఇండియన్స్ అగ్రస్థానాలలో ఉండటం వల్ల స్థానికుల నుంచి మనవాళ్లకు ఎంతో ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. ఒకప్పుడు కేవలం చదువుకోసమే అమెరికాకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రతి రంగంలోనూ భారతీయులు నాయకత్వ స్థానాల్లో రాణిస్తుండటంతో అమెరికన్లలో కూడా స్పష్టమైన మార్పు వచ్చింది.
అమెరికాలో ఇండియన్ పండుగలు..
అంతే కాదు అమెరికన్లు మన పండుగలను కూడా గౌరవిస్తుంటారు. హిందూ పండుగలు జరుపుకోవడానికి పర్మీషన్లు ఇవ్వడంతో పాటు.. ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పోలీసులత భద్రత కూడా ఇస్తుంటారు. అయితే, భిన్న సంస్కృతుల సమ్మేళనం ఉన్న ఆ దేశంలో కొన్నిసార్లు చిన్నచిన్న సాంస్కృతిక సవాళ్లు, సర్దుబాటు ధోరణులు అవసరమవుతుంటాయి. లాంగ్వేజ్ లో కానీ, లైఫ్ స్టైల్ లో కానీ.. చాలా తేడాలు ఉంటాయి. వాటి వల్ల కొత్తగా వెళ్లిన వారికి కొన్ని ఇబ్బందులు ఎదురుకావడం సహజమే.