IRCTC దక్షిణ భారత యాత్ర: బడ్జెట్ లో తిరుపతి, రామేశ్వరం సహా 5 దివ్య క్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ సూపర్ టూర్ ప్యాకేజీ

Published : Jul 28, 2026, 02:16 PM IST

IRCTC Dakshin Bharat Yatra: ఐఆర్‌సీటీసీ భారత్ గౌరవ్ రైలు ద్వారా 11 రాత్రులు, 12 రోజుల 'దక్షిణ భారత యాత్ర' అందిస్తోంది. తిరుపతి, రామేశ్వరం, శ్రీశైలం చూసొచ్చేలా బెస్ట్ ఆఫర్ ను తీసుకొచ్చింది. బడ్జెట్ తో అందిస్తున్న ఈ  టూర్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
తిరుపతి, శ్రీశైలం, రామేశ్వరం.. ఐదు దివ్య క్షేత్రాలు కవర్ చేసే భారత్ గౌరవ్ ట్రైన్ యాత్ర

మీరు దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్‌సీటీసీ (IRCTC) ఒక క్రేజీ అప్‌డేట్‌తో ముందుకు వచ్చింది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా "దక్షిణ భారత యాత్ర" (Dakshin Bharat Yatra) పేరుతో ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

గోరఖ్‌పూర్ నుండి ప్రారంభమయ్యే ఈ యాత్ర మొత్తం 11 రాత్రులు, 12 రోజుల పాటు సాగుతుంది. ఈ ప్యాకేజీ ద్వారా ప్రయాణికులు తిరుమల తిరుపతి వెంకన్న, రామేశ్వరం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారి, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని సందర్శించవచ్చు. కేంద్ర ప్రభుత్వం భారత్ గౌరవ్ పథకం కింద రైలు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి దాదాపు 33 శాతం రాయితీని అందిస్తోంది, ఈ సబ్సిడీ ధరలతోనే ప్రస్తుతం ప్యాకేజీ అందుబాటులో ఉంది.

25
ప్యాకేజీ ధరలు, ప్రయాణ కేటగిరీలు

ఈ భారత్ గౌరవ్ రైలులో మొత్తం 751 బెర్త్‌లు అందుబాటులో ఉన్నాయి. అందులో కంఫర్ట్ కేటగిరీలో 49, స్టాండర్డ్ కేటగిరీలో 210, ఎకానమీ కేటగిరీలో 492 సీట్లు ఉన్నాయి. మీ బడ్జెట్, సౌకర్యాన్ని బట్టి మీకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ అందిస్తున్న ఈ 'దక్షిణ భారత యాత్ర' ప్యాకేజీలో ప్రయాణికుల బడ్జెట్, సౌకర్యాలకు అనుగుణంగా మూడు కేటగిరీలలో టికెట్ ధరలను నిర్ణయించారు.

ఎకానమీ కేటగిరీలో స్లీపర్ క్లాస్ ప్రయాణానికి గానూ ఒక్కొక్కరికి రూ. 23,560 ఛార్జీ ఉండగా, 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు రూ. 22,130 గా నిర్ణయించారు. స్టాండర్డ్ కేటగిరీలో 3 ఏసీ ప్రయాణానికి పెద్దలకు రూ. 39,100, పిల్లలకు రూ. 37,420 ధర ఉంది. ఇక అత్యంత సౌకర్యవంతమైన కంఫర్ట్ కేటగిరీలో 2 ఏసీ ప్రయాణానికి ఒకరికి రూ. 51,760 కాగా, 5 నుండి 11 ఏళ్ల పిల్లల టికెట్ ధర రూ. 49,750 గా ఉంది.

ఒంటరిగా బుక్ చేసుకునే ప్రయాణికులు ఇతర ప్రయాణికులతో రూమ్, సీట్ షేరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

35
బోర్డింగ్ పాయింట్లు, ఇతర ప్రయాణ వివరాలు

ఈ యాత్ర జూలై 31 నుండి ప్రారంభమై ఆగస్టు 11 వరకు సాగుతుంది. గోరఖ్‌పూర్ జంక్షన్ నుండి ప్రారంభమయ్యే ఈ రైలు మంకాపూర్ జంక్షన్, అయోధ్యా కాంట్, సుల్తాన్‌పూర్ జంక్షన్, ప్రతాప్‌గఢ్ జంక్షన్, ప్రయాగ్‌రాజ్ సంగం, రాయ్‌బరేలీ జంక్షన్, లక్నో జంక్షన్, కాన్పూర్ సెంట్రల్ జంక్షన్, ఒరాయ్, వీరాంగన లక్ష్మీబాయి (ఝాన్సీ), లలిత్‌పూర్ స్టేషన్‌లలో బోర్డింగ్, డీబోర్డింగ్ సదుపాయం కల్పిస్తోంది.

• డే 1-2: రైలు ప్రయాణం గోరఖ్‌పూర్ నుండి ప్రారంభమై రేణిగుంట జంక్షన్‌కు చేరుకుంటుంది.

• డే 3-4: తిరుపతిలో బస. తిరుపతి బాలాజీ దర్శనం, శ్రీకాళహస్తి, పద్మావతి అమ్మవారి ఆలయాల సందర్శన.

• డే 5-6: రామేశ్వరం చేరుకుని రామ్‌నాథ్ స్వామి ఆలయ సందర్శన.

• డే 7: మధురై చేరుకుని మీనాక్షి అమ్మవారి దర్శనం.

• డే 8: కన్యాకుమారి చేరుకుని వివేకానంద రాక్ మెమోరియల్, లోకల్ సైట్‌సీయింగ్ సందర్శన.

• డే 9-10: మార్కాపూర్ రోడ్డు స్టేషన్‌లో దిగి, బస్సు ద్వారా శ్రీశైలం చేరుకుని మల్లికార్జున జ్యోతిర్లింగ దర్శనం.

• డే 11-12: తిరుగు ప్రయాణం ప్రారంభమై నిర్ణీత స్టేషన్‌లలో ప్రయాణికులు దిగడంతో యాత్ర ముగుస్తుంది.

45
ప్యాకేజీలో లభించే సదుపాయాలు, మినహాయింపులు ఇవే

ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు లభిస్తాయి. ఎంచుకున్న కేటగిరీని బట్టి నాన్ ఏసీ లేదా ఏసీ హోటళ్లలో రాత్రి బస సదుపాయం ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం టీ, టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి శాఖాహార భోజనం ఆన్ బోర్డ్, ఆఫ్ బోర్డ్ ద్వారా అందిస్తారు. స్థానిక సందర్శనల కోసం రవాణా సౌకర్యం, ప్రయాణికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్, సహాయం కోసం ఐఆర్‌సీటీసీ టూర్ మేనేజర్లు తోడుగా ఉంటారు.

అయితే, దేవాలయాల ప్రవేశ రుసుములు, గైడ్ ఛార్జీలు, బోటింగ్ లేదా అడ్వెంచర్ స్పోర్ట్స్ ఛార్జీలు ప్యాకేజీలో చేర్చలేదు. హోటళ్లలో రూమ్ సర్వీస్, వ్యక్తిగత ఖర్చులు ప్రయాణికులే భరించాలి. అలాగే ఎటువంటి ప్రత్యేక దర్శనం టిక్కెట్లను ఐఆర్‌సీటీసీ సమకూర్చదు.

55
టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనలు.. ఇతర ముఖ్య విషయాలు

ఈ ప్యాకేజీని రద్దు చేసుకోవాలనుకుంటే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. యాత్ర ప్రారంభానికి 15 రోజుల కంటే ముందు రద్దు చేస్తే ఒక ప్రయాణికుడికి రూ. 250 కట్ చేస్తారు. 8 నుండి 14 రోజుల ముందు రద్దు చేస్తే 25% రుసుము, 4 నుండి 7 రోజుల ముందు రద్దు చేస్తే 50% రుసుము కోల్పోవాల్సి వస్తుంది. ప్రయాణానికి 4 రోజుల కంటే తక్కువ వ్యవధిలో రద్దు చేస్తే ఎటువంటి రీఫండ్ లభించదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ యాత్రను పూర్తి చేసిన తర్వాత ఎల్‌టిసి సదుపాయాన్ని పొందేందుకు ఐఆర్‌సీటీసీ సర్టిఫికేట్ ఇస్తుంది. ప్రయాణికులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డులను వెంట ఉంచుకోవాలి. ప్రయాణానికి ముందే ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం మంచిది. ఆన్‌లైన్ బుకింగ్స్, పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ [www.irctctourism.com](https://www.irctctourism.com) ను సందర్శించవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories