అసలు ట్రాఫిక్ సిగ్నల్ అన్నదే కనిపించని నగరమేదో తెలుసా..? ఏ విదేశాల్లోనో కాదు ఇండియాలోనే...

Published : May 15, 2026, 04:22 PM IST

ట్రాఫిక్ సిగ్నల్స్ లేని నగరాలు కూడా ఉంటాయా..? అసలు ఇది సాధ్యమేనా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఎక్కడో విదేశాల్లో కాదు ఇండియాలోనే అసలు ట్రాఫిక్ సిగ్నల్ లేని నగరం ఉంది. అదేదో తెలుసా..? 

PREV
15
ఈ నగరంలో ట్రాఫిక్ సిగ్నల్సే లేవా..!

కర్ణాటక రాజధాని బెంగళూరు ఐటీ సిటీగా కంటే ట్రాఫిక్ సమస్యలతోనే ఎక్కువ ఫేయస్ అయ్యింది. ఇక మన హైదరాబాద్ లో కూడా రోడ్లపై రద్దీ ఎక్కువే... కొన్నిసార్లు కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్స్ అవుతుంటాయి. ముంబై, పూణే, డిల్లీ,చెన్నై వంటి నగరాల్లోనూ ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రధాన రహదారులపైనే కాదు గల్లీల్లోనూ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటుచేసి వాహనాలను కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి. చిన్నచిన్న పట్టణాల్లోనూ ట్రాఫిక్ సిగ్నల్స్ వెలుస్తున్నాయి.

అయితే రోడ్డుపై ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల ట్రాఫిక్ సిగ్నల్స్ లేని నగరాలను ఊహించలేం. కానీ అలాంటి నగరాలు కూడా ఉన్నాయి... అందులో ఒకటి ఇండియాలోనే ఉంది. అసలు ట్రాఫిక్ సిగ్నల్ లేకుండానే వాహనాలను నియంత్రిస్తున్న ఆ నగరమేది..? ఇది ఎలా సాధ్యం అవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

25
ట్రాఫిక్ సిగ్నల్ కనిపించని నగరమేది..?

ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరిగేకొద్దీ వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. చిన్న నగరానికి వెళ్లినా సరే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిమిషాల తరబడి ఆగడం మనకు అలవాటైపోయింది. కానీ రాజస్థాన్ లోని కోటా నగరం ఇలా కాదు... అక్కడ ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కనిపించదు. అలాగని వాహనాలు ఎలాపడితే అలా వెళుతూ తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఉంటాయనుకునేరు... అసలు ఆటంకమే లేకుండా వాహనాలు కదులుతాయి. కోటా నగరంలో సిగ్నల్స్ లేకుండానే ట్రాఫిక్‌ను అద్భుతంగా కంట్రోల్ చేస్తున్నారు.

ఇండియాలోనే కోటా నగరం 'సిగ్నల్ ఫ్రీ సిటీ'గా రికార్డు సృష్టించింది. ఒకప్పుడు విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లతో అల్లాడిన ఈ నగరం ఇప్పుడు ఒక్క సిగ్నల్ కూడా లేకుండా వాహనాలు స్మూత్‌గా వెళ్లేలా మారిపోయింది. ఇందుకు గత కొన్నేళ్లుగా కోటా అర్బన్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్ట్ చేపట్టిన మార్పులే కారణం.

కోటాలో గతంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఎయిర్‌పోర్ట్ జంక్షన్, అనంతపుర జంక్షన్ వంటి కీలక ప్రాంతాల్లో సిగ్నల్స్‌ను తొలగించారు. వాటి స్థానంలో 'రౌండ్ అబౌట్స్' (సర్కిల్స్), అండర్‌పాస్‌లు నిర్మించారు. వాహనాల వేగం తగ్గకుండా రోడ్లను వెడల్పు చేశారు. ఫ్లైఓవర్లు, సర్వీస్ రోడ్ల ద్వారా వాహనాలు ఎక్కడా ఆగాల్సిన పనిలేకుండా నిరంతరాయంగా ప్రయాణించేలా చేశారు. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ అవసరం లేకుండాపోయింది.

35
భూటాన్ రాజధాని థింఫులోనూ నో ట్రాఫిక్ సిగ్నల్స్...

ప్రపంచంలోనే ట్రాఫిక్ లైట్లు కనిపించని ఏకైక రాజధాని నగరం థింపు... ఇది మన పొరుగుదేశం భూటాన్ రాజధాని. ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్‌కు బదులుగా ఇప్పటికీ పోలీసులే చేతి సైగలతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తారు. ఇక్కడ వాహనాల రద్దీ కూడా తక్కువగానే ఉంటుంది కాబట్టి టెక్నాలజీ అవసరం లేకుండా మనుషులతో నియంత్రణ సాధ్యం అవుతోంది. భూటాన్ ప్రజలు మన హైదరాబాద్ కో లేదంటే బెంగళూరుకో వస్తే ఈ ట్రాఫిక్, సిగ్నల్స్ ను చూసి ఆశ్చర్యపోతారేమో.

45
ట్రాఫిక్ సిగ్నల్ చరిత్ర...

చాలాకాలం ట్రాఫిక్ పోలీసులే వాహనాలను నియంత్రించేవారు... ఒక్క ఇండియాలోనే కాదు చాలా దేశాల్లో ఇదే పరిస్థితి. అయితే పారిశ్రామిక విప్లవం తర్వాత వాహనాల తయారీ పెరిగింది... ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చాయి. దీంతో రోడ్లపై రద్దీ పెరగడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పుట్టుకొచ్చాయి.

మొదట్లో కేవలం ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే ఉండేవి. 1921లో విలియం పాట్స్ అనే వ్యక్తి మూడు రంగుల సిగ్నల్ వ్యవస్థను పరిచయం చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండేందుకు ఆయన 'పసుపు' రంగును జోడించారు. అప్పటి నుంచి ఈ మూడు రంగుల విధానం ప్రపంచవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.

55
మొదటి ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్...?

1914లో అమెరికా క్లీవ్‌ల్యాండ్‌లో వాహనాలను నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటుచేశారు. ఇదే ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రాఫిక్ సిగ్నల్. ఇక ఇండియాలో మొదటి ట్రాఫిక్ సిగ్నల్ 1953 లో తమిళనాడు రాజధాని చెన్నైలో ఏర్పాటుచేశారు. కాలక్రమంలో అన్ని నగరాలకు ట్రాఫిక్ సిగ్నల్స్ విస్తరించాయి... ఇప్పుడు ప్రతి సిటీలో వందలు కాదు వేల సిగ్నల్స్ వెలిశాయి. అలాంటిది కోటా సిటీలో ట్రాఫిక్ సిగ్నలే లేకపోవడం ఆశ్చర్యకరం... అక్కడి వాహనదారుల క్రమశిక్షణను, అధికారుల పనితీరును ప్రశంసించాల్సిందే.

Read more Photos on
click me!

Recommended Stories