Indias Shortest Train Journey: 7 నిమిషాల్లోనే ముగిసే రైలు ప్రయాణం ఇది !

Published : Aug 26, 2026, 09:04 AM IST

Indias Shortest Train Journey: సీట్లో కూర్చునే లోపే స్టేషన్ వచ్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా? కానీ, అలాంటి రైల్వే స్టేషన్ భారత్ లో ఉంది. ఇదే దేశంలోని అత్యంత చిన్న రైలు ప్రయాణం అందించే రూట్. కేవలం 3 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లో పూర్తి చేస్తుంది.

PREV
15
7 నిమిషాల రైలు ప్రయాణానికి రూ.1270 టికెట్.. దేశంలోనే విచిత్రమైన రైలు రూట్

భారతీయ రైల్వే నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి. 69,181 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న మన దేశ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రతిరోజూ వేలాది రైళ్లు నడుస్తుంటాయి. కొన్ని రైళ్లు రోజుల తరబడి ప్రయాణిస్తే, మరికొన్ని రైళ్లు కొన్ని నిమిషాల్లోనే తమ ప్రయాణాన్ని ముగిస్తాయి. ఉదాహరణకు డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్‌ప్రెస్ తన ప్రయాణాన్ని పూర్తి చేయడానికి 80 నుంచి 85 గంటల సమయం తీసుకుంటుంది. కానీ మన దేశంలో కేవలం 7 నిమిషాల్లోనే ప్రయాణాన్ని పూర్తి చేసే ఒక రైలు కూడా ఉందని మీకు తెలుసా?

25
భారత్‌లో అత్యంత చిన్న రైలు ప్రయాణం

భారత్‌లోనే అత్యంత చిన్న రైలు ప్రయాణం కేవలం 7 నిమిషాల్లోనే పూర్తవుతుంది. మహారాష్ట్రలోని నాగపూర్ జంక్షన్ నుంచి అజనీ స్టేషన్ మధ్య నడిచే రైలు ప్రయాణమే దేశంలోనే అత్యంత చిన్నది. నాగపూర్ నుంచి అజనీ మధ్య ఉన్న దూరం కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే. ఈ రూట్‌లో ప్రయాణించే రైళ్లు ఈ 3 కిలోమీటర్ల దూరాన్ని 7 నుంచి 9 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే కవర్ చేస్తాయి. అంటే మీరు రైలు ఎక్కి సీట్లో సరిగ్గా కూర్చునే లోపే మీ గమ్యస్థానం వచ్చేస్తుంది.

35
3 కిలోమీటర్ల పరిధిలో రెండు రైల్వే స్టేషన్లు

నాగపూర్ జంక్షన్ (NGP) నుంచి అజనీ (AJNI) స్టేషన్ల మధ్య ప్రతిరోజూ పదుల సంఖ్యలో రైళ్లు నడుస్తుంటాయి. ఈ రూట్ ద్వారా వెళ్లే దాదాపు అన్ని రైళ్లు ఈ రెండు స్టేషన్లలో ఆగుతాయి. 3 కిలోమీటర్ల చిన్న దూరమే అయినప్పటికీ, ఈ రూట్‌లో రైలు ప్రయాణం చేసే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రతిరోజూ అప్ అండ్ డౌన్ చేసే ప్రయాణికులు ఈ రైళ్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నాగపూర్ మహారాష్ట్రలో ఒక ముఖ్యమైన నగరం కావడం వల్ల చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, వ్యాపారాల కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఈ చిన్న దూరానికి కూడా ప్రజలు రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు.

45
ఈ రూట్‌లో రైలు టికెట్ ధరలు ఎంతంటే?

నాగపూర్-అజనీ రూట్‌లో ప్రతిరోజూ 6 కంటే ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ 3 కిలోమీటర్ల ప్రయాణానికి కోచ్ రకాన్ని బట్టి టికెట్ ధరలు వేర్వేరుగా ఉంటాయి. జనరల్ కోచ్ నుంచి ఎసి కోచ్ వరకు టికెట్ రేట్లు కింద విధంగా ఉన్నాయి:

• జనరల్ కోచ్: రూ. 60

• స్లీపర్ కోచ్: రూ. 145 నుంచి రూ. 175 వరకు

• AC 3-టైర్ కోచ్: రూ. 555

• AC 2-టైర్ కోచ్: రూ. 760

• AC 1-టైర్ కోచ్: రూ. 1,270

55
టికెట్లకు విపరీతమైన డిమాండ్

టికెట్ ధరలు చూస్తేనే అర్థమవుతుంది ఈ చిన్న ప్రయాణానికి కూడా ప్రజల నుంచి ఎంతటి డిమాండ్ ఉందో. కేవలం 3 కిలోమీటర్ల దూరమే అయినప్పటికీ సమయం ఆదా అవుతుండటంతో ప్రజలు ఈ రైలు ప్రయాణానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, రోజువారీ విద్యార్థులు, వివిధ పనులపై వచ్చేవారు, ఉద్యోగులు ఈ రూట్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. 7 నిమిషాల ప్రయాణానికి రూ.1,270 వరకు టికెట్ ధర ఉన్నప్పటికీ ప్రయాణికుల రద్దీ తగ్గకపోవడం విశేషం.

Read more Photos on
click me!

Recommended Stories