
మన దేశంలో సీఫుడ్ క్యాపిటల్‌గా ఓ నగరానికి చాలా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచవ్యాప్తంగా దీనికి చరిత్ర ఉంది. అంతేకాదు ఈ నగరానికి టూర్ కి వచ్చి సీ ఫుడ్ తినకుండా వెళ్లరు. ఎన్నో వెరైటీలు దొరుకుతాయి. అంతేకాదు వందల ఏళ్ల చేపల వేట సంప్రదాయం, సందడిగా ఉండే ఫిష్ మార్కెట్లు, అక్కడి చేపలకు ఉండే రుచి, వండే విధానం...ఇవన్నీ కలిపి ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. అదే కేరళలోని కొచ్చి.
సముద్రంతో విడదీయలేని అనుబంధం
అరేబియా సముద్ర తీరంలో ఉన్న కొచ్చి కేరళలోని ప్రముఖ ఓడరేవు నగరాల్లో ఒకటి. శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఈ నగరానికి చేపల వేట, సీ ఫుడ్ మార్కెట్, విదేశీ సంస్కృతులతో ఏర్పడిన పరిచయాలు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చాయి.
ఇక్కడి మత్స్యకారులు తెల్లవారుజామునే సముద్రంలోకి వెళ్లి చేపలు పట్టుకొస్తారు. ఆ తర్వాత చేపల రేవులు, మార్కెట్లలో కొనుగోళ్లు మొదలవుతాయి. స్థానిక ప్రజలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు కూడా తాజా చేపల కోసం ఈ మార్కెట్లకు వస్తారు. తాజా చేపలతో రుచికరమైన ఫుడ్ చేసుకోవచ్చు.
కొచ్చి తీర ప్రాంతంలో వివిధ రకాల సముద్రపు ఆహారాలు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా రొయ్యలు, పీతలు, కరిమీన్ చేపలు, మస్సెల్స్, స్క్విడ్, కటిల్‌ఫిష్, సీర్ ఫిష్ వంటి వాటికి మంచి డిమాండ్ ఉంది. చేపల రకాలు, వాటి లభ్యత సీజన్‌ను బట్టి మారుతుంటాయి. ఇక్కడి వంటకాల ప్రత్యేకత కేవలం తాజా చేపల్లోనే లేదు. వాటిని వండే పద్ధతుల్లోనూ ఉంది. కొబ్బరి, కరివేపాకు, ఆవాలు, మిరియాలు, పచ్చిమిర్చి, చింతపండు ఉపయోగించి చేసే వంటకాలు కేరళ తీర ప్రాంతపు రుచులను పరిచయం చేస్తాయి.
కరిమీన్ పొల్లిచత్తు- కేరళకు ప్రత్యేకమైన పెర్ల్ స్పాట్ చేపను మసాలాలతో మెరినేట్ చేసి అరటి ఆకులో చుట్టి వండుతారు. చేపకు మసాలాల రుచి బాగా పట్టడంతోపాటు ఘుమఘుమలు అదిరిపోతాయి.
కేరళ ఫిష్ కర్రీ- చింతపండు, కారం, కరివేపాకుతో తయారుచేసే ఈ చేపల కూర అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి కొబ్బరి మసాలాల మారుతుంది.
చెమ్మీన్ కర్రీ- చెమ్మీన్ అంటే మలయాళంలో రొయ్యలు. కొబ్బరి, మసాలాలు, కరివేపాకుతో చేసే ఈ కూరలో రొయ్యల సహజమైన రుచికి ప్రత్యేక స్థానం ఉంటుంది.
క్రాబ్ రోస్ట్- పీతలను ఉల్లిపాయలు, మిరియాలు, కరివేపాకు, ఘాటైన మసాలాలతో ఉడికించి తయారుచేస్తారు.
మీన్ మొయిలీ- కొబ్బరి పాలతో తయారుచేసే ఈ చేపల కూరలో మసాలాల ఘాటు తక్కువగా ఉంటుంది. పసుపు, పచ్చిమిర్చి, అల్లంతో చేస్తారు.
కొచ్చి గురించి చెప్పేటప్పుడు ఫోర్ట్ కొచ్చిలో కనిపించే చైనీస్ ఫిషింగ్ నెట్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. సముద్ర తీరంలో భారీ కర్రలు, తాళ్లు, బరువుల సాయంతో పనిచేసే ఈ సంప్రదాయ చేపల వేట పరికరాలు నగరానికి గుర్తింపు తీసుకొచ్చాయి.
ఈ వలలు కొచ్చికి ఎప్పుడు, ఏ మార్గంలో వచ్చాయనే విషయంలో చాలా కథలు ఉన్నప్పటికీ, చైనీస్ ప్రభావంతో వీటికి ఆ పేరు స్థిరపడింది. నేడు ఇవి పర్యాటకులను ఆకర్షించడంతో పాటు కొచ్చికి సముద్రంతో ఉన్న చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేస్తున్నాయి. ఫోర్ట్ కొచ్చి తీరంలో సూర్యాస్తమయం సమయంలో ఈ వలల దగ్గర కనిపించే దృశ్యాలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అయితే చేపల వేటకు ఉపయోగించే వలల దగ్గరికి వెళ్లేటప్పుడు స్థానికుల జాగ్రత్తగా ఉండాలి.
కొచ్చి సీఫుడ్ సంస్కృతిని అర్థం చేసుకోవాలంటే అక్కడి చేపల మార్కెట్లను చూడాలి. ఉదయం వేళల్లోనే మార్కెట్లు కొనుగోలుదారులతో సందడిగా మారతాయి. ఏ చేప తాజాగా ఉంది? ఏది ఏ వంటకి బాగుంటుంది? ధర ఎంత? వంటి విషయాలపై కొనుగోలుదారులు, విక్రేతల మధ్య బేరసారాలు జరుగుతుంటాయి.
కొన్ని చోట్ల మార్కెట్లో చేపలను కొనుగోలు చేసి, సమీపంలోని రెస్టారెంట్లలో వండించుకోవచ్చు. అయితే ఈ సదుపాయం ప్రతి చోటా ఉండదు. వెళ్లే ముందు సంబంధిత రెస్టారెంట్లో వివరాలు తెలుసుకోవడం మంచిది.
మంగళూరు, విశాఖపట్నం, చెన్నై కూడా పోటీదారులే!
సీ ఫుడ్ కి కేవలం కొచ్చి మాత్రమే కాదు..కర్ణాటకలోని మంగళూరు, విశాఖపట్నం, చెన్నైలోనూ సీ ఫుడ్ వంటలు చాలా రుచిగా ఉంటాయి. అక్కడ నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. ప్రతి ప్రాంతానికీ తనదైన రుచి, చేపల వేట సంప్రదాయాలు