Indian Railway : వందేళ్లకు పైగా చరిత్ర… వేల కిలోమీటర్ల రైల్వే వ్యవస్థ… నిత్యం వేలాది రైళ్లు… లక్షలాదిమంది ప్రయాణం. ఇంతటి ఘనత కలిగిన ఇండియన్ రైల్వేస్ ఇప్పటివరకు ఓ రాష్ట్రంలో కనీసం అడుగుపెట్టలేకపోయింది. అసలు రైల్వే నెట్ వర్క్ లేని రాష్ట్రం ఏదో తెలుసా?
Indian Railway : ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన టాప్ 5 దేశాల్లో భారత్ ఒకటి. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానం ఇండియన్ రైల్వేస్ దే... దాదాపు 70 వేల కిలోమీటర్ల రైల్వే లైన్ కలిగి ఉంది. నిత్యం 20 వేలకు పైగా రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి... లక్షలాదిమందిని గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఇలా వంద సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి, దేశవ్యాప్తంగా విస్తరించిన రైల్వే వ్యవస్థ ఒక్క రాష్ట్రంలో మాత్రం అడుగుపెట్టలేదు. ఆ రాష్ట్రమేది..? రైలు ప్రయాణం ఎందుకు సాధ్యం కాలేదు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
25
రైల్వే వ్యవస్థ లేని రాష్ట్రం..?
ఏ రాష్ట్రమైని అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే రవాణా వ్యవస్థ బాగుండాలి. రోడ్డు, వాయు రవాణాతో పాటు రైల్వే వ్యవస్థ రాష్ట్రాల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇలా మన దేశంలోని అనేక రాష్ట్రాలు వేల కిలోమీటర్ల రైల్వే వ్యవస్థను కలిగి ఉన్నాయి... కానీ ఓ రాష్ట్రం ఇప్పటివరకు రైలు కూత ఎరుగదు. అదే ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం.
సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి... సిక్కింలో మరింత దారుణం. ఎత్తైన హిమాలయా పర్వతాలు, లోతైన లోయలు, తరచు భూకంపాలు సంభవించడం, భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటం... ఇలాంటి పరిస్థితులతో సిక్కిం రైల్వే ట్రాక్ నిర్మాణానికి అంత అనువుగా లేదు. అందుకే శతాబ్దాలుగా ఈ రాష్ట్ర రైల్వేకు దూరమయ్యింది... ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేని రాష్ట్రంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.
35
అతి పెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన రాష్ట్రమేది..?
భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగి ఉంది. ఈ రాష్ట్రం ఏకంగా 9 వేల కిలోమీటర్లకు పైగా రైల్వే నెట్ వర్క్ తో భారత రైల్వేకు వెన్నెముకలా నిలుస్తోంది. రాజధాని లక్నోతో పాటు కాన్పూర్, ఘజియాబాద్, గోరఖ్ పూర్, వారణాసి, ప్రయాగరాజ్, ఝాన్సీ, ఆగ్రా వంటి ప్రధాన స్టేషన్లు ఉన్నాయి... ఇక్కడినుండి ప్రతిరోజు వందల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి.
భారతదేశంలో రైల్వే నెట్ వర్క్ లేని రాష్ట్రం సిక్కిం లాగే ప్రపంచంలో రైల్వే నెట్ వర్క్ లేని దేశాలు కూడా ఉన్నాయి. ఇలా మన పొరుగునే ఉన్న భూటాన్ లో అసలు రైల్వే వ్యవస్థ లేదు. అలాగే కువైట్, మాల్దీవ్స్, లిబియా, యెమెన్, తైమూర్, ఐస్లాండ్, అండోరా వంటి దేశాల్లోనూ రైల్వే వ్యవస్థ లేదు. కొన్ని దేశాల్లో పరిస్థితులు అనుకూలించక... మరికొన్ని దేశాలు అవసరం లేక రైల్వేకు దూరంగా ఉన్నాయి.
55
అసలు పేరే లేని రైల్వే స్టేషన్..?
భారతదేశంలో అసలు పేరులేని ఓ రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా..? ఇది పశ్చిమ బెంగాల్ లో ఉంది. బెంగాల్ లోని వర్ధమాన్ జిల్లాల్లో 2008 లో కొత్తగా ఓ రైల్వే స్టేషన్ నిర్మించారు... ఇది రైనాగర్, రైనా అనే రెండు గ్రామాల మధ్య ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ కు మొదట రైనాగర్ స్టేషన్ అని పేరు పెట్టారు... దీనికి రైనా గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రైల్వే అధికారులు ఈ స్టేషన్ సైన్ బోర్డును తొలగించారు.. దీంతో పేరు లేని రైల్వే స్టేషన్ గా ఇది గుర్తింపు పొందింది.