ఈ దేవ మాలి గ్రామ ప్రత్యేకతలు...
ఈ ఊరిలో రూల్స్ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. ఈ గ్రామంలో ఏ ఇంటికీ మనకు తాళాలు వేసి కనిపించవు. ఇక్కడి ప్రజల మధ్య ఐక్యత, నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అందుకే, వారు తమ ఇళ్లకు తాళాలు వేసుకోరు. అంతేకాదు, వీరు తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ గ్రామంలో ఎవరూ మాంసం, చేపలు, ఆల్కహాల్ ముట్టరు. అంతేకాకుండా వేప కట్టెలు కాల్చడం, కిరోసిన్ వాడకం కూడా ఇక్కడ నిషేధం.గ్రామంలో ఉన్న ప్రసిద్ధ భగవాన్ దేవనారాయణ్ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి తరలివస్తారు.
అంతేకాదు, ఈ గ్రామం చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే... ఈ గ్రామం అత్యుత్తమ పర్యాటక ప్రాంతంగా మారి, అందరినీ ఆకర్షిస్తోంది.