ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన వాళ్లకి ఇది బాగా నచ్చుతుంది. ట్రెక్కింగ్ మొదలుపెట్టాక గోండార్, బంటోలి వంటి అందమైన పల్లెలు కనిపిస్తాయి. అడవులు, నదులు, జలపాతాలు, ఎత్తైన పర్వతాల మధ్య సాగే ఈ ట్రెకింగ్ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. దారిలో పర్యాటకులు బస చేయడానికి, భోజనం చేయడానికి హోంస్టేలు, చిన్న లాడ్జీలు కూడా ఉంటాయి.
మధ్యమహేశ్వర్ ఆలయం చేరుకున్నాక అక్కడ నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో బుద్ధ మధ్యమహేశ్వర్ ఉంది. ఇక్కడి నుండి చౌఖంబా, నీలకంఠ్ సహా మంచుతో కప్పిన అనేక పర్వత శిఖరాల అద్భుత దృశ్యం కనిపిస్తుంది. దీనితో పాటు, కాంచని తాల్ అనే ఎత్తైన హిమనీనద సరస్సు కూడా ఉంది. అక్కడికి చేరుకోవడానికి ప్రత్యేకంగా ట్రెకింగ్ చేయాలి. ఏదైనా ఈ ప్రదేశం కూడా స్వర్గాన్ని గుర్తుకు తెస్తుంది.