Liquor Safety Check: నకిలీ, కల్తీ మందును ఎలా గుర్తుపట్టాలి? FSSAI చెప్పిన ఈ 5 సింపుల్ ట్రిక్స్ మీకోసం

Published : Aug 04, 2026, 12:26 PM IST

Liquor Safety Check: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) పలు లిక్కర్ బ్రాండ్లకు బిగ్ షాకిచ్చింది. తప్పుడు లేబుళ్లతో కస్టమర్లను మోసం చేసే పలు రకాలపై బ్యాన్ విధించింది. అయితే, మీరు తాగేది ఒరిజినల్ మందేనా? అనేది ఎలా తెలుసుకోవాలి?

PREV
16
లిక్కర్ లవర్స్ అలర్ట్: మీరు తాగేది ఒరిజినల్ మందేనా?

ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్, బ్యాగ్‌పైపర్ వంటి పాపులర్ బ్రాండ్లలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలపడం, తప్పుడు లేబుళ్లతో కస్టమర్లను మోసం చేయడంపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో సాధారణ వినియోగదారుల్లో ఒకటే ఆందోళన మొదలైంది.. “మరి మనం కొనే మందు బాటిల్ అసలైనదో కాదో ఎలా తెలుసుకోవాలి?"

దీనిపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను, 'లేబులింగ్ అండ్ డిస్‌ప్లే రెగ్యులేషన్స్ 2020' నిబంధనలను గుర్తు చేస్తోంది. మీరు కొనే మందు బాటిల్ క్వాలిటీగా ఉందో లేదో సులభంగా తెలుసుకోవడానికి ఈ కింది విషయాలు చెక్ చేయండి.

26
ఫ్రంట్ లేబుల్ జాగ్రత్తగా చూడండి: ఫ్లేవర్డ్ అని ఉందా?

ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త నిబంధనల ప్రకారం.. షార్ట్‌కట్‌లో తయారు చేసిన మందును ఒరిజినల్ పేరుతో అమ్మడానికి వీల్లేదు.

• బాటిల్ ముందు భాగంలో కేవలం 'Whisky' లేదా 'Rum' అని ఉంటే, అది సంప్రదాయ పద్ధతిలో సహజంగా తయారైన ప్రాసెస్డ్ ప్రొడక్ట్.

• ఒకవేళ అందులో బయటి నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు కలిపితే, సదరు కంపెనీ తప్పనిసరిగా 'Whisky-Flavoured Spirit' లేదా 'Rum-Flavoured Spirit' అని బాటిల్ ముందు భాగాన స్పష్టంగా ముద్రించాలి.

• 'ఫ్లేవర్డ్' అని ఉంటే అది నాచురల్‌గా తయారైంది కాదు, కెమికల్స్ కలిపిన న్యూట్రల్ ఆల్కహాల్ అని అర్థం చేసుకోవాలి.

36
ఏజ్ క్లెయిమ్స్ నమ్మొచ్చా?

చాలామంది 7 ఇయర్స్, 12 ఇయర్స్ ఓల్డ్ అని బాటిళ్లపై ఉంటే అది బెస్ట్ క్వాలిటీ అని కొనేస్తుంటారు. కానీ ఎఫ్ఎస్ఎస్ఏఐ రీసెంట్ ల్యాబ్ రీసెర్చ్‌లలో 7 ఇయర్స్ ఓల్డ్ రమ్ అని చెప్పి, అందులో 95% అన్-ఏజ్డ్ అంటే వెంటనే తయారు చేసిన ఆల్కహాల్‌నే ఉపయోగిస్తున్నట్లు తేలింది.

• బాటిల్‌పై ఏదైనా నిర్దిష్ట కాల పరిమితి ఉదాహరణకు 7 ఏళ్లు రాసి ఉంటే, ఆ బాటిల్‌లో ఉన్న మొత్తం లిక్కర్ లేదా బ్లెండ్‌లో మెజారిటీ భాగం అంతకాలం పాటు ఉంచినదే అయి ఉండాలి.

• లేబుల్‌పై 'బ్రాండ్ నేమ్' లో భాగంలాగా '7 Years' అని రాసి ఉండి, కింద చిన్న అక్షరాలతో 'ప్లెయిన్ స్పిరిట్' అని ఉంటే అది ఫేక్ క్లెయిమ్ అని గుర్తించాలి.

46
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్ అండ్ క్యూఆర్ కోడ్

ఏదైనా అధికారిక లిక్కర్ బాటిల్ వెనుక వైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ కి సంబంధించిన వివరాలు ఉండటం తప్పనిసరి.

• 14 అంకెల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ నంబర్: బాటిల్ లేబుల్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగోతో పాటు 14 డిజిట్ల లైసెన్స్ నంబర్ ప్రింట్ అయి ఉందో లేదో చూడండి.

• క్యూఆర్ కోడ్ / ఎక్సైజ్ సీల్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖలు అందించే హోలోగ్రామ్ లేదా క్యూఆర్ కోడ్ సీల్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేయండి. స్కాన్ చేస్తే ప్రొడక్ట్ బ్యాచ్ నంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ మ్యాచ్ అవ్వాలి.

56
బాటిల్ సీల్, ఫ్లేవర్, కలర్‌లో మార్పులు

తక్కువ క్వాలిటీ లేదా కల్తీ మందును బాటిల్‌లోని ఫిజికల్ ఛేంజెస్ ద్వారా కూడా గుర్తుపట్టవచ్చు.

• కాప్ సీలింగ్: మూత లూజ్‌గా ఉన్నా, లేదా సీల్ కట్ అయినట్లు అనిపించినా ఆ బాటిల్‌ను అస్సలు తీసుకోవద్దు.

• ఆర్టిఫిషియల్ స్మెల్: బాటిల్ తెరిచిన వెంటనే విపరీతమైన కెమికల్ వాసన లేదా అతిగా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంటే అందులో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు ఎక్కువ కలిపారని అర్థం.

• లిక్విడ్ కలర్: లిక్కర్ రంగు అసాధారణంగా ముదురు రంగులో ఉన్నా లేదా బాటిల్ అడుగున చిన్న చిన్న అడుగు పదార్థాలు పేరుకుపోయినా అది సబ్‌-స్టాండర్డ్ ప్రొడక్ట్ కావచ్చు.

66
కొనుగోలుదారులు ఏం చేయాలి?

వినియోగదారులు ఎప్పుడూ గుర్తింపు పొందిన వైన్ షాపులు లేదా ఎక్సైజ్ పర్మిషన్ ఉన్న డిస్పెన్సరీల నుంచే లిక్కర్ కొనుగోలు చేయాలి. తక్కువ ధరకు వస్తుందని లేదా ఆఫర్లు ఉన్నాయని రికగ్నిషన్ లేని చోట కొంటే నకిలీ, కల్తీ మందు బారిన పడే ప్రమాదం ఉంది.

ఒకవేళ మీరు కొన్న బాటిల్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారం ఉన్నా లేదా కల్తీ జరిగినట్లు అనుమానం వచ్చినా, ఎఫ్ఎస్ఎస్ఏఐ "Smart Consumer" యాప్ ద్వారా లేదా స్థానిక ఆహార భద్రతా అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories