Leftover Cool Drinks Uses: మిగిలిపోయిన కూల్ డ్రింక్స్ పారబోస్తున్నారా? ఈ క్రేజీ హ్యాక్స్ తెలిస్తే అస్సలు వదలరు

Published : Jun 23, 2026, 09:30 AM IST

Leftover Cool Drinks Uses: కూల్ డ్రింక్ లో గ్యాస్ పోయిందని పారబోస్తున్నారా? లేదా ఇంకా మిగిలిపోయిన కూల్ డ్రింక్స్ ను పారాబోస్తున్నారా? దుస్తులపై మరకల నుంచి టాయిలెట్ క్లీనింగ్ వరకు మిగిలిన కూల్ డ్రింక్స్‌తో చేసే క్రేజీ హోమ్ హ్యాక్స్ వివరాలు మీకోసం.

PREV
16
మీ ఇంట్లోని మొండి మరకలను మాయం చేసే కూల్ డ్రింక్ మ్యాజిక్

ఇంటికి గెస్టులు వస్తే మెనూలో కూల్ డ్రింక్స్ కంపల్సరీ ఉండాల్సిందే. అయితే ఎంత తాగినా సరే, బాటిల్‌లో ఎంతో కొంత డ్రింక్ మిగిలిపోవడం కామన్. ఒకసారి మూత తీశాక గ్యాస్ పోవడంతో ఆ తర్వాత దాన్ని తాగడానికి ఎవరూ ఇష్టపడరు. టేస్ట్ మారిపోయిందని చాలామంది దాన్ని సింక్‌లో పారబోస్తుంటారు. కానీ, ఇకపై అలా అస్సలు చేయకండి. గ్యాస్ పోయిన కూల్ డ్రింక్స్‌తో ఇంట్లోనే బోలెడు క్రేజీ పనులు చేసుకోవచ్చని హోమ్ కేర్ నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు గమనిస్తే..

26
బట్టలపై మొండి మరకలకు కూల్ డ్రింక్స్ తో బై బై

కొన్నిసార్లు మనం ఎంత కాస్ట్‌లీ బట్టలు వేసుకున్నా వాటిపై నూనె లేదా గ్రీజు మరకలు పడితే ఇక అంతే సంగతులు. డిటర్జెంట్లతో ఎంత ఉతికినా ఆ జిడ్డు వదలదు. ఇలాంటి టైమ్‌లో మిగిలిపోయిన కూల్ డ్రింక్ సూపర్ హెల్ప్ అవుతుంది. మరక పడిన చోట కొద్దిగా కూల్ డ్రింక్ పోసి, ఓ అరగంట పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఎప్పటిలాగే నార్మల్ సోప్‌తో వాష్ చేస్తే ఆ మొండి మరకలు తొలగిపోతాయి.

36
టాయిలెట్ సీటు కొత్తదానిలా మెరవాలంటే..

టాయిలెట్ క్లీన్ చేయడం ఎప్పుడూ పెద్ద తలనొప్పే. మార్కెట్లో దొరికే కెమికల్ క్లీనర్లు వాడకుండా, ఇంట్లో మిగిలిన కూల్ డ్రింక్‌తోనే దీన్ని ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఒక స్ప్రే బాటిల్‌లో మిగిలిపోయిన కూల్ డ్రింక్ పోసి, టాయిలెట్ సీటు అంతా స్ప్రే చేయండి. ఒక 10 నుండి 15 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచి, తర్వాత బ్రష్‌తో కాస్త రఫ్ చేసి ఫ్లష్ కొట్టేయండి. అంతే.. మురికి అంతా వదిలిపోయి టాయిలెట్ సీటు నీట్‌గా మారుతుంది.

46
ఐరన్ వస్తువుల తుప్పు వదిలించండిలా

ఇంట్లో ఉండే ఐరన్ వస్తువులు లేదా టూల్స్ తేమ వల్ల త్వరగా తుప్పు పడుతుంటాయి. ఈ తుప్పును వదిలించడం అంత ఈజీ కాదు. కానీ తుప్పు పట్టిన భాగాలపై కూల్ డ్రింక్ చల్లి, కాసేపు ఆగాక స్క్రబ్బర్‌తో రుద్దితే చాలు. అందులోని యాసిడ్ గుణాలు తుప్పును ఈజీగా లూజ్ చేస్తాయి. దీంతో ఐరన్ వస్తువులు మళ్లీ క్లీన్‌గా మారిపోతాయి. అదేవిధంగా బైక్ లేదా కారు విండ్ షీల్డ్స్, ఇంట్లోని అద్దాలపై డస్ట్ పేరుకుపోయినప్పుడు కూల్ డ్రింక్ స్ప్రే చేసి, కాసేపటి తర్వాత తడి బట్టతో, ఆపై పొడి బట్టతో తుడిస్తే అద్దాలు తళతళలాడుతాయి.

56
జిడ్డు ఫ్లోర్, మాడిన గిన్నెలకు బెస్ట్ సొల్యూషన్

కిచెన్ సిమెంట్ ఫ్లోర్ లేదా టైల్స్‌పై నూనె వలికినప్పుడు ఎంత తుడిచినా ఆ జిడ్డు అస్సలు వదలదు. అలాంటి ప్లేస్‌లో కొద్దిగా కూల్ డ్రింక్ స్ప్రే చేసి కాసేపటి తర్వాత క్లాత్‌తో తుడిస్తే జిడ్డు వదిలి ఫ్లోర్ మెరుస్తుంది. ఇక వంట చేసేటప్పుడు గిన్నెలు మాడిపోవడం పెద్ద సమస్య. ఆ మాడిన గిన్నెలో మిగిలిన కూల్ డ్రింక్ పోసి రాత్రంతా అలాగే ఉంచేయండి. మరుసటి రోజు ఉదయం నార్మల్‌గా క్లీన్ చేస్తే ఆ మాడిన నలుపు అంతా ఈజీగా ఊడొస్తుంది.

66
బాత్రూమ్ ట్యాప్స్ మెరుపు.. బబుల్‌గమ్ ముక్కులు క్లియర్

బాత్రూమ్, కిచెన్ ట్యాప్‌లపై నీటి మరకలు, సబ్బు మురికి పేరుకుపోయి తెల్లగా మారుతుంటాయి. వాటిపై కూల్ డ్రింక్ స్ప్రే చేసి కాసేపటి తర్వాత క్లీన్ చేస్తే ట్యాప్స్ కొత్తవాటిలా షైన్ అవుతాయి. షూస్‌కో, చెప్పులకో బబుల్‌గమ్ అంటుకుంటే దాన్ని తీయడం పెద్ద టాస్క్. అలాంటప్పుడు ఆ బబుల్‌గమ్ ఉన్న చోట కొద్దిగా కూల్ డ్రింక్ పోసి కాసేపు ఆగితే, బబుల్‌గమ్ సాఫ్ట్‌గా మారి సింపుల్‌గా ఊడి వచ్చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories