మనదేశంలో సరస్సులో తేలియాడే ఐదంతస్తుల రాజభవనం.. అందులో నాలుగు అంతస్తులు నీటిలోనే..

Published : Oct 29, 2026, 08:55 AM IST

రాజస్థాన్ రాజధాని జైపూర్‌ ఎన్నో రాజ ప్యాలెస్ లకు నిలయం. వాటిలో ఎంతో అందమైనది జల్ మహల్. మాన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న చారిత్రక కట్టడం ఎంతో ప్రత్యేకమైనది. చరిత్ర, అద్భుతమైన ఆర్కిటెక్చర్, ప్రకృతి అందాలకు ఇది కేరాఫ్ అడ్రస్.

PREV
13
చారిత్రక జల్ మహల్

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో జల్ మహల్ ఒకటి. మాన్ సాగర్ సరస్సు మధ్యలో ఉన్న ఈ ప్యాలెస్.. అద్భుతమైన ఆర్కిటెక్చర్, చారిత్రక నేపథ్యం, ప్రకృతి అందాలతో దేశవిదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. 'జల్ మహల్' అంటే నీటి ప్యాలెస్ అని అర్థం. నీటి మధ్యలో నీలిపై తేలియాడుతున్నట్లు కనిపించే ఈ భవనాన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవు.

ఈ మహల్ ను 18వ శతాబ్దంలో అమేర్ మహారాజు రెండో సవాయ్ జై సింగ్ నిర్మించారు. రాజకుటుంబీకులు విశ్రాంతి తీసుకోవడానికి, వేటకు వెళ్లినప్పుడు బస చేయడానికి ఈ ప్యాలెస్‌ను ఉపయోగించేవారని చరిత్ర చెబుతోంది. జైపూర్ చారిత్రక వారసత్వంలో ఈ ప్యాలెస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

23
ఐదు అంతస్తుల అద్భుత ప్యాలెస్

ఈ జల్ మహల్ ను ఎర్ర ఇసుకరాయితో నిర్మించారు. మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. సరస్సులో నీటి మట్టం పెరిగినప్పుడు పై అంతస్తు మాత్రమే నీటి పైన కనిపిస్తుంది. మిగతా నాలుగు అంతస్తులు నీటిలోనే మునిగి ఉంటాయి. ఇదే ఈ ప్యాలెస్ ప్రధాన ఆకర్షణ. ప్యాలెస్ చుట్టూ ఉన్న మాన్ సాగర్ సరస్సు, దాని వెనుక ఉన్న ఆరావళి కొండలు ఈ జల్ మహల్ ను మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తున్నాయి. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాల్లో సరస్సు నీటిలో పడే ప్యాలెస్ ప్రతిబింబం పర్యాటకులకు నచ్చుతుంది. ఈ సరస్సు ఎన్నో రకాల నీటి పక్షులకు ఆవాసంగా కూడా ఉంది.

33
రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక

జైపూర్ సందర్శించే పర్యాటకులు ఎవరైనా కూడా జల్ మహల్‌ చూడకుండా వెళ్లరు. అయితే, ప్యాలెస్ లోపలికి సాధారణ ప్రజలకు అనుమతి లేదు. పర్యాటకులు సరస్సు ఒడ్డు నుంచే ఈ ప్యాలెస్ అందాలను ఆస్వాదించాలి.

చరిత్ర, ఆర్కిటెక్చర్, ప్రకృతి అందాల కలయికగా ఉన్న ఈ జల్ మహల్.. రాజస్థాన్ సాంస్కృతిక వారసత్వానికి ఒక అమూల్యమైన ప్రతీక. నీటి మధ్యలో ఎంతో గంభీరంగా కనిపించే ఈ ప్యాలెస్, భారతదేశంలోని చారిత్రక కట్టడాల వైవిధ్యానికి మరో అందమైన ఉదాహరణగా నిలుస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories