చంద్రుని వివిధ దశలు.. అసలు సైన్స్ ఫ్యాక్ట్ ఇదే
చంద్రుడు సూర్యునికి, భూమికి మధ్యలోకి వచ్చినప్పుడు, దాని వెలుతురు పడే భాగం భూమికి కనిపించదు. దాన్నే మనం అమావాస్య అంటాం. ఈ సమయంలో జాబిల్లి అసలు కనిపించదు.
అది అలా కొంచెం ముందుకు కదిలినప్పుడు, సన్నని చంద్రవంక లాగా మారుతుంది. దీన్ని 'వెక్సింగ్ క్రిసెంట్' అంటారు. ఆ తర్వాత చంద్రుడు తన ప్రయాణంలో నాలుగో వంతు చేరుకున్నప్పుడు, సగం చంద్రుడు కనిపిస్తాడు. దీన్ని చంద్రుని ఫస్ట్ క్వార్టర్ అంటారు.
ఇక భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక వరుసలోకి వచ్చినప్పుడు పౌర్ణమి లేదా ఫుల్ మూన్ ఏర్పడుతుంది. ఈ రాత్రి జాబిల్లి నిండుగా, అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతుంది.