Gold Facts: బంగారం భూమిపైకి ఎలా వ‌చ్చిందో తెలుసా.? ఆస‌క్తిక‌ర విష‌యాలు..

Published : Jan 03, 2026, 11:55 AM IST

Gold Facts: బంగారాన్ని భార‌తీయుల‌ను విడ‌తీసి తీయ‌లేం. ఇది కేవ‌లం ఒక ఆభ‌ర‌మ‌ణే కాదు, ఎమోష‌న‌ల్ బాండింగ్‌. అందుకే బంగారం గురించి తెలుసుకోవ‌డానికి ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి బంగారానికి సంబంధించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
బంగారం ఎందుకు అంత విలువైన లోహం?

బంగారం మానవ చరిత్రలో వేల ఏళ్లుగా ప్రత్యేక స్థానం సంపాదించింది. ఆభరణాల రూపంలోనే కాదు, సంపదకు గుర్తుగా, పెట్టుబడిగా కూడా బంగారం ఉపయోగపడుతోంది. ఇది తుప్పు పట్టదు, రంగు మారదు. కాలం గడిచినా మెరుపు తగ్గదు. అందుకే పురాతన ఈజిప్టు కాలం నుంచి ఆధునిక యుగం వరకూ బంగారానికి డిమాండ్ తగ్గలేదు.

25
బంగారానికి ఉన్న భౌతిక విశేషాలు

బంగారం ప్రపంచంలో సహజంగా పసుపు రంగులో కనిపించే ఏకైక లోహం. ఇది చాలా బరువైన లోహం కూడా. ఒక క్యూబిక్ ఫీట్ బంగారం అర్ధ టన్నుకు పైగా బరువు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం చాలా మృదువుగా ఉంటుంది. ఒక గ్రాము బంగారాన్ని చదరపు మీటర్ పరిమాణంలో పలుచగా చాపవచ్చు. అందుకే అంతరిక్ష దుస్తుల గాజుపై బంగారం పొర వాడతారు. బంగారం వాసన ఉండదు, రుచి ఉండదు, విషపదార్థం కాదు. ఆహారంలో అలంకరణ కోసం కూడా వాడుతారు.

35
బంగారం భూమిపైకి ఎలా వచ్చింది?

బంగారం అసలు భూమిలో పుట్టలేదు అనే విషయం చాలామందికి తెలియదు. ఇది అంతరిక్షం నుంచి భూమికి చేరింది. కోట్ల ఏళ్ల క్రితం భూమిపై పడిన గ్రహశకలాలు, ఉల్కల ద్వారానే బంగారం ఇక్కడికి వచ్చింది. ఆ తరువాత భూమి లోతుల్లో తీవ్రమైన వేడి, ఒత్తిడి కారణంగా బంగారం నిల్వలుగా మారింది. ఈరోజు మనం తవ్వుతున్న బంగారం అంతా అప్పట్లో వచ్చిన అంతరిక్ష బహుమతే అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

45
కరెన్సీ, పెట్టుబడిగా బంగారం పాత్ర

ప్రపంచంలో మొదటి బంగారు నాణేలు క్రీస్తు పూర్వం లిడియా ప్రాంతంలో తయారయ్యాయి. చాలా దేశాల కరెన్సీ విలువ బంగారంతో అనుసంధానమై ఉండేది. కాలక్రమేణా అది మారినా, బంగారం విలువ మాత్రం నిలకడగా ఉంది. ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఆశ్రయిస్తారు. మార్కెట్లు పడిపోయినా బంగారం విలువ ఎక్కువగా నిలబడుతుంది. అందుకే దీన్ని సేఫ్ హావెన్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తారు. ఇప్పుడు ఫిజికల్ బంగారంతో పాటు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్, సార్వభౌమ గోల్డ్ బాండ్లు రూపంలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది.

55
ఆరోగ్యం, అంతరిక్షం, ఆహారంలో బంగారం వినియోగం

బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. వైద్య రంగంలో కూడా దీనికి ప్రాధాన్యం ఉంది. కొన్ని వ్యాధుల చికిత్సలో బంగారు సమ్మేళనాలు ఉపయోగిస్తారు. క్యాన్సర్ చికిత్సలో బంగారు నానో కణాలు ఉపయోగంలో ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో వేడి, కిరణాల నుంచి రక్షణ కోసం బంగారాన్ని వాడుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మన శరీరంలో కూడా స్వల్ప పరిమాణంలో బంగారం ఉంటుంది. విలాసవంతమైన హోటళ్లలో ఆహారంపై బంగారు ఆకులు అలంకరణగా వాడటం కూడా సాధారణమే.

Read more Photos on
click me!

Recommended Stories