Vasuki Snake: పరమశివుడి మెడలో పాము ఎందుకు ఉంటుందో మీకు తెలుసా?

Published : Aug 26, 2026, 10:30 AM IST

Lord Shiva Snake: పరమశివుడి మెడలో పాము ఎందుకు వుంటుందో మీకు తెలుసా? శివుని మెడలో వాసుకి నాగుపాము ఉండటం వెనుక క్షీరసాగర మధనం, హాలాహల విషం, కద్రువ శాపం లాంటి ఆసక్తికరమైన పురాణ కథలు, రహస్యాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
సముద్ర మథనం నుంచి శివుడి మెడ వరకు.. వాసుకి నాగు ఆసక్తికరమైన కథ ఇదే

శివుడు అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది చేతిలో త్రిశూలం, నుదుటన మూడో కన్ను, ఒంటి నిండా విభూతి.. ఇక మెడలో చుట్టుకుని ఉండే నాగుపాము. హిందూ దేవుళ్లలో శివుడి అలంకారం చాలా భిన్నంగా ఉంటుంది. అయితే, పరమశివుడి మెడలో ఆ నాగుపాము ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అది కేవలం అలంకారం కోసం పెట్టుకున్నది కాదు. దాని వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఆ పాము పేరు వాసుకి. వాసుకి శివుడి మెడకు ఎందుకు చుట్టుకుని ఉంటుంది? దీని వెనుక ఉన్న పురాణ కథలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

26
సముద్ర మథనం.. హాలాహల విషం

పురాణాల ప్రకారం దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం పాలసముద్రాన్ని మథనం చేశారు. దీనినే క్షీరసాగర మథనం అంటారు. ఈ సమయంలో మందర పర్వతాన్ని కవ్వంగా వాడారు. మరి దాన్ని తిప్పడానికి తాడు కావాలి కదా? అందుకోసం వాసుకి అనే నాగరాజును తాడులా ఉపయోగించారు. ఈ మథనం జరుగుతున్నప్పుడు సముద్రం నుంచి మొదట భయంకరమైన హాలాహల విషం బయటకు వచ్చింది. ఆ విషం చూసి లోకాలన్నీ భయపడ్డాయి.

అప్పుడు సృష్టిని కాపాడటం కోసం శివుడు ఆ విషాన్ని మింగేశాడు. అయితే ఆ విషం కడుపులోకి వెళ్లకుండా పార్వతీ దేవి శివుడి గొంతును గట్టిగా పట్టుకుంది. దాంతో ఆ విషం గొంతులోనే ఆగిపోయి, ఆయన గొంతు నీలం రంగులోకి మారింది. అందుకే ఆయనకు నీలకంఠుడు అని పేరొచ్చింది. అయితే ఆ విషం వల్ల శివుడికి కలిగిన మంటను తగ్గించడానికి, చల్లగా ఉండే వాసుకి నాగుపామును ఆయన మెడలో ధరించాడని పురాణాలు చెబుతున్నాయి.

36
శివుడి మెడలోకి వాసుకి ఎలా వచ్చాడు?

సముద్ర మథనం సమయంలో దేవతలు ఒకవైపు, రాక్షసులు మరోవైపు వాసుకిని పట్టుకుని లాగారు. ఈ ప్రాసెస్‌లో వాసుకి శరీరం తీవ్రంగా గాయపడింది. చాలా కష్టాలు పడ్డాడు. అయినా సరే సృష్టి కోసం ధైర్యంగా నిలబడ్డాడు. ఆ తర్వాత వాసుకి పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు చేశాడు. తనకు ఎప్పుడూ శివుడి దగ్గరే ఉండే అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. వాసుకి చూపించిన భక్తికి మెచ్చి శివుడు వరమిచ్చాడు. తన మెడలోనే శాశ్వతంగా ఆభరణంగా ఉండే అదృష్టాన్ని ఇచ్చాడు. అలా అప్పటి నుంచి వాసుకి నాగు పరమేశ్వరుడి మెడలో ఉండిపోయాడని కూడాాాా పురాణాలు చెబుతున్నాాయ.

46
తల్లి శాపం నుంచి తప్పించుకునేందుకు..

వాసుకి శివుడి మెడలో ఉండటానికి మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. సర్పాలకు తల్లి అయిన కద్రువ ఒకసారి తన కొడుకులకు ఘోరమైన శాపం ఇచ్చింది. భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగులన్నీ అగ్నికి ఆహుతి అయిపోతాయని శపించింది. ఈ శాపం గురించి తెలుసుకున్న నాగులన్నీ భయపడిపోయాయి. అప్పుడు వాసుకి నేరుగా వెళ్లి శివుడిని ఆశ్రయించాడు. శివుడిని ప్రసన్నం చేసుకుని రక్షణ పొందాడు. శివుడు వాసుకిని తన మెడలో ధరించడంతో ఆ కద్రువ శాపం వాసుకిపై పనిచేయలేదు. అలా వాసుకికి మరణ భయం అనేది లేకుండా పోయింది.

56
పాము కుబుసం.. కాలచక్రానికి ప్రతీక

శివుడి మెడలో పాము ఉండటం అనేది కేవలం కథ మాత్రమే కాదు. దీని వెనుక చాలా ఆధ్యాత్మిక అర్థాలు ఉన్నాయి. పాము తన పాత చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని తొడుగుకుంటుంది. ఇది పునర్జన్మకు, మార్పుకు సంకేతం. అలాగే శివుడి మెడలో ఈ పాము మూడు సార్లు చుట్టుకుని ఉంటుంది. ఈ మూడు చుట్లు గతం, వర్తమానం, భవిష్యత్తు అనే మూడు కాలాలకు ప్రతీక. అంటే కాలచక్రం కూడా శివుడి కంట్రోల్ లోనే ఉంటుందని దీని అర్థం. అలాగే యోగ శాస్త్రం ప్రకారం పాము అనేది మనలోని 'కుండలినీ శక్తి'కి సంకేతం. శివుడి మెడలో పాము ఉండటం అనేది మనలో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తి నిద్రలేవడాన్ని సూచిస్తుందని పండితులు చెబుతున్నారు.

66
భయం, మృత్యువుపై విజయం

సాధారణంగా పాము అంటే కోపం, విషం, మరణం, భయానికి గుర్తు. అలాంటి ప్రాణాంతకమైన పామును శివుడు తన మెడలో చాలా ప్రశాంతంగా ఉంచుకున్నాడు. అంటే భగవంతుడు అహంకారాన్ని, భయాన్ని, వినాశన శక్తులను పూర్తిగా తన అదుపులో ఉంచుకుంటాడని దీని అర్థం. అంతేకాదు, శివుడిని పశుపతినాథుడు అని కూడా అంటారు. అంటే సమస్త ప్రాణికోటికి ఆయన ప్రభువు. లోకంలో అందరూ భయపడే, అసహ్యించుకునే పాములు, భూతాలను కూడా శివుడు ఆదరిస్తాడు. ఆయన దృష్టిలో అన్ని జీవులు సమానమే అని ఈ నాగుపాము మనకు తెలియజేస్తుంది. శివుడి మెడలో పాము అనేది కేవలం అలంకారం కాదు.. అది శక్తి, నిర్భయత్వం, కరుణకు అసలైన ప్రతీక.

Read more Photos on
click me!

Recommended Stories