Currency notes: మనదేశంలో కరెన్సీ నోట్లను, నాణేలను ముద్రించే యూనిట్లు ఎక్కడున్నాయో తెలుసా?

Published : Jun 12, 2026, 08:34 AM IST

Currency notes: పది రూపాయలు నుంచి 500 రూపాయల నోట్ల వరకు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. వీటిని ముద్రించే యూనిట్లు మనదేశంలో ఎన్ని చోట్ల? ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి. అలాగే నాణేలను కూడా ముద్రించే యూనిట్లు గురించి ఇక్కడ వివరాలు చెప్పాము. 

PREV
14
కరెన్సీ నోట్లు,నాణాల ముద్రణ

మన రోజువారీ అవసరాలకు కరెన్సీ నోట్లు ఎంతో అవసరం. ఆన్లైన్ డిజిటల్ పేమెంట్లు వచ్చినప్పటికీ కొంతమంది ఇంకా నోట్లను, నాణేలను వాడుతూనే ఉన్నారు. ఈ నోట్లు, నాణేలు ఎక్కడ ఎలా ఉత్పత్తి అవుతున్నాయో.. ఎప్పుడైనా ఆలోచించారా? ప్రింటింగ్ ప్రెస్ యూనిట్లు మనదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోండి. కరెన్సీ నోట్లు రాత్రికి రాత్రి తయారుకావు. వీటి రూపకల్పనకు, ముద్రణకు ఒక కఠినమైన ప్రక్రియ ఉంటుంది.

24
నాణేలను ఎక్కడ ముద్రిస్తారు?

భారతదేశ అధికారిక కరెన్సీ రూపాయి. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి వీటి ఉత్పత్తి ప్రక్రియను కఠినంగా మార్చారు. ఆర్బిఐ చెబుతున్న ప్రకారం మనదేశంలో నాణేలను సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధీనంలో ముద్రిస్తారు. వీటికి ముంబై, హైదరాబాద్, కోల్ కతా, నోయిడా అనే నాలుగు ప్రదేశాలలో మాత్రమే ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి.

34
నోట్లను ఎక్కడ ముద్రిస్తారు?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతున్న ప్రకారం భారతదేశంలో నోట్లను దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న నాలుగు కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ లలో ముద్రిస్తారు. మహారాష్ట్రలోని నాసిక్, మధ్యప్రదేశ్ లోని దేవాస్, కర్ణాటకలోని మైసూరు, పశ్చిమబెంగాల్ లోని సల్బోని నగరాల్లో ఉన్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ కు చెందిన సంస్థలే నిర్వహిస్తాయి.

44
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయమే

కరెన్సీ నోట్లు ముద్రించే అధికారం కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉంటుంది. ఆర్బిఐ సిఫార్సులు ఆధారంగానే నోట్ల డిజైన్, పరిమాణం, మెటీరియల్ వంటివి నిర్ణయిస్తారు. దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తుంది. ప్రతి ఏడాది ఆర్బిఐ అవసరమైన నోట్ల సంఖ్యను అంచనా వేసి ప్రింటింగ్ ప్రెస్ లకు ఆర్డర్లు పంపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories