Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?

Published : Sep 22, 2026, 10:29 AM IST

Indian Food: ఇప్పుడంటే మనకు ఎన్నో రకాల ప్యాకేజ్డ్ ఫుడ్ రెడీగా ఉంటోంది. ఏది కావాలన్నా తెచ్చి నిమిషాల్లో వండేసుకుని తినేయవచ్చు. మరి 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం తినేవారు? ఎలాంటి ఆహారం బయట కొనుక్కునేవారు?

PREV
13
డాల్డానే వాడేవారు

ఇప్పుడు మనకు నిమిషాల్లో తయారయ్యే నూడుల్స్, రకరకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆకలేస్తే చకచకా వండేసుకుని తినవచ్చు. కానీ 1960లలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ కాలంలో మార్కెట్లలో సూపర్ మార్కెట్లు, రెడీమేడ్ ఆహారాలు లేకపోయినా, ప్యాక్డ్ ఉత్పత్తులు నగరాల్లో నెమ్మదిగా పాకడం మొదవలైంది. దేశీ నెయ్యి ధరలు ఎక్కువగా ఉండడంతో ‘డాల్డా’ (వనస్పతి) ప్రతి ఇంట్లో నిత్యావసరంగా మారింది. నెయ్యి స్థానాన్ని భర్తీ చేస్తూ డాల్డా చిన్న, పెద్ద టిన్లలో లభించేది. అలాగే ప్రస్తుత అమూల్ సంస్థ పాపులర్ కావడానికి ముందు ‘పోల్సన్ బటర్’ భారతీయ కుటుంబాల్లో విపరీతమైన ఆదరణ పొందింది. అప్పట్లో వెన్న అంటే కేవలం పోల్సన్ మాత్రమే గుర్తొచ్చేంతగా అది పాపులర్.

23
గ్లూకోజ్ బిస్కెట్లు

ప్యాక్డ్ ఆహారాలలో సామాన్యుడికి త్వరగా చేరువైనది గ్లూకోజ్ బిస్కెట్. పార్లే, బ్రిటానియా సంస్థలు అందించిన ఈ బిస్కెట్లు తక్కువ ధరకే పోషకాహారంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. 1960లో బ్రిటానియా ‘గ్లూకోజ్ డి’ మార్కెట్లోకి రావడంతో ఇది మరింత పాపులర్ అయింది. బడికి వెళ్లే పిల్లల బాక్సుల్లో స్నాక్స్‌గా, రైలు ప్రయాణాలలో ఆకలి తీర్చే నేస్తంగా, ఇంటికి వచ్చే అతిథులకు చాయ్‌తో అందించే చిరుతిండిగా గ్లూకోజ్ బిస్కెట్ ప్యాకెట్ నిలిచింది. ఎలాంటి హంగులు లేకుండా విశ్వసనీయమైన ప్యాక్డ్ ఫుడ్‌గా ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

33
పాలపొడి, బేబీ ఫుడ్

1960ల నాటి మరో ముఖ్యమైన మార్పు భారతదేశపు ప్రాసెస్డ్ పాల ఉత్పత్తుల రంగంలో చోటుచేసుకుంది. అమూల్ వంటి సహకార సంస్థలు గేదె పాలతో భారీ ఎత్తున బేబీ మిల్క్ పౌడర్, చీజ్ తయారీని ప్రారంభించాయి. ఆ కాలంలో ఇది ఆహార పరిశ్రమలో ఒక విప్లవాత్మక అడుగు. అంతకుముందు ఇళ్లకే పరిమితమైన తాజా పాల వాడకం నుంచి నిల్వ ఉండే పాలపొడి, బేబీ ఫుడ్ వైపు సమాజం అడుగులు వేయడం మొదలైంది. నేటి యువతకు ఇవన్నీ సాధారణంగా అనిపించినా, 1960లలో ఈ ఉత్పత్తులే ఆధునిక భారతీయ ఆహారపు అలవాట్లకు బలమైన పునాదులు వేశాయి.

Read more Photos on
click me!

Recommended Stories