Konaseema: కేరళ కాదు గురూ.. మన ఏపీలోని ఈ రివర్ ప్యారడైజ్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది !

Published : Aug 12, 2026, 02:22 PM IST

Dindi Backwaters Konaseema: ఆంధ్రప్రదేశ్ లో బ్లూ వాటర్, బ్యాక్‌వాటర్స్, దీవులు, అద్భుతమైన ఐలాండ్ వైబ్స్ ఇచ్చే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రాచుర్యం పొందిన కోనసీమ బ్యాక్‌వాటర్స్, విజయవాడ భవానీ ఐలాండ్ల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ఇన్స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న ఈ హిడెన్ లొకేషన్ ఎక్కడుందో తెలుసా?

ప్రతిసారీ వీకెండ్‌ వస్తే చాలు.. రొటీన్ మాల్స్, సినిమా థియేటర్లు, ట్రాఫిక్ గొడవలతో చిరాకు వస్తోందా? కొద్దిరోజులు ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ డెడ్‌లైన్స్‌ పక్కనపెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో ఫ్రెష్ ఎయిర్ పీల్చాలని ఉందా? అయితే వేల రూపాయలు ఖర్చు పెట్టి కేరళ కోవలం లేదా విదేశాల్లోని మాల్దీవ్స్‌ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ గుండెకాయ లాంటి దిండిబ్యాక్‌వాటర్స్, అలాగే విజయవాడలోని 'భవానీ ఐలాండ్' సందర్శిస్తే చాలు.. మీకు కచ్చితంగా విదేశీ రిజార్టులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ కొబ్బరితోటలు, పచ్చని కొండలు, నీటిపై తేలియాడే హౌస్‌బోట్లు.. ఒకే ఒక్క ట్రిప్‌తో మీ వారమంతా ఉన్న స్ట్రెస్ దూదిపింజలా ఎగిరిపోతుంది.

26
గోదావరి అలలపై హౌస్‌బోట్.. నెక్స్ట్ లెవెల్ లగ్జరీ వైబ్

కోనసీమ ప్రాంతంలోని దిండి వద్ద రాజమండ్రి/అమలాపురం పరిసరాల్లో ప్రవహించే గోదావరి పాయలు, నీలిరంగు బ్యాక్‌వాటర్స్ అచ్చం కేరళ ఆలేప్పి తరహాలోనే ఉంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ప్రైవేట్ రిసార్టులు నడిపే హౌస్‌బోట్ ప్రయాణం ఈ ట్రిప్‌ సూపర్ ఉంటుంది. గంటల తరబడి నీటిపై ప్రయాణిస్తూ, ఏకాంతంగా డెక్ మీద కూర్చుని చల్లటి గాలిని ఆస్వాదిస్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. బోట్‌లోనే ఏపీ స్పెషల్ ఘుమఘుమలాడే వెజ్ అండ్ నాన్ వెజ్ భోజనం ఆస్వాదించవచ్చు. ఫ్యామిలీతో లేదా లైఫ్‌పార్ట్‌నర్‌తో కలిసి నైట్ స్టే చేయడానికి కూడా ఈ హౌస్‌బోట్‌లు అందుబాటులో ఉంటాయి.

36
భవానీ ఐలాండ్.. కృష్ణానది మధ్యలో 133 ఎకరాల వండర్

ఒకవేళ మీరు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే, ప్రకాశం బ్యారేజీ బ్యాక్‌వాటర్స్‌లోని భవానీ ఐలాండ్ మీకు రివర్ ఐలాండ్ అనుభూతిని ఇస్తుంది. భారతదేశంలోనే అతిపెద్ద నదీ ద్వీపాల్లో ఒకటైన ఈ ఐలాండ్‌కు వెళ్లాలంటే పున్నమి ఘాట్ నుంచి 6 నిమిషాల బోట్ జర్నీ చేయాలి. కృష్ణానది నీటి నడుమ పచ్చని చెట్లు, మడ అడవుల మధ్య ఉండే ఈ ద్వీపం ఒక మినీ వాటర్ పార్క్‌లా ఉంటుంది. కుటుంబంతో కలిసి వీకెండ్ స్పెండ్ చేయడానికి రిసార్టులు, సైక్లింగ్ ట్రాక్‌లు, రివర్ వాటర్ స్పోర్ట్స్, కయాకింగ్ వంటి అనేక అడ్వెంచర్ రిక్రియేషన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

46
వాటర్ స్పోర్ట్స్, ఫొటోగ్రఫీ ప్యారడైజ్

ఈ ప్రదేశాలు కేవలం ప్రశాంతతకే కాదు.. అడ్వెంచర్ అండ్ ఫోటోగ్రఫీ ప్రేమికులకు కేరాఫ్ అడ్రస్. జెట్ స్కీ, స్పీడ్ బోటింగ్, బనానా రైడ్స్ వంటి వాటర్ గేమ్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఇక ఇన్స్టాగ్రామ్ లవర్స్, రీల్స్ మేకర్స్‌కి ఇక్కడి సన్‌సెట్ వ్యూస్ ఒక వరమనే చెప్పాలి. సూర్యుడు అస్తమించే వేళ నీటిపై పడే నారింజ, బంగారు వర్ణపు ఛాయలు ఫోటోల్లో అద్భుతంగా వస్తాయి.

56
సీఫుడ్ లవర్స్ డ్రీమ్ డెస్టినేషన్

ట్రిప్‌కి వెళ్లి మంచి తిండి తినకపోతే ఆ ట్రిప్‌కి అర్థమే లేదు. కోనసీమ దిండి, రాజమండ్రి పరిసరాల్లో లభించే తాజా సీఫుడ్, రొయ్యల పులుసు, పీతల కూర, ప్రసిద్ధమైన పులస చేపల సాలు ప్రతీ ఒక్కరూ ట్రై చేయాల్సిందే. నోరూరించే గోదావరి రుచులతో పాటు ఇక్కడి కొబ్బరి బొండాల నీళ్లు తాగితే ఆ రోజంతా రీఛార్జ్ అయినట్లే.

66
ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలి?

దిండి: రాజమండ్రి లేదా కాకినాడ నుంచి 2 గంటల వ్యవధిలో చేరుకోవచ్చు. హైదరాబాద్ లేదా విజయవాడ నుంచి నేరుగా ట్రైన్ లేదా రోడ్డు మార్గంలో రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి దిండి చేరుకోవచ్చు.

భవానీ ఐలాండ్ : విజయవాడ బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుంచి 10-15 నిమిషాల్లో పున్నమి ఘాట్ చేరుకుని అక్కడి నుంచి పడవలో వెళ్ళవచ్చు.

బెస్ట్ టైమింగ్స్: అక్టోబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతాలను సందర్శించడానికి వాతావరణం చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది.

ఒకే ఒక్క వీకెండ్‌లో ప్రకృతి అందాలు, తేలియాడే పడవలు, మైండ్ బ్లోయింగ్ వాటర్ గేమ్స్, అదిరిపోయే కోనసీమ రుచులు ప్యాక్ అయి ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories