ప్రతి ఇంట్లోనూ ఉండే ఎలక్ట్రానిక్ వస్తువులు టీవీ, ఏసీలు. ఇవి రెండూ రిమోట్లతోనే పనిచేస్తాయి. అందులో ఏసీ రిమోట్ చూడండి తెల్లగా ఉంటుంది. ఇక టీవీ రిమోట్ నల్లగా ఉంటుంది. ఇలాంటి డిజైన్ వెనుక ఓ కారణం ఉంటుంది. వాటి ఆకారం, రంగు.. ఇలా ప్రతీది ఓ లెక్క ప్రకారమే డిజైనింగ్ జరుగుతుంది.
ఏసీ యూనిట్లన్నీ తెల్లగానే ఉంటాయి. ఏసీకి మ్యాచ్ అయ్యేలా ఉండేందుకే రిమోట్‌ను కూడా అదే రంగులో డిజైన్ చేస్తారు. దీనివల్ల మొత్తం ప్రొడక్ట్ ఒకే స్టైల్‌లో కనిపిస్తుంది. ఇది ఇంటి ఇంటీరియర్ డిజైన్‌కు కూడా బాగా సెట్ అవుతుంది. బెడ్‌రూమ్‌లు, ఆఫీసుల్లో లేత రంగులు ప్రశాంతతను ఇస్తాయని డిజైనర్లు నమ్ముతారు.
ఏసీ రిమోట్ తెల్లగా ఉండేందుకు ముఖ్యమైన కారణం వేడి. తెలుపు రంగు వేడిని తక్కువగా గ్రహిస్తుంది. నలుపు రంగు వేడిని ఎక్కువగా పీల్చుకుంటుంది. ఏసీ రిమోట్‌ను ఎక్కువసేపు గదిలో, కిటికీ దగ్గర లేదా ఎక్కువ కాంతి ఉన్న చోట ఉంచినా, తెలుపు రంగు వల్ల అది అంతగా వేడెక్కదు.