America: అమెరికాలో నర్సరీ స్కూలు ఫీజు ఎంతో తెలుసా? ఆ ఫీజుతో రెండు కార్లు కొనేయచ్చు

Published : Aug 12, 2026, 10:56 AM IST

America: అమెరికాలో పిల్లల చదువులు మరీ కాస్ట్లీ అయిపోయాయి. అక్కడ ఉండే ఇండియన్స్ కు ఆ స్కూట్ ఫీజులు కట్టడం కొంచెం కష్టమనే చెప్పుకోవాలి. కేవలం అమెరికాలో నర్సరీ ఫీజు తెలిస్తేనే వామ్మో అంటారు. ఆ ఫీజుతో ఇండియాలో రెండు కార్లు కొనుక్కోవచ్చు.

PREV
13
అమెరికాలో నర్సరీ స్కూలు ఫీజు ఎంత?

అమెరికా అంటే ఎంతోమంది కల. అక్కడకు జీవితాన్ని ఎంజాయ్ చేయాలని, బాగా సంపాదించుకోవాలని అనుకుంటారు. అయితే అక్కడ సంపాదన ఎక్కువగా ఉన్నట్టే ఖర్చులు కూడా అధికమే. సోనాల్ చౌదరి అనే మహిళ తన కూతురిని నర్సరీలో వేసేందుకు తీసుకెళ్లింది. అక్కడ ఫీజు చూసి షాక్ అయిపోయింది.ఆ వివరాలను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

23
స్కూల్ అదిరిపోతుంది

ఇండియాలో ఉన్నట్టు 20, 30 మంది పిల్లలకు ఒక టీచర్ కాకుండా.. అక్కడ ప్రతి 8 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉంటారు. పాటలు, ఆటలు, యోగా, డ్రాయింగ్ వంటి కార్యకలాపాలతో పిల్లలకు విసుగు రాకుండా చూసుకుంటారు. ఈ ప్రీస్కూల్ రోజుకు కేవలం మూడు గంటలు మాత్రమే నడుస్తుంది. వారానికి పిల్లలను ఎన్ని రోజులు పంపిస్తారు అనే దానిపై ఆధారపడి ఫీజును లెక్కిస్తారు.

33
వారానికి 5 రోజులు పంపిస్తే..

పిల్లలను వారానికి అయిదు రోజుల పాటూ నర్సరీ స్కూలుకు పంపిస్తే ఏడాదికి సుమారు 9.3 లక్షల రూపాయలు చెల్లించాలి. అంటే మనదేశంలో ఆల్టో వంటి చిన్న కారులు ఈ ధరకు రెండు కొనేసుకోవచ్చు. అలా కాకుండా మూడు రోజులే స్కూలుకు పంపిస్తే ఆ ధర సగానికి తగ్గుతుంది. కానీ వారానికి అయిదు రోజులు పంపిస్తేనే పిల్లలక ఉపయోగకరంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories