బిజీగా లేనప్పుడు ఉదయాన్నే స్వయంగా టీ, పోహా చేసుకునేవాడినని ప్రధాని మోదీ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. వాటితో పాటు కిచిడీ కూడా వండుకుని తినేవారట. కిచిడీ సులభంగా, పోషకాలతో ఉండటం, జీర్ణక్రియకు మంచిది కావడంతో ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయంలో తన సహోద్యోగులకు కూడా వండి పెట్టేవారట. అతని వంట తిన్నవారు ఇప్పటికీ దాని రుచిని మర్చిపోలేరు.
ప్రధాని మోదీకి సగ్గుబియ్యం కిచిడీ ఎలా వండాలో కూడా వచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో, ఆయన ఒక మహిళకు దాన్ని తయారుచేసే విధానం మొత్తం వివరించారు. మోదీకి అత్యంత ఇష్టమైన వంటకం మునగాకు పరాఠాను వారంలో 2-3 సార్లు తింటారట.