ISRO: ఇస్రోలో అసలేం జరుగుతోంది? 100మంది శాస్త్రవేత్తలు ఉద్యోగాలకు ఎందుకు రాజీనామా చేశారు?

Published : Jul 17, 2026, 02:17 PM IST

ISRO: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) నుంచి వరుసగా శాస్త్రవేత్తలు రాజీనామాలు చేస్తున్నారు. ఇలా అయితే గగన్ యాన్ వంటి ప్రాజెక్టులు ఏమవుతాయి? శాస్త్రవేత్తల రాజీనామాలకు నియంత్రించేందుకు కేంద్రం ఏం చేయబోతోంది?

PREV
14
శాస్త్రవేత్తల రాజీనామా

గత కొంత కాలంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నుంచి వంద మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు రాజీనామా చేశారు. కొంతమంది స్వచ్ఛంద పదవీ విరమణ (VRS) తీసుకుని వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుండి 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి 20 మందికి పైగా కీలక శాస్త్రవేత్తలు బయటకు వెళ్లినట్లు సమాచారం. గగన్‌యాన్ వంటి పెద్ద ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారు కూడా వెళ్లిపోతుండడంతో ఇప్పుడిది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

24
జీతాలకు ఆశపడే వెళుతున్నారా?

భారతదేశంలో ప్రైవేట్ స్పేస్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రైవేటు సంస్థల్లో లభిస్తున్న భారీ వేతనాలకు ఆశపడే చాలామంది శాస్త్రవేత్తలు ఇస్రోను వీడుతున్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన వారిలో ఎల్వీఎం-3 ప్రాజెక్ట్ డైరెక్టర్, చంద్రయాన్-3 సిమ్యులేషన్స్ టీమ్ మేనేజర్ వంటి ఎంతో మంది సీనియర్లు కూడా ఉన్నారు. ఇలాంటి నిపుణులు ఇలా ఒక్కసారిగా సంస్థను వదిలి వెళితే గగన్ యాన్ వంటి కీలక ప్రాజెక్టులు ఏమవుతాయో అన్న కలవరం మొదలైంది. ఇదే ఆలోచనతో ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు చేపట్టింది.

34
ఇకపై అంత ఈజీ కాదు

కేంద్ర అంతరిక్ష శాఖ జూలై 14, 2026న ఒక కీలక ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటివరకు ఇస్రోలోని స్థానిక కేంద్రాల డైరెక్టర్లకు ఉన్న ఒక అధికారాన్ని వెనక్కి తీసుకుంది. ఆ అధికారం ఏమిటో తెలుసా? ఆ కేంద్రంలోని ఏ శాస్త్రవేత్త అయినా రాజీనామా చేస్తే దాన్ని ఆమోదించే అధికారం ఇకపై వారికి ఉండదు. ఇకపై గగన్‌యాన్ వంటి ముఖ్యమైన ప్రాజెక్టుల్లో పనిచేసే 'గ్రూప్ ఏ' శాస్త్రవేత్తలు రాజీనామా చేయాలన్నా లేదా స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలన్నా నేరుగా కేంద్ర అంతరిక్ష శాఖ నుంచే పర్మిషన్ తీసుకోవాలి.

44
ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

రాజీనామాలపై ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ మాట్లాడుతూ ఉద్యోగులు సంస్థను వీడటం అనేది ప్రతి సంస్థలోనూ జరుగుతాయని, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఏదేమైనా దేశ భద్రత, భారీ అంతరిక్ష ప్రయోగాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడటమే తమ లక్ష్యమని అన్నారు నారాయణన్. రాజీనామా చేసిన వారి బాధ్యతలను వెంటనే మరొకరికి అప్పగిస్తూ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని కూడా ఆయన చెప్పారు.

Read more Photos on
click me!

Recommended Stories