Can Dogs See Every Colors : కుక్కలు కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూస్తాయనుకుంటే పొరపాటే. సైన్స్ ప్రకారం అవి చూసే అసలైన రంగులు, వాటి కలర్ విజన్ సీక్రెట్స్ ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
కుక్కల ప్రపంచం బ్లాక్ అండ్ వైట్ కాదు బాసూ.. అవి చూసే అసలైన రంగులేంటో తెలుసా?
మనం ఇంట్లో పెంచుకునే పెంపుడు జంతువుల్లో కుక్కల ప్లేసే వేరు. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోతాయి. మనం చూపించే ప్రేమకు వంద రెట్లు విశ్వాసాన్ని తిరిగి ఇస్తాయి. అయితే, రోజంతా మనతోనే గడిపే మన కుక్కల గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి.
అందులో ముఖ్యమైనది వాటి చూపు. సాధారణంగా మనందరం ఉదయం లేచింది మొదలు రంగురంగుల ప్రపంచాన్ని చూస్తాం. నీలి రంగు ఆకాశం, ఎర్రటి సూర్యుడు, పచ్చటి చెట్లు.. ఇలా ఎన్నో కలర్స్ ఎంజాయ్ చేస్తాం. కానీ, మన పక్కనే ఉండే కుక్కలు కూడా ఈ ప్రపంచాన్ని మనలాగే చూస్తాయా? అవి కేవలం బ్లాక్ అండ్ వైట్ మాత్రమే చూడగలవని చాలామంది అనుకుంటారు. కానీ అందులో నిజం ఎంత? సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
26
అపోహలు వద్దు.. కుక్కల చూపు బ్లాక్ అండ్ వైట్ కానే కాదు
చాలా కాలంగా జనాలు కుక్కలకు కేవలం నలుపు, తెలుపు రంగులు మాత్రమే కనిపిస్తాయని అనుకుంటున్నారు. కానీ ఈ జనరేషన్ సైన్స్ ఆ అపోహలను పూర్తిగా కొట్టేసింది. కుక్కల ప్రపంచం కేవలం బ్లాక్ అండ్ వైట్ కాదు. అవి కూడా రంగులను చూడగలవు, కానీ మనలా అన్ని రంగులను స్పష్టంగా ఐడెంటిఫై చేయలేవు. వాటి కలర్ విజన్ మనకంటే కొంచెం భిన్నంగా ఉంటుంది.
36
సైన్స్ ఏం చెబుతోంది? ‘డైక్రోమాట్స్’ అంటే ఏంటి?
మనుషుల కళ్లలో రంగులను గుర్తించడానికి కోన్స్ అనే ప్రత్యేక కణాలు ఉంటాయి. మన కళ్లలో మూడు రకాల కోన్ కణాలు ఉండటం వల్ల మనం ఎరుపు, ఆకుపచ్చ, నీలం, పసుపు ఇలా ఇంద్రధనస్సులోని అన్ని రంగులను స్పష్టంగా చూడగలుగుతాం. కానీ, కుక్కల విషయానికి వస్తే, వాటి కళ్లలో కేవలం రెండు రకాల కోన్ కణాలు మాత్రమే ఉంటాయి. అందుకే సైన్స్ భాషలో కుక్కలను డైక్రోమాట్స్ అని పిలుస్తారు. దీనివల్ల అవి చాలా పరిమితమైన రంగులను మాత్రమే చూడగలవు.
కుక్కల కళ్లలో ఉండే రెండు రకాల కోన్ కణాలు కేవలం నీలం, పసుపు రంగులను మాత్రమే పసిగట్టగలవు. అందుకే కుక్కల ప్రపంచంలో నీలం, పసుపు అనేవి అత్యంత ప్రకాశవంతమైన, స్పష్టమైన రంగులు. వీటికి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ రంగుల మధ్య తేడాలను గుర్తించడం చాలా కష్టం. అందుకే మార్కెట్‌లో లభించే కుక్కల ఆట వస్తువులు, బెల్టులు, ఇతర పరికరాలను ఎక్కువగా బ్లూ అండ్ ఎల్లో కలర్స్‌లోనే డిజైన్ చేస్తుంటారు. ఎందుకంటే ఆ రంగుల వైపు అవి త్వరగా ఆకర్షితులవుతాయి.
56
వాసనతోనే అసలైన ఆట.. చీకటిలోనూ ఫాస్ట్
రంగులను గుర్తించడంలో కుక్కలు మనకంటే వెనుకబడి ఉండవచ్చు, కానీ వాటికి దేవుడు ఇచ్చిన మరో సూపర్ పవర్ ఉంది. అదే వాటి వాసన చూసే సామర్థ్యం. ఏవైనా వస్తువులు లేదా వ్యక్తుల మధ్య తేడాలను గుర్తించడానికి కుక్కలు వాటి ముక్కునే ఎక్కువగా నమ్ముకుంటాయి. దీనితో పాటు, చీకటిలో చాలా వేగంగా జరిగే కదలికలను కూడా అవి ఈజీగా పసిగట్టగలవు. కంటి చూపుతో సంబంధం లేకుండా కేవలం వాసన, వినికిడి శక్తితోనే అవి ప్రపంచాన్ని శాసిస్తాయి.
66
మీ ఇంట్లోని పెట్‌తో ఇలా ట్రై చేయండి
కుక్కల రంగుల ప్రపంచంపై మీకు ఇంకా డౌట్ ఉంటే.. మీ ఇంట్లో ఉన్న పెట్ డాగ్ ముందర రకరకాల కలర్స్‌లో ఉండే ఆట వస్తువులను, విభిన్న ఆకృతుల్లో ఉండే పరికరాలను ఉంచి ఒక్కసారి అబ్సర్వ్ చేయండి. అవి ఏ రంగు వస్తువును త్వరగా పిక్ చేసుకుంటున్నాయి? దూరంగా ఉన్న వస్తువులను, వాటి షేప్స్‌ను ఎలా ఐడెంటిఫై చేస్తున్నాయో గమనిస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది.