Shankh Mitra: ప్రపంచంలో అత్యధిక శాలరీ అందుకుంటున్న సీఈవోలలో భారతీయుడు కూడా చేరుకున్నారు. అతని పేరు శంఖ్ మిత్రా. ఎలన్ మస్క్ తో పోటీపడేలా శాలరీ ప్యాకేజీ అందుకుంటున్నారు. అతనెవరో తెలుసుకోండి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు శంఖ్ మిత్రా పేరు మారుమోగిపోతోంది. అత్యధిక వేతనం పొందే కార్పొరేట్ నాయకుల జాబితాలో ఈయన కూడా ఒకరు. అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ, సీనియర్ హౌసింగ్ రియల్ ఎస్టేట్ సంస్థ వెల్‌టవర్ (Welltower) సీఈవోగా ఉన్న ఆయనకు 821 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,700 కోట్లకు పైగా) విలువైన వేతన ప్యాకేజీ లభించినట్లు అంతర్జాతీయ మీడియాలు చెబుతాయి. ఈ భారీ ప్యాకేజీ కారణంగా ప్రపంచంలో అత్యధిక వేతనం పొందుతున్న సీఈవోలలో శంఖ్ మిత్రా ఒకరిగా నిలిచారు. భారత మూలాలు కలిగిన వ్యక్తి ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది.
24
ఈయన స్పెషాలిటీ ఏమిటి?
శంఖ్ మిత్రా వ్యాపారంలో ఎంతో అనుభవం కలిగిన వ్యక్తి. వెల్‌టవర్ సంస్థకు నాయకత్వం వహిస్తున్న ఆయన కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. వృద్ధుల కోసం నివాస సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల నిర్వహణలో వెల్‌టవర్ ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. శంఖ్ మిత్రా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంస్థ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థను లాభాల బాట పట్టించేందుకు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు.
34
జీతం ఏ రూపంలో ఇస్తారు?
ఆయనకు 821 మిలియన్ డాలర్ల ప్యాకేజీ మొత్తం నగదు రూపంలో కాదు. ఇందులో ఎక్కువ భాగం కంపెనీ షేర్లు, స్టాక్ అవార్డులు, దీర్ఘకాలిక ప్రోత్సాహక పథకాల రూపంలో అందిస్తారు. కంపెనీ భవిష్యత్తులో నిర్దేశించిన పనితీరు లక్ష్యాలను చేరుకుంటేనే ఈ ప్రయోజనాలన్నీ దక్కుతాయి. అంటే కంపెనీ విజయవంతంగా ముందుకు సాగితేనే శంఖ్ మిత్రా కూడా ఈ భారీ మొత్తాన్ని పూర్తిగా పొందగలరు. ఇటువంటి విధానం ద్వారా సంస్థ అభివృద్ధి, సీఈవో పనితీరు రెండూ ఒకే దిశలో కొనసాగేలా కంపెనీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.
శంఖ్ మిత్రా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతాలో జన్మించారు. కోల్ కతాలోని జాదవ్ పూర్ యూనివర్సిటీ లోనే బీటెక్ పూర్తి చేశారు. తరువాత ఎంబీఏ చేయడం కోసం కొలంబియా బిజినెస్ స్కూల్ కి వెళ్లారు. ఇక అక్కడే సెటిలైపోయారు. ఇప్పుడు ఏకంగా ఎలన్ మస్క్ కే పోటీ ఇచ్చేలా సంపాదించడం మొదలుపెట్టారు.