Snake Bite Cure: ఒంటె కన్నీళ్లలోని ప్రత్యేక నానోబాడీలు అత్యంత ప్రమాదకరమైన పాము విషాన్ని క్షణాల్లో నిర్వీర్యం చేస్తాయని దుబాయ్, భారత శాస్త్రవేత్తల ఉమ్మడి పరిశోధనల్లో తేలింది. ఈ ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ప్రపంచంలో సైన్స్ రోజుకో కొత్త అద్భుతాన్ని మన ముందుకు తెస్తోంది. సాధారణంగా మనం ఒంటెలను ఎడారి ఓడలు అంటాం, వాటి పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివని కూడా తెలుసు. కానీ, ఇప్పుడు ఒంటెల కన్నీళ్లు ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పాము కాట్లకు సంజీవనిగా మారబోతున్నాయనే క్రేజీ అప్‌డేట్ ఒకటి బయటకొచ్చింది.
అవును, మీరు విన్నది నిజమే.. ఒంటె ఏడ్చినా కూడా ఆ కన్నీళ్లతో మనుషుల ప్రాణాలు కాపాడవచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. నాగుపాము, కట్లపాము లాంటి డేంజరస్ స్నేక్స్ కాటేసినా సరే, ఒంటె కన్నీళ్లలో ఉండే ప్రత్యేక గుణాలు ఆ విషాన్ని చిటికెలో న్యూట్రలైజ్ చేస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
25
దుబాయ్, ఇండియన్ సైంటిస్టుల జాయింట్ రీసెర్చ్
దుబాయ్‌కు చెందిన ‘సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ లాబొరేటరీ’ (CVRL), భారత్‌లోని బికనీర్‌లో ఉన్న ‘నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ క్యామెల్స్’ (NRCC) శాస్త్రవేత్తలు కలిసి చేసిన జాయింట్ రీసెర్చ్‌లో ఈ సీక్రెట్ రివీల్ అయింది.
అత్యంత విషపూరితమైన 'సా-స్కేల్డ్ వైపర్' పాము విషాన్ని కొద్ది మోతాదులో ఒంటెలకు ఎక్కించారు. దీనివల్ల ఆ ఒంటెల శరీరంలో అద్భుతమైన ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అయింది. ఆ తర్వాత వాటి రక్తం, కన్నీళ్ల శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌లో టెస్ట్ చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
35
అసలు ఈ కన్నీళ్లలో ఏముంది?
సాధారణంగా పాము విషం శరీరంలోకి వెళ్తే రక్తం గడ్డకట్టడం, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడం, నరాలు పనిచేయకపోవడం లాంటివి జరిగి మనుషులు చనిపోతారు. అయితే, ఒంటె కన్నీళ్లలో ‘నానోబాడీలు’ అని పిలిచే చాలా చిన్న సైజు యాంటీబాడీలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
ఇవి మామూలు యాంటీబాడీల కంటే చాలా చిన్నవిగా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇవి పాము విషంలోని టాక్సిన్స్‌ను ఈజీగా టార్గెట్ చేసి, వాటిని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. కేవలం ఒక్క చుక్క ఒంటె కన్నీటితో నాగుపాములు, వైపర్లతో సహా దాదాపు 26 రకాల పాముల విషాన్ని విరిచేయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం వాడుతున్న పాముకాటు మందులను గుర్రాలు లేదా గొర్రెల రక్తం నుంచి తయారు చేస్తారు. ఇవి చాలా ఖరీదైనవి, పైగా కొందరిలో అలర్జీలు కలిగిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా వీటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే ఉంచాలి.
కానీ, ఒంటె నానోబాడీలకు వేడిని తట్టుకునే శక్తి ఎక్కువ. వీటికి కోల్డ్ స్టోరేజ్ అవసరం లేదు. అందువల్ల, ఫ్రిజ్ సౌకర్యం లేని మన దేశంలోని మారుమూల గ్రామాలకు ఈ మందు ఒక పెద్ద వరంగా మారనుంది. పైగా ఇది చాలా చవకగా లభిస్తుంది.
55
ప్రాథమిక దశలోనే పరిశోధనలు
అయితే, ఈ రీసెర్చ్ ఇంకా ల్యాబ్ లెవెల్ లోనే ఉంది. ఎవరైనా పాము కాటుకు గురైతే వెంటనే ఒంటె కన్నీళ్లను తెచ్చి కళ్లలో వేయడం లేదా డైరెక్ట్‌గా తాగించడం లాంటివి చేయకూడదు. ఈ కన్నీళ్ల నుంచి ల్యాబొరేటరీలలో నానోబాడీలను సపరేట్ చేసి, ప్రాసెస్ చేసిన తర్వాతే మందుగా మారుస్తారు. ఇది పూర్తిగా సక్సెస్ అయి మార్కెట్లోకి వస్తే.. రాజస్థాన్, గుజరాత్ లాంటి ప్రాంతాల్లో ఒంటెలను పెంచే రైతులకు కూడా ఇదో అదనపు ఆదాయ వనరుగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.