గోడల నుంచి రక్తం.. రాత్రివేళ వింత అరుపులు, భారత్‌లోని ఈ కోట వెనుక భయంకర రహస్యం

Published : Nov 08, 2026, 09:23 AM IST

మనదేశంలో ఎన్నో చారిత్రక కట్టడాలు,కోటలు ఉన్నాయి. వాటిలో కొన్నింటి వెనుక మాత్రం చీకటి రహస్యాలు దాగి ఉన్నాయి. భారత్లోని ఒక కోట గోడల నుంచి ఎర్రని స్రావాలు వస్తున్నట్టు స్థానికులు చెబుతారు. ఆ కోట దగ్గరికి వెళ్లడానికే భయపడతారు.

PREV
13
కోట గోడల నుంచి ఎర్రటి స్రావాలు

భారత్‌లో ఎన్నో పురాతన కోటలు ఉన్నాయి. వాటిలో కొన్ని చారిత్రక కట్టడాలుగా గుర్తింపు పొందితే, మరికొన్ని వింత కథలతో వార్తల్లో నిలుస్తుంటాయి. అలాంటి ఓ రహస్య కోట గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోట గోడల నుంచి రక్తం కారుతుందని, రాత్రి వేళల్లో వింత అరుపులు వినిపిస్తాయని స్థానికంగా ప్రచారం ఉంది. ఈ మాటలు విన్నవారికి అక్కడికి వెళ్లాలంటేనే భయం కలుగుతుంది. చీకటి పడిన తర్వాత కోట పరిసరాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని కొందరు చెబుతుంటారు. ఆ కోట పేరు నహర్ గఢ్ కోట. ఇది రాజస్థాన్లో ఉంది.

23
నహర్ అనే ఆత్మ

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న నహర్‌గఢ్ కోటకు దాదాపు 300 ఏళ్ల చరిత్ర ఉంది. 1734లో మహారాజా సవాయ్ జైసింగ్ II ఈ కోటను నిర్మించారు. మొదట దీనికి సుదర్శన్‌గఢ్ అని పేరు పెట్టారు. కోట నిర్మాణ సమయంలో గోడలు కూలిపోవడం, పనివారికి ప్రమాదాలు జరగడం లాంటి సమస్యలు ఎదురయ్యాయని కథలు ఉన్నాయి. నహర్ అనే ఆత్మ వల్లే ఇలా జరుగుతోందని అప్పట్లో ప్రజలు నమ్మేవారట. ఆ ఆత్మను శాంతింపజేయడానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత కోటకు నహర్‌గఢ్ అని పేరు పెట్టినట్లు స్థానిక కథనం చెబుతోంది.

33
కోట నుంచి అరుపులు, ఏడుపులు

ఈ కోట గురించి మరో ఆసక్తికరమైన విషయం రాత్రివేళ వినిపించే వింత శబ్దాలు. కోట గోడల దగ్గర నుంచి అరుపులు, ఏడుపులు వినిపిస్తాయని కొందరు చెబుతుంటారు. మరికొందరు అక్కడ నీడలు కదులుతున్నట్లు కనిపించాయని అంటుంటారు. గోడల నుంచి రక్తం కారుతుందనే ప్రచారం కూడా ఈ కోటకు భయంకరమైన పేరును తెచ్చింది. అయితే ఈ వాదనలకు ఇప్పటివరకు సరైన ఆధారాలు లేవు. గాలి శబ్దాలు, కోట నిర్మాణం వల్ల కలిగే ప్రతిధ్వనులు కూడా రాత్రివేళ వింత శబ్దాలుగా అనిపించవచ్చని కొందరు భావిస్తున్నారు. నహర్‌గఢ్ కోట చుట్టూ ఇలాంటి భయపెట్టే కథలు ఉన్నప్పటికీ, చరిత్ర, నిర్మాణ శైలి, ప్రకృతి అందాల కోసం పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. అరవళ్లి కొండలపై ఉన్న ఈ కోట నుంచి జైపూర్ నగరం అందంగా కనిపిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories