5 Most Important Oil Routes: ప్రపంచ చమురు మార్కెట్‌ను కంట్రోల్ చేసే 5 రహస్య సముద్ర మార్గాలు ఇవే

Published : Nov 24, 2026, 08:07 AM IST

5 Most Important Oil Routes: ప్రపంచాన్ని నడిపించడంలో ఐదు సముద్ర మార్గాలు ఎంతో కీలకంగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా జరిగే 5 అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాల వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
ప్రపంచాన్ని శాసించే 5 ఆయిల్ రూట్స్ ఇవే

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ కోట్లాది బ్యారెళ్ల ముడి చమురు ఒక దేశం నుండి మరో దేశానికి ఎలా చేరుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగాలన్నా, తగ్గాలన్నా సముద్ర మార్గాలే కీలకం. ప్రపంచ ఆయిల్ సరఫరాను పూర్తిగా కంట్రోల్ చేసే 5 అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గాలు ఉన్నాయి.

ఈ ప్రాంతాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ రిపోర్టు ప్రకారం, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆ 5 సముద్ర మార్గాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

26
1. మలక్కా జలసంధి

ప్రపంచంలోనే అత్యధికంగా చమురు రవాణా జరిగే సముద్ర మార్గాలలో మలక్కా జలసంధి మొదటి స్థానంలో ఉంది. ఈ ఆయిల్ రవాణా మార్గం హిందూ మహాసముద్రాన్ని, పసిఫిక్ మహాసముద్రంతో కలుపుతుంది. రిపోర్టుల ప్రకారం, 2026 మొదటి అర్ధభాగంలో ఈ మార్గం ద్వారా రోజుకు సగటున 21.4 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది. ఆసియా దేశాలకు ఆయిల్ చేరవేయడంలో ఈ మార్గం వెన్నెముక లాంటిది.

36
2. హార్ముజ్ జలసంధి

ప్రపంచంలోనే అత్యంత కీలకమైన, సున్నితమైన ఆయిల్ మార్గాలలో హార్ముజ్ జలసంధి ఒకటి. ఇది ఒమన్‌లోని ముసందమ్ ద్వీపకల్పం, ఇరాన్ దేశాల మధ్య ఉంది. ప్రపంచంలోని మొత్తం ఆయిల్ సరఫరాలో దాదాపు 20 శాతం ఈ ప్రాంతం నుంచే రవాణా అవుతుంది. ఈఐఏ రిపోర్టు ప్రకారం, 2026 మొదటి అర్ధభాగంలో ఇక్కడి నుండి రోజుకు సగటున 15.0 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా నమోదైంది.

46
3. సూయజ్ కాలువ, సుమెద్ పైప్‌లైన్

అంతర్జాతీయ వాణిజ్యంలో సూయజ్ కాలువకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మార్గం మధ్యధరా సముద్రాన్ని, ఎర్ర సముద్రంతో కలుపుతుంది. సూయజ్ కాలువతో పాటు సుమెద్ పైప్‌లైన్ ద్వారా భారీ స్థాయిలో చమురు రవాణా జరుగుతుంది. 2026 మొదటి అర్ధభాగంలో ఈ ప్రాంతం గుండా రోజుకు సగటున 8.3 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ రవాణా జరిగినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.

56
4. బాబ్ ఎల్ మండేబ్ జలసంధి

చమురు రవాణాలో మరో ప్రధానమైన మార్గం బాబ్ ఎల్ మండేబ్ జలసంధి. ఈ సముద్ర మార్గం ఎర్ర సముద్రాన్ని, గల్ఫ్ ఆఫ్ ఏడెన్‌తో అనుసంధానిస్తుంది. రిపోర్టుల వివరాల ప్రకారం, 2026 మొదటి అర్ధభాగంలో ఈ జలసంధి ద్వారా రోజుకు సగటున 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది.

66
5. కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం

ఆఫ్రికా ఖండం చివరన ఉండే కేప్ ఆఫ్ గుడ్ హోప్ సముద్ర మార్గం కూడా ఆయిల్ రవాణాలో చాలా ముఖ్యమైనది. 2026 మొదటి అర్ధభాగంలో ఈ మార్గం ద్వారా రోజుకు సగటున 8.3 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణా జరిగింది. ఇదిలా ఉండగా, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో హార్ముజ్ జలసంధి ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇలా ఈ ఐదు మార్గాల్లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే ప్రపంచం మొత్తం ప్రభావం పడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories