Jio : జియో కాదు ఇక జియో 2.0 .. 2027 సంవత్సరమంతా అన్ లిమిటెడ్ 5G, 4G డేటా పొందే ఛాన్స్

Published : Nov 23, 2026, 08:42 PM IST

రిలయన్స్ జియో తమ కస్టమర్లకు న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త ఆఫర్లను అందించేందుకు సిద్దమయ్యింది. అన్ లిమిటెడ్ 5G, 4G డేటాతో కూడిన ప్లాన్స్ ను ప్రకటించింది. వాటిగురించి ఇక్కడ తెలుసుకుందాం.

PREV
14
జియో న్యూఇయర్ ఆఫర్స్

రిలయన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే రీఛార్జ్ ఆఫర్లు తీసుకొచ్చింది. తన 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ‘హ్యాపీ న్యూ ఇయర్ 2.0’ (Happy New Year 2.0) పేరుతో కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా, ఏడాది మొత్తం వ్యాలిడిటీతో కూడిన ప్లాన్లతో పాటు తక్కువ ధరలో డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ కూడా ఉన్నాయి. మొబైల్ డేటా ఎక్కువగా వాడేవారితో పాటు ఏడాది మొత్తం ఒకే రీఛార్జ్‌తో సేవలు పొందాలనుకునే వారికి ఈ ప్లాన్లు ఉపయోగపడనున్నాయి.

ముఖ్యంగా రూ.399 నెలవారీ ప్లాన్, రూ.3,999 వార్షిక ప్లాన్‌తో పాటు రాత్రివేళ ప్రత్యేకంగా అన్‌లిమిటెడ్ డేటా అందించే సరికొత్త ప్యాక్‌ను జియో తీసుకొచ్చింది. ఈ కొత్త ప్లాన్లలో డేటా, కాల్స్ మాత్రమే కాకుండా పలు డిజిటల్ సేవలను కూడా ఉచితంగా అందిస్తోంది.

24
రూ.399 కే అన్‌లిమిటెడ్ డేటా ప్లాన్

జియో తీసుకొచ్చిన కొత్త ప్లాన్లలో రూ.399 రీఛార్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. ఇందులో అన్‌లిమిటెడ్ 4G, 5G డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు అందిస్తోంది. మొబైల్ డేటాను ఎక్కువగా ఉపయోగించేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడేలా రూపొందించింది.

ఇందులో రీఛార్జ్‌తో పాటు పలు డిజిటల్ సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. 12 నెలల కాన్వా ప్రో (Canva Pro) సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది… దీని విలువ సుమారు రూ.4,000 ఉంటుంది. అలాగే జియో హాట్ స్టార్ మొబైల్ (JioHotstar Mobile), హాలీవుడ్ కంటెంట్, జియో టివి (JioTV) ద్వారా FanCode (ఫ్యాన్ కోడ్) సబ్‌స్క్రిప్షన్, జియో గేమ్స్ (JioGames) మొబైల్ సబ్‌స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు జియో ఏఐ క్లౌడ్ (JioAICloud) ద్వారా 50GB క్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది. జస్ట్ డయల్ లైట్ (JustDial Lite), హైపర్ లోకల్ కూపన్లు, డిజిటల్ డైరీ (Digital Diary) వంటి అదనపు డిజిటల్ సేవలు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా అందిస్తోంది జియో.

34
రూ.3,999 రీఛార్జ్‌ ప్లాన్

ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవడం ఇబ్బందిగా భావించే కస్టమర్ల కోసం జియో రూ.3,999 వార్షిక ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఏడాది మొత్తం అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 SMSలతో పాటు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటా ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో 12 నెలల కాన్వా ప్రో లైట్ (Canva Pro Lite) సబ్‌స్క్రిప్షన్ అందిస్తోంది... దీని విలువ రూ.1,590. జియో హాట్ స్టార్ మొబైల్ (JioHotstar Mobile), హాలీవుడ్ కంటెంట్, జియో టివి ద్వారా FanCode, JioAICloud లో 50GB స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏడాది మొత్తం ఒకే రీఛార్జ్‌తో కనెక్టివిటీ కొనసాగించాలనుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది.

44
అన్‌లిమిటెడ్ 5G డేటా ప్లాన్

ఎప్పుడైనా డేటా అవసరం పెరిగితే ఉపయోగించుకునేందుకు రూ.15, రూ.25 ధరలతో రెండు ప్రత్యేక 5G డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ తీసుకొచ్చింది జియో. రూ.15 ప్యాక్ ఒక రోజు వ్యాలిడిటీతో, రూ.25 ప్యాక్ రెండు రోజుల వ్యాలిడిటీతో డేటా అందుబాటులో ఉంటుంది. ఎక్కువ డేటా అవసరమయ్యే సమయంలో వీడియోలు చూడటం, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి పనులకు వీటిని వినియోగించుకోవచ్చు.

రాత్రివేళ డేటా ఎక్కువగా డేటా వినియోగించే వారికి మరో ప్రత్యేక ఆఫర్ అందిస్తోంది జియో. రూ.50తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన అన్ లిమిటైడ్ నైట్ డేటా (Unlimited Night Data) యాడ్ ఆన్ ప్యాక్ తీసుకొచ్చింది. ఇందులో ప్రతిరోజూ రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అన్‌లిమిటెడ్ 4G, 5G డేటాను వినియోగించుకోవచ్చు. ఈ డేటా సాధారణ డే డేటా పరిమితికి అదనంగా అందుబాటులో ఉంటుంది. రాత్రివేళ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసేవారు, గేమ్స్ ఆడేవారు, పెద్ద ఫైల్స్ డౌన్‌లోడ్ చేసుకునేవారు, క్లౌడ్ బ్యాకప్ తీసుకునేవారికి ఈ ప్యాక్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు, నైట్ షిఫ్ట్ ఉద్యోగులు ఈ ఆఫర్ ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.

డేటా, డిజిటల్ సేవలపై జియో ఫోకస్

హ్యాపీ న్యూ ఇయర్ 2.0 ప్లాన్ల ద్వారా కేవలం మొబైల్ కనెక్టివిటీ మాత్రమే కాకుండా ఎంటర్‌టైన్‌మెంట్, గేమింగ్, క్లౌడ్ స్టోరేజ్, డిజైన్ వంటి డిజిటల్ సేవలను కూడా ఒకే రీఛార్జ్‌లో అందించడంపై జియో దృష్టి పెట్టింది. నెలవారీ, వార్షిక ప్లాన్లతో పాటు తక్కువ వ్యాలిడిటీ కలిగిన డేటా ప్యాక్‌లను అందించడం ద్వారా వివిధ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తోంది. అయితే అన్‌లిమిటెడ్ డేటా, ఇతర అదనపు ప్రయోజనాలు పొందేందుకు జియో వర్తించే నిబంధనలు, అర్హతలు, ప్లాన్ షరతులు పాటించాల్సి ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories