Mongoose vs Snake Venom: ముంగిసకు పాము విషం ఎందుకు ఎక్కదు? అసలు సైన్స్ ఏంటో తెలుసా?

Published : Nov 23, 2026, 07:34 PM IST

Mongoose vs Snake Venom: ముంగిస పాముతో పోరాడినప్పుడు పాము కాటేసినా దానికి విషం ఎందుకు ఎక్కదు? ఇది ప్రకృతిలోని అద్భుతమైన జీవశాస్త్ర రహస్యాల్లో ఒకటి. అయితే ముంగిసకు పాము విషం అస్సలు పనిచేయదనేది పూర్తిగా నిజం కాదు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.

PREV
15
పాము కాటేసినా ముంగిస ఎందుకు చావదు? ఈ 4 సీక్రెట్స్ తెలిస్తే షాక్ అవుతారు

ముంగిస, పాము ఫైట్ అంటే చూసేవాళ్లకు ఎప్పుడూ ఒక థ్రిల్ ఉంటుంది. పాము కాటేసినా ముంగిసకు విషం అస్సలు ఎక్కదు అనే మాట మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. నిజానికి ముంగిసకు పాము విషాన్ని తట్టుకునే శక్తి మాత్రమే ఉంది కానీ, పూర్తిగా అంటే 100 శాతం రక్షణ లేదు.

నాగుపాము ప్రమాదకరమైన పాముల విషంలో న్యూరోటాక్సిన్ ఉంటుంది. వేరే జంతువులకు పాము కరిస్తే, ఈ విషం నరాల నుంచి కండరాలకు వెళ్లే సిగ్నల్స్‌ను బ్లాక్ చేస్తుంది. దానివల్ల పక్షవాతం వచ్చి శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ ముంగిస శరీరంలో ఉండే అసిటైల్‌కోలిన్ రిసెప్టర్ల ఆకారం గ్లైకోసైలేషన్ ప్రక్రియ వల్ల కొంచెం వేరేలా ఉంటుంది. అందుకే విషంలోని అణువులు ఆ రిసెప్టర్లకు సరిగ్గా అతుక్కోలేవు. దీనివల్ల ముంగిసకు న్యూరోటాక్సిన్ ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది.

25
రక్తంలో ఉండే స్పెషల్ ప్రోటీన్లు

పాముల విషంలో న్యూరోటాక్సిన్ ఒక్కటే ఉండదు కదా. రక్తపింజర లాంటి పాముల విషంలో హెమోటాక్సిన్స్ ఉంటాయి. ఇవి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం కలిగిస్తాయి. ఇలాంటి విషం నుంచి తనను తాను కాపాడుకోవడానికి ముంగిస రక్తంలో ప్రత్యేకమైన ప్రోటీన్లు ఉంటాయి.

ఈ ప్రోటీన్లు విషంలోని ఎంజైమ్‌లను నిర్వీర్యం చేయడంలో హెల్ప్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, విషం తన పని తాను చేయకుండా ముంగిస బాడీలోని ఈ ఫ్యాక్టర్లు అడ్డుకుంటాయి. అందుకే విషం ఎక్కినా సాధారణ జంతువుల్లా ముంగిస అంత త్వరగా కుప్పకూలిపోదు.

35
థిక్ స్కిన్, నిక్కబొడుచుకునే బొచ్చు ఎలా కాపాడతాయి?

ముంగిస బాడీ స్ట్రక్చర్ కూడా ఫైట్ టైమ్‌లో దానికి బాగా పనికివస్తుంది. ముంగిసకు దట్టమైన బొచ్చు, మందపాటి చర్మం ఉంటాయి. పాముతో పోరాడేటప్పుడు ముంగిస తన శరీరంపై ఉన్న బొచ్చును నిక్కబొడుచుకుంటుంది. దీనివల్ల చూసేందుకు అది పెద్దగా కనిపించడమే కాకుండా, పాము కోరలు నేరుగా లోపలి చర్మానికి గుచ్చుకోకుండా అడ్డుకుంటుంది.

ఒకవేళ పాము కోరలు ఎలాగోలా చర్మానికి తగిలినా, స్కిన్ మందంగా ఉండటం వల్ల విషం రక్తంలోకి వెళ్లే ఛాన్స్ తగ్గుతుంది. ఇది కూడా ముంగిస సేఫ్‌గా ఉండటానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్.

45
మెరుపు వేగంతో పామును ముంగిస ఎలా చిత్తు చేస్తుంది?

ముంగిస గెలుపులో కేవలం బాడీ లోపల ఉండే ఇమ్యూనిటీ మాత్రమే కాదు, దాని మెరుపు వేగం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. పాము కాటు వేయడానికి ముందే ముంగిస ఎంతో చురుగ్గా పక్కకు తప్పుకుంటుంది.

పాము కదలికలను క్షణాల్లో పసిగట్టి, పాము అలసిపోయే వరకు దాన్ని విసిగిస్తూనే ఉంటుంది. పాము నీరసించిపోయిన తర్వాత, కరెక్ట్ టైమ్ చూసి దాని తల వెనుక భాగంలో గట్టిగా కొరికి చంపుతుంది. విషం తగలకుండా తప్పించుకోవడంలోనే ముంగిస సగం గెలుస్తుంది.

55
పాము విషంతో ముంగిసకు కూడా ప్రమాదం ఉందా?

ముంగిసకు విషాన్ని తట్టుకునే కెపాసిటీ ఉంది కదా అని, అది ఎప్పుడూ సేఫ్‌గా ఉంటుందని అనుకోకూడదు. దీనికి కచ్చితమైన పరిమితులు ఉన్నాయి. అత్యంత విషపూరితమైన పాము ఒకేసారి ఎక్కువ మోతాదులో విషాన్ని ఎక్కించినా, లేదా చాలాసార్లు కరిచినా ముంగిస కూడా చనిపోయే అవకాశం ఉంటుంది.

అందుకే ముంగిసను విషానికి పూర్తిగా అతీతమైన జీవిగా కాకుండా, ప్రకృతిలో అద్భుతమైన అడాప్టేషన్స్ కలిగిన పోరాట యోధుడిగా చూస్తారు. దాని వేగం, తెలివి, శరీర నిర్మాణం కలగలిసి ఇతర జీవులతో దాన్ని ప్రత్యేకంగా ఉంచుతున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories