అయ్యాయ్యో అందమంతా తేనెటీగలు జుర్రేస్తున్నాయే..బీస్‌తో ఏంజెలినా జోలి ఫోటో షూట్‌.. షాక్‌లో ఫ్యాన్స్!

First Published May 23, 2021, 5:53 PM IST

హాలీవుడ్‌ హీరోయిన్‌ ఏంజెలినా జోలి డిఫరెంట్‌గా ఫోటో షూట్‌లో పాల్గొంది. ఏకంగా ఈ వరల్డ్ ఫేమస్‌ స్టార్‌ తేనెటీగలతో ఫోటో షూట్‌లో పాల్గొని షాక్‌ ఇచ్చింది. ఈ లేటెస్ట్ ఫోటో షూట్‌ వరల్డ్ వైడ్‌గా వైరల్‌గా మారింది.

హలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్లలో ఏంజెలినా జోలిదీ టాప్‌ ప్లేస్‌. గాడ్‌ 60 కేజీల అందాన్ని పోత పోస్తే ఏంజెలినా జోలి పుట్టిందని ఆమె అభిమానులే కాదు, ప్రపంచ మీడియా సైతం చెబుతుంది. ఆమె అందాలను ప్రశంసలు కురిపిస్తుంది. అసలు ఇంత అందంగా ఎలా పుట్టారో అనిపిస్తుంది.
undefined
ప్రపంచంలోని స్టార్‌ హీరోయిన్స్ లో టాప్‌ రెమ్యూనిరేషన్‌ అందుకు నటిగా నిలిచింది ఏంజెలినా. ఆస్కార్‌ అవార్డులతోపాటు, గోల్డెన్‌ గ్లోబ్‌ వంటి ప్రపంచ ప్రతిష్టాత్మక పురస్కారాలను సైతం సొంతం చేసుకుని అత్యంత హైలీ రేటెడ్‌ ప్రొఫైల్‌ని మెయింటేన్‌ చేస్తుందీ అందాల భామ.
undefined
ఈ అమ్మడు అందాలు ఆరబోస్తూ అనేక మార్లు ఫోటో షూట్లు ఇచ్చింది. న్యూడ్‌గానూ ఫోటోలకు పోజులిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇంటెన్స్‌ సీన్లలో ఈ భామ రెచ్చిపోయి రక్తికట్టిస్తుంది. తాజాగా డిఫరెంట్‌గా ఫోటో షూట్‌ చేసి తన ఫ్యాన్స్ నే కాదు, సినిమా వర్గాలను షాక్‌కి గురి చేసింది.
undefined
ఏంజెలినా జోలి తాజాగా తేనెటీగలతో ఫోటో షూట్‌ లో పాల్గొంది. దాదాపు 18 నిమిషాల పాటు తేనెటీగలకు తన శరీరంపై వేసుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చేసిన ఈ సాహసం గురించి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
undefined
ఇంతకీ ఇదెలా సాధ్యమైంది? , అవి కుడితే ఆమె పరిస్థితి ఎలా ఉండేదని అని వారు చర్చించుకుంటున్నారు. అయితే ఈ సందేహాలపై ఫోటోగ్రాఫర్ బీకీపర్స్ డాన్ వింటర్స్ క్లారిటీ ఇచ్చాడు. తేనెటీగలు కుట్టకుండా.. నిదానంగా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
undefined
నేషనల్ జియోగ్రాఫిక్ సహకారంతో ఈ ఫోటో షూట్‌ చేశామని తెలిపారు. ఈ షూట్ కోసం ఇటాలియన్ తేనెటీగలను ఉపయోగించారని.. అలాగే సెట్లో ఉన్న ప్రతి సిబ్బందికి రక్షణ కోట్స్ ధరించారని.. కేవలం ఏంజెలీనాకు మాత్రమే సూట్ వేయలేదని చెప్పారు.
undefined
అలాగే తేనెటీగలు కుట్టకుండా ఉండటానికి సెట్ లో నిశ్శబ్ధంగా.. చీకటిగా ఉంచినట్లు తెలిపారు. ఈ ఫోటో షూట్ కోసం.. కీటక శాస్త్రవేత్త అయిన అవెడాన్ నుంచి అనుమతి తెచ్చుకున్నామని, ఏంజెలీనా దీని కోసం చాలా రిస్క్ చేసిందని డాన్ వింటర్స్ తెలిపారు.
undefined
`హ్యాకర్స్` సినిమాతో పాపులర్‌ అయిన ఏంజెలినా జోలి `జియా`, `గర్ల్ ఇంటరప్టెడ్‌`, `లారా క్రాఫ్ట్ః టాంబ్‌ రైడర్‌`,`ది టూరిస్ట్`, `ఏ మైటీ హార్ట్`, `ఛేంజిలింగ్‌`, `మేలిఫిషియంట్‌`, `అన్‌ బ్రోకెన్‌`, `ఫస్ట్ దే కిల్డ్ మై ఫాదర్‌` వంటి టాప్‌ బ్లాక్స్ బస్టర్స్ లో నటించి మెప్పించింది ఏంజెలినా జోలి.
undefined
ఇందులో `మేలిఫిషియంట్‌` చిత్రం నటిగా ఏంజెలినాని పీక్‌లోకి తీసుకెళ్లింది. ప్రపంచ స్థాయిలో గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఇటీవల `థోస్‌ హూ విష్‌ మి డెడ్‌` చిత్రంలో మెరిసింది. ఇప్పుడు `ఎటర్నల్స్ `చిత్రంలో నటిస్తుంది. ఇది విడుదలకు రెడీ అవుతుంది.
undefined
click me!